జాను లైఫ్ స్టోరీ చూసి ...శేఖర్ మాస్టర్ ఎమోషనల్
బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్‌తో పాటు కొన్ని షోలు కూడా అలరిస్తున్నాయి. వాటిల్లో క్యాష్, బిగ్ బాస్, లతో పాటు ఢీ డ్యాన్స్ షో ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని పరిచయం చేస్తూ కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు. జడ్జులుగా నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. ఆమె జాను లైరి. తను ఆడితే అలానే చూడాలనిపచిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డ్యాన్సర్స్ సైతం జాను లైరి డ్యాన్స్ కి ఫిధా అయ్యారు.