English | Telugu
ఇండియాలో ఆడవాళ్ళుగా పుట్టకుండా ఉండాల్సింది
Updated : Aug 4, 2024
కొంతమంది లేడీస్ రెగ్యులర్ గా ట్రోల్ అవుతూ ఉంటారు. అందులో అనసూయ, చిన్మయి శ్రీపాద రెగ్యులర్ గా ఉంటారు. సింగర్ చిన్మయి శ్రీపాద ఏం మాట్లాడినా తూటాల్లా ఉంటాయి మాటలు. రీసెంట్ గా ఆమె ఒక వీడియోని రిలీజ్ చేసింది. ఆ రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ రీల్ ఎవరి మీదో కాదు. చాగంటి కోటేశ్వరావు ప్రవచనం మీద.
"మంగళ కార్యం మీద వెళ్ళేటప్పుడు ఆడది ముందు, పురుషుడు వెనక నడవకూడదు..ఒకవేళ అలా వస్తే గనక అమంగళ కార్యం మీద వస్తున్నట్టు గుర్తు" అని ఒక ప్రవచనం చెప్పారు చాగంటి. ఆ వీడియో మీద చిన్మయి కౌంటర్లు వేసింది. "అవును నడకకి రూల్స్, ముందు వెళ్తే రూల్స్, ఇవన్నీ ఏ రాముడు, కృష్ణుడు, పరమశివుడు చెప్పారో.. అసలు మనందరం ఇండియాలో ఆడవాళ్ళుగా పుట్టకుండా ఉండాల్సింది" అంటూ చిన్మయి చేసిన కామెంట్స్ వేరే లెవెల్ లో ఉన్నాయి.
చిన్మయి అసలే గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. పిల్లల అనుమతి లేకుండా వారిని ముట్టుకోవడం, పట్టుకోవడం, ముద్దులు పెట్టుకోవడం వంటివి తప్పు అంటూ చిన్మయి చెబుతూనే ఉంది. మరోవైపు తమ సొంత పిల్లల్ని ప్రేమతో తాకడం, హగ్ చేసుకోవడం తప్పు ఎలా అవుతుందంటూ నెటిజన్లు కూడా వాదించారు. అలాగే చిన్మయి.. ఒక చిన్న బాబుకు అనసూయ ఇచ్చిన లిప్ లాక్ మీద కూడా కౌంటర్లు వేసింది.