English | Telugu

బ్రహ్మముడి కావ్యను డైరెక్టర్ ఏం చేయబోతున్నారు!


బిగ్ బాస్ సీజన్ 8 లో కొత్త కొత్త కంటెస్టెంట్స్ వెళ్ళబోతున్నారు. అసలు ఎవరెవరు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఊహాగానాలు ఐతే బాగా వినిపిస్తున్నాయి. ఐతే బ్రహ్మముడి కావ్య మాత్రం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను అని సోషల్ మీడియాలో తెగ గోల చేస్తోంది. తెలుగు బుల్లితెర చరిత్రలో మంచి రేటింగ్ తో దూసుకుపోతున్న గేమ్ షో ఏది అంటే టక్కున చెప్పే పేరు బిగ్ బాస్ . ఇప్పటికే 7 సీజన్స్ పూర్తి చేసుకున్న బిగ్ బాస్ 8 వ సీజన్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ నెలాఖరుకు కానీ నెక్స్ట్ మంత్ మొదటి వారంలో కానీ ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది. వీటికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రోమో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు దీపికా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్న అంటూ సందడి చేస్తోంది. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నా అంటూ తన సీరియల్ లో నటించేవాళ్లందరికీ ట్రీట్ ఇస్తున్నా అని చెప్పి చాకోలెట్స్ పంచింది. ఇక దీపికా రంగరాజు అంటే చాలు అల్లరికి కెరాఫ్ అడ్రెస్ కదా. దాంతో బిగ్ బాస్ హౌస్ లోకి దీపికా వెళ్తే ఇంకేమన్నా ఉంటుందా. ఎంటర్టైన్మెంట్ పక్కా అని నెటిజన్స్ కూడా అంటున్నారు. నెటిజన్స్ ఐతే విషెస్ చెప్తున్నారు. తమ సపోర్ట్ ఎప్పుడూ కావ్యకె ఉంటుంది అంటున్నారు.

ఇక ఇలాంటి దీపికా ఉంటె బిగ్ బాస్ హౌస్ వాళ్ళు కూడా ఈమెని ఎలిమినేట్ చేయరు అని కూడా అంటున్నారు. మరి దీపికా బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఎంటర్టైన్ చేస్తుందో చూడాలి. కాగా... బ్రహ్మముడి సీరియల్‌లో కావ్యకి చాలా మంది ఫ్యాన్స్ వున్నారు. అమె కోసమే సీరియల్ చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. మరి ఇప్పుడు దీపిక బిగ్ బాస్‌కి వెళ్లితే... బ్రహ్మముడిలోని కావ్య అలియస్ దీపిక క్యారెక్టర్‌ను డైరెక్టర్ ఎలా మలుపు తిప్పుతాడో అని అందరూ ఎదురుచూస్తున్నారు.