English | Telugu

Guppedantha Manasu : బావని వెతుక్కుంటూ మరదలు ఆ ఇంటికి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1145 లో.... దేవయాని వచ్చి రిషి, వసుధారలని గదిలోకి వెళ్ళమని చెప్తుంది. వాళ్ళు వెళ్ళగానే ఎందుకు మమ్మీ అలా చెప్పావ్.. వాడు ఆ వసుధారతో ఎలా ఉంటాడని శైలేంద్ర అనగానే.. నీకు వాడు రిషినో రంగానో అన్న డౌట్ ఉంది కదా ఇప్పుడు తెలుస్తుంది.. వాడు ఎవరనేది రంగా అయితే గదిలో నుండి బయటకు వస్తాడు. రిషి అయితే లోపలే ఉంటాడని దేవయాని అంటుంది. కనిపెట్టాడనికి ఈ ప్లాన్ తప్ప మరొకటి నీ దగ్గర ఉందా అని దేవయాని అంటుంది.

ఆ తర్వాత వసుధార దగ్గరికి రిషి వెళ్లి.. సరదాగా మాట్లాడతాడు. వసుధార వేలికి VR అనే అక్షరం గల రింగ్ ని పెడతాడు రిషి. ఇక నేను గదిలో నుండి బయటకు వెళ్తాను. ఎందుకంటే శైలేంద్ర అన్నయ్యకి నా పై డౌట్ వస్తుంది. అందుకే నేనే వెళ్ళాలని రిషి బయటకు వస్తాడు. హాల్లో ఉన్న శైలేంద్ర, దేవయాని చూసి వాడు రంగానే అనుకుంటారు. మమ్మీ నువ్వు వెళ్ళు నేను తమ్ముడితో మాట్లాడి వస్తానని శైలేంద్ర అంటాడు. నేను ఆ గదిలో ఉండలేను.. టార్చర్ లాగా ఉంది.. నేను వెళ్ళిపోతానని రంగా అంటాడు. వద్దు నువ్వు చెయ్యాల్సింది చాలా ఉంది నేను చెప్తుంటా నువ్వు చేస్తుండు.. ఇప్పుడు మేడపైన పడుకోమని శైలేంద్ర అనగానే.. లేదు మహేంద్ర దగ్గర పడుకుంటానని రిషి అనగానే.. సరే అంటాడు. ఆ తర్వాత మహేంద్ర దగ్గరికి రిషి వెళ్తాడు. ఇన్నిరోజులు రిషిని మిస్ అయినందుకు మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మహేంద్ర ఒళ్ళో రిషి తలవాల్చి పడుకుంటాడు.

ఆ తర్వాత తండ్రి దగ్గరికి కొడుకు వచ్చాడు. ఈ కొడుకు దగ్గరికి తండ్రి ఇంకా రావట్లేదని అనుపమతో మను అంటాడు. మనం మహేంద్ర వాళ్ళ దగ్గరికి వెళదాం.. వాళ్ళని చుసినట్టుంట్టుందని మను అనగానే.. తర్వాత ఎప్పుడైనా వెళదామని అనుపమ అంటుంది. మరుసటి రోజు శైలేంద్ర ఇంటికి సరోజ వస్తుంది. బావ బావ అంటూ ఇంట్లోకి వస్తుంది. ఎవరు నువ్వు అంటూ ఫణీంద్ర , మహేంద్ర అడుగుతారు. శైలేంద్ర టెన్షన్ పడుతూ.. మీ బావ ఎవరని అడుగుతాడు. నా బావని నువ్వే తీసుకొని వచ్చవని సరోజ అంటుంది. అప్పుడే వసుధార, రిషి లు వస్తారు. బావ అంటూ రిషి దగ్గరికి వెళ్తుంది సరోజ. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.