English | Telugu
Brahmamudi : కాసేపట్లో అప్పు పెళ్ళి.. పెళ్లికూతురు గదిలోకి రాజ్ వెళ్ళి...
Updated : Aug 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi).ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -479 లో.....నీ మనసులో ప్రేమ పెట్టుకొని ఇంత వరకు ఎందుకు రానిచ్చావ్ .. ఇదంతా ఎవరి కోసం.. మనం హ్యాపీగా ఉంటే చాలు.. నువ్వు ఇంకా కళ్యాణ్ ని ప్రేమిస్తున్నట్ల విషయం చెప్పవా అని అప్పుని స్వప్న ఆడుగుతుంది. వాడు నన్ను ఒక ఫ్రెండ్ లాగే చూస్తున్నాడు.. నాకు ఇలా జరిగిందని జాలిగా చూస్తున్నాడని అప్పు అంటుంది. నేను వెంటనే వెళ్లి ఈ పెళ్లి ఆపుతానంటూ స్వప్న వెళ్తుంటే.. నువ్వు ఇప్పుడు వెళ్తే చచ్చిపోతానంటూ అప్పు బ్లాక్ మెయిల్ చేస్తుంది.
ఆ తర్వాత అబ్బాయి వాళ్ళు మండపానికి వస్తారు. వాళ్ళకి స్వప్న, కావ్య ఇద్దరు హారతి ఇచ్చి ఆహ్వానిస్తారు. ఆ తర్వాత రుద్రాణి ధాన్యలక్ష్మిని పక్కకి తీసుకొని వెళ్లి మాట్లాడుతుంది. కళ్యాణ్ కి స్వప్న ఫోన్ చేసి.. అప్పు ఇంకా నిన్ను ప్రేమిస్తుంది. ఇంట్లో వాళ్ళ కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటుంది. నువ్వు, ఇంకా అప్పుని ఫ్రెండ్ లాగా చూస్తున్నావో లేదో తెలియదు కానీ ఇంకో రెండు గంటల్లో అప్పు పెళ్లి అవుతుంది. ఇక నీ ఇష్టమని కళ్యాణ్ కి స్వప్న చెప్తుంది. ఆ మాటలు రాజ్ వింటాడు. ఇక అప్పు, కళ్యాణ్ లని నమ్ముకుంటే లాభం లేదు.. నేనే ఏదో ఒకటి చెయ్యాలని రాజ్ అనుకుంటాడు.. మరొకవైపు అప్పు పెళ్లి చేసుకోవడానికి సిద్దపడింది.. మర్చిపోయిందనుకున్న కానీ ఇంకా ప్రేమిస్తుందంటే ఇక నేను ఆగలేను.. కుటుంబం కోసం మేమ్ బాధపడడం కరెక్ట్ కాదని కళ్యాణ్ పెళ్లి ఆపాలని అనుకుని వెళ్తుంటే డోర్ బయట నుండి గడియ పెడతారు. ఆ తర్వాత డోర్ లాక్ అయితే వేసావ్ కదా అని రుద్రాణి ని ధాన్యలక్ష్మి అడుగుతుంది. వేసాను ఇదిగో కీ కూడా పట్టుకొచ్చానని రుద్రాణి అంటుంది.
ఆ తర్వాత రాజ్ పెళ్లికొడుకు దగ్గరికి వెళ్లి అప్పు కళ్యాణ్ ఇద్దరు ప్రేమించుకున్నారని చెప్తాడు. లేదండి అప్పు ఇందాకే నేనంటే ఇష్టమని చెప్పిందని పెళ్లికొడుకు చెప్తాడు. ఆ మాటలు కావ్య విని కోప్పడుతుంది. పెళ్లి చెడగొట్టడానికే వచ్చారా అని అనగానే.. అవునని రాజ్ అంటదు. పెళ్లి ఆపుతానని రాజ్.. నేను మిమ్మల్ని ఆపుతానంటూ కావ్య అంటుంది. ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. ఆ తర్వాత ఇంకొక కీ నానమ్మ దగ్గర ఉంటుందని ఇందిరాదేవికి కళ్యాణ్ ఫోన్ చేస్తాడు. తను ఇంకో కీ ఎక్కడ ఉందో చెప్తుంది. అప్పుడే ధాన్యలక్ష్మి వచ్చి ఫోన్ ఎవరు అని ఇందిరాదేవిని అడుగుతుంటే.. అప్పుడే ఇందిరదేవిని కనకం వచ్చి తీసుకొని వెళ్తుంది. అత్తయ్య గారితో ఫోన్ మాట్లాడింది కళ్యాణ్ అనుకుంటా అని ధాన్యలక్ష్మి అనగానే.. అమ్మ ఫ్రెండ్స్ ఎవరో చేసి ఉంటారని రుద్రాణి అంటుంది. ఆ తర్వాత కళ్యాణ్ డోర్ ఓపెన్ చేసుకొని బయటకు వస్తాడు.
ఆ తర్వాత అందరి కళ్ళు కప్పి వాళ్ళ పెళ్లి చెయ్యాలని రాజ్ అనుకొని.. అప్పు గదిలో ఉందనుకొని మనసులో కళ్యాణ్ పెట్టుకుని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నవ్.. నీకు ఇదే అవకాశం దైర్యం చెయ్ కళ్యాణ్ దగ్గరికి తీసుకొని వెళ్తాను వస్తావా అని రాజ్ అనగానే.. లోపల ఉన్న కావ్య వస్తానని అప్పులాగా అంటుంది. దాంతో రాజ్ బయట కార్ తో రెడీ గా ఉంటాడు. కావ్య వచ్చి కార్ లో కూర్చొని ఉంటుంది. అప్పుడే ప్రకాష్ వచ్చి ఎక్కడికి అని రాజ్ అడుగుతాడు.
తరువాయి భాగంలో పెళ్లి జరిగే టైమ్ కి అప్పు కన్పించదు. ఇక్కడ అప్పు లేదు.. అక్కడ కళ్యాణ్ లేడు.. ఇద్దరు కలిసి ఎక్కడికో వెళ్లిపోయారని ధాన్యలక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.