English | Telugu
Brahmamudi : బ్రహ్మముడిలో ఊహించని మలుపు.. ఆ పెళ్ళికి కళ్యాణ్!
Updated : Aug 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -480 లో... పెళ్లి చెడగొట్టాలని అప్పు అనుకొని కావ్యని తీసుకొని వెళ్తాడు రాజ్. కావ్య కూడా సైలెంట్ గా ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే రాజ్ కి కార్ లో ఉంది అప్పు కాదు కావ్య అని తెలుస్తుంది. ఏ మెంటల్ నువ్వు ఇందులోకి ఎలా వచ్చావని రాజ్ అడుగుతాడు. మీరు గదిలో చెప్పింది నాతోనే, మీతో పాటు వచ్చింది అప్పు కాదు.. నేనే అని కావ్య అంటుంది. ఇంకా లేట్ చెయ్యకు.. అక్కడ పెళ్లి అవుతుందని రాజ్ కి కావ్య చెప్తుంది. దాంతో ఇద్దరు మండపానికి వెళ్తారు. మరొకవైపు కళ్యాణ్ కూడా వస్తుంటాడు.
ఆ తర్వాత రాజ్, కావ్య వస్తారు. ఇప్పుడు ఎందుకు వీళ్ళు బయటకు వెళ్లి వస్తున్నారని ధాన్యలక్ష్మితో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత పెళ్లి పీటలపైకి పెళ్లి కొడుకు వస్తాడు. అమ్మాయిని తీసుకొని రండి అని పంతులు గారు చెప్పగానే.. స్వప్న కంగారుగా వచ్చి అప్పు కన్పించడం లేదని చెప్తుంది. దాంతో అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత పదండి వెతుకుదామని అపర్ణ అనగానే.. ధాన్యలక్ష్మి అక్కడ నీ కొడుకు కూడా జంప్ అంట, ఇప్పుడే సెక్యూరిటీ కాల్ చేసాడని రుద్రాణి ధాన్యలక్ష్మితో అనగానే.. మీరు ఎక్కడ అని వెతుకుతారు.. మండపం దాటించింది మీరే కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. ఏం అంటున్నారని కావ్య అడుగుతుంది. ఇప్పుడు మీరే బయటకు నుండి వస్తున్నారు కదా అని ధాన్యలక్ష్మి అంటుంది. గదిలో పెట్టి తాళం వేసి ఉంచిన కూడా అక్కడ వాడు లేడు.. ఇక్కడ అప్పు లేదు ఇద్దరు వెళ్లిపోయారని ధాన్యలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత రాజ్, కావ్య లు వెతుకుతుంటారు. మరొకవైపు అప్పుని కిడ్నప్ చేసింది అనామిక అని తెలుస్తుంది. అనామికని చూసిన అప్పు షాక్ అవుతుంది. నన్ను తీసుకుని వచ్చింది నువ్వా? జైలు కి వెళ్ళావ్ ఇంకా సిగ్గు లేదా అని అనామికని అప్పు అడుగుతుంది. నేను విడాకులు తీసుకొని జైల్లోకి వెళ్ళడానికి కారణం నువ్వు.. అందుకే నా పగ నీతో మొదలు పెట్టాను.. ఇప్పుడు నిన్ను తీసుకొని వస్తే.. పెళ్లి ఇష్టం లేక నచ్చినవాడితో వెళ్లిపోయిందని అనుకునేలా చేశానని అనామిక అంటుంది. తరువాయి భాగంలో పెళ్లి ఆగిపోయి అందరు కనకం కుటుంబాన్ని తిడుతుంటే అప్పుడే కళ్యాణ్ వచ్చి స్టాపిట్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.