English | Telugu
Karthika Deepam 2 : నా కూతురికి తండ్రివని కోర్టులో చెప్పే దమ్ము నీకుందా..?
Updated : Aug 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీకదీపం 2 '(karthika deepam 2). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -114 లో....కార్తీక్ ఇంటికి నరసింహా డ్రింక్ చేసి వచ్చి.. ఒరేయ్ కార్తీక్ బయటకు రారా అంటూ గట్టిగా అరుస్తాడు. కార్తీక్ తో పాటు శ్రీధర్ కాంచనలు కూడా బయటకు వస్తారు. ఎందుకు వచ్చావ్ రా అని కార్తీక్ అడుగుతాడు. నా పెళ్ళాం జోలికి నా కూతురు జోలికి రాకుండా అడ్డుపడ్డావ్ కదా ఇప్పుడు కేసు కోర్ట్ కి వెళ్ళిందని నరసింహా అంటాడు. ముందు ఇక్కడ నుండి వెళ్ళిపోమని కార్తీక్ అంటాడు. వాడిని మెడపట్టి బయటకు గెంటమని శ్రీధర్ అంటాడు. నీకు ఒక ఛాలెంజ్ చెయ్యడానికి వచ్చానని నరసింహా అంటాడు. నువ్వు నా కూతురు తండ్రి అని మొన్న హాస్పిటల్ లో చెప్పావ్ కదా నీకు దమ్ముంటే రేపు కోర్ట్ లో ఆ విషయం చెప్పగలుగుతావా.. నాకు దమ్ము ఉంది కాబట్టి కోర్టులో కేసు వేసా.. రేపెలా అడ్డుకుంటావో చూస్తానని నరసింహా అంటాడు. ఆ తర్వాత శౌర్యని తీసుకొని వెళ్లడం కాదు.. తన చేతిని కూడా పట్టుకోనివ్వనని నరసింహాకి కార్తిక్ వార్నింగ్ ఇస్తాడు. రేపు నా కూతురిని ఎత్తుకొని తీసుకొని వెళ్తానని నరసింహా అంటాడు.
నరసింహా వెళ్ళిపోయాక.. రేపు నువ్వు కోర్టుకి వెళ్లడం వద్దని శ్రీధర్ అనగానే.. వాడేదో రెచ్చగొట్టడానికి అలా అంటున్నాడు.. మీరు పట్టించుకోకండని కార్తీక్ అంటాడు. ఆ తర్వాత నరసింహా ఇంటికి వెళ్తాడు. కోర్టులో కేసు వేసా మనం గెలిచేలా ఆధారాలు సంపాదించాను.. రేపు ఈ టైమ్ కి శౌర్య ఈ ఇంట్లో ఉంటుందని నరసింహా అనగానే శోభ హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ అనసూయ మాత్రం టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత జ్యోత్స్న దగ్గరికి పారిజాతం వస్తుంది. హాస్పిటల్ నుండి మమ్మీ దీపని తీసుకొని వస్తుందని ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు.. అయిన ఆ దీప ఏ మొహం పెట్టుకొని వచ్చిందో నాకు అర్థం అవడం లేదని జ్యోత్స్న అంటుంది. రేపు కోర్ట్ కి వెళ్లి కార్తీక్ ఆవేశంలో ఏదో ఒకటి చేయకుండా అడ్డుపడాలని జ్యోత్స్నకి పారిజాతం చెప్తుంది.
మరుసటి రోజు ఉదయం దీప కార్తీక్ లు కోర్ట్ దగ్గర మాట్లాడుకుంటుంటారు. అప్పుడే పారిజాతం, జ్యోత్స్న వస్తారు. మిమ్మల్ని రావద్దని చెప్పాను కదా అని కార్తీక్ అంటాడు. దీపపై నాకు బాధ్యత ఉందని జ్యోత్స్న అంటుంది. ఆ తర్వాత లాయర్ జ్యోతి వస్తుంది. ఆప్పుడే నరసింహా లాయర్ కూడా వచ్చి జ్యోతితో మాట్లాడతాడు. ఓడిపోయే కేసుని ఎందుకు ఒప్పుకున్నారనగానే.. ఆ విషయం మీకెలా తెలుసు.. కోర్టులో చూసుకుందామని జ్యోతి అంటుంది. ఆ తర్వాత నరసింహా తన లాయర్ దగ్గరికి వస్తాడు. ఆవిడ అన్ని తెలివిగా మాట్లాడుతుంది. ఆ లాయర్ తో జాగ్రత్త అని నరసింహా లాయర్ నరసింహాకి చెప్తాడు. కోర్ట్ కి అనసూయ శోభ కూడా వస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.