English | Telugu
బుల్లితెరని హీటెక్కించే రొమాంటిక్ ఎపిసోడ్!
Updated : Aug 6, 2024
తెలుగు సీరియల్స్ లో స్టార్ మా టీవీ సీరియల్స్ కి ఫ్యాన్ బేస్ గట్టిగానే ఉంది. వీటిల్లో బ్రహ్మముడి టాప్ ర్యాంకింగ్ లో ఉండగా కార్తీకదీపం-2 రెండవ స్థానంలో ఉంది. ఇక ఎప్పటినుండో టీఆర్పీ కోసం కష్ట పడుతున్న సీరియల్ ' గుప్పెడంత మనసు(Guppedantha Manasu)'.
మధ్యకాలంలో తన టీఆర్పీనీ రోజు రోజుకి పెంచుకుంటుంది గుప్పెడంత మనసు. దీనికి కారణం లేకపోలేదు. రిషి, వసుధారల కలిసిన వేళ.. రంగానే రిషి అని పరిచయం అయిన వేళ .. ఈ సీరియల్ కి మంచి రోజులు వచ్చేశాయి. అందుకే టీఆర్పీ పెరుగుతూ వస్తోంది. గత కొంత కాలంగా రిషి లేకుండా సాగిన ఈ సీరియల్ రిషి రాకతో కొత్త ఒరవడి సృష్టించింది. రిషి, వసుధారల ఆన్ స్క్రీన్ జంటకి అత్యధిక ఫ్యాన్ బేస్ ఉంది. ఇక స్టార్ మా టీవీ సీరియళ్స్ ప్రోమోలు అన్నీ రిలీజ్ అవ్వగా.. అత్యధిక వీక్షకాధరణతో గుప్పెడంత మనసు ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.
తాజాగా విడుదలైన గుప్పెడంత మనసు ప్రోమోలో .. వసుధార స్నానం చేసి టవల్ తో జడ తూడుస్తుండగా రిషి వస్తాడు. తనని అలా చూసి బిగుసుకుపోతాడు. ఇక ఏమారపాటులో ఉన్న రిషి దగ్గరికి వసుధార వచ్చి.. ఏంటి అలా చేస్తున్నావని అడుగగా.. ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అర్థం అవ్వట్లేదు.. ఇక మిస్ అవ్వను అంటు రిషి సమాధానం చెప్తాడు. వీరిద్దరి కాంబోలో వచ్చే సీన్స్ కి సపరేట్ ఫ్యాన్ పేజీలే ఉన్నాయి. ఈ ప్రోమో కింద కామెంట్లలో.. రిషీధారలని ఇలా చూస్తుంటే అలానే చూస్తుండిపోవాలనిపిస్తుందని ఒకరు కామెంట్ చేయగా, మరొకరు ఏకంగా కవిత్వమే రాశారు. యూట్యూబ్ ఈ సీరియల్ ప్రోమోకే అత్యధిక కామెంట్లు వస్తాయి. ఇక ఈ ఎపిసోడ్ మోస్ట్ రొమాంటిక్ గా సాగుతుందని తెలుస్తుంది. మరి ఈ ఎపిసోడ్ కోసం ఎంతమంది వెయిటింగ్ కామెంట్ చేయండి.