English | Telugu

నమిత వల్ల జైలుపాలైన భర్త.. రామలక్ష్మి ఏం చేయనుంది?

స్టార్ మా టీవీలో ప్రసారామవుతున్న సీరియల్ 'ఏటో వెళ్లిపోయింది మనసు' (Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -166 లో... సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. నేను తప్పు చేసానని ఎవరు నమ్మినా, నమ్మకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మాత్రం నన్ను నమ్మితే చాలని సీతాకాంత్ అనగానే.. మీ గురించి నాకు తెలుసు మీరు తప్పు చేసానంటే ఎలా నమ్ముతాను మీరు నిర్ధాషి అని రుజువు చేసి బయటకు తీసుకొని వస్తానని రామలక్ష్మి సీతాకాంత్ కి చెప్పి బయటకు వస్తుంటుంది. మీడియా వాళ్ళు సీతాకాంత్ గురించి తప్పుగా మాట్లాడుతారు. మీరు అలా మాట్లాడకండి మా వారు ఏ తప్పు చెయ్యలేదని నిరూపిస్తాను అని రామలక్ష్మి వాళ్ళతో అంటుంది. ఆ తర్వాత ఆ నమితని పట్టుకోవాలని రామలక్ష్మి అనుకొని.. మీరు ఇంటికి వెళ్ళండి తాతయ్య నేను వస్తానని అంటుంది.

మరొకవైపు శ్రీవల్లి, శ్రీలత, సందీప్ లు హ్యాపీగా ఫీల్ అవుతుంటారు. అప్పుడే రామలక్ష్మి ఇంటికి వస్తుంది. ఏదైనా దారి దొరికిందా అంటూ పెద్దాయన రామలక్ష్మిని అడుగగా.. లేదని రామలక్ష్మి చెప్తుంది. నా కొడుకికి ఎలాంటి సిచువేషన్ వచ్చిందంటూ శ్రీలత ఓవరాక్షన్ చేస్తుంది. ఇందులో ఏదో కుట్ర ఉంది ఉన్నట్టుండి అన్నయ్య పైన ఇంత పెద్ద నింద ఎలా పడిందని సిరి అంటుంది. అన్నయ్య గురించి అంతా తెలుసు ఎలాంటి వాడో తెలుసు అయిన సందీప్ అన్నయ్య కూడా సీతా అన్నయ్య తప్పు చేసాడని అందరితో పాటు అంటుంటే.. ఎంత వరకు కరెక్ట్ అని సిరి అంటుంది. నేను అక్కడ చూసింది చెప్పానని సందీప్ అనగానే.. రామలక్ష్మి తన చెంప పగులగొడుతుంది. ఆయన గురించి మాట్లాడే అర్హత లేదు అంటుంది. మా ఆయనని ఎందుకు కొట్టావ్ అక్క అని శ్రీవల్లి అడుగుతుంది. తప్పుడూ పనులు చేస్తూ అడ్డంగా దొరికిపోయిన మీ ఆయనని కొడితేనే నీకు అలా అనిపించింది.. నిజాయితీ మంచిగా ఉంటున్నా మా అయన గురించి తప్పుగా మాట్లాడితే నాకెలా ఉంటుందని రామలక్ష్మి అంటుంది.

ఆ తర్వాత నేను చేయలేని పని నువ్వు చేసావని పెద్దాయన రామలక్ష్మితో అంటాడు. ఆ తర్వాత రామలక్ష్మి గదిలోకి వచ్చి సీతాకాంత్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే పెద్దాయన వచ్చి నమిత ద్వారా అన్ని నిజాలు బయటపడుతాయని అంటాడు. ఇందాక అక్కడికే వెళ్ళాను తాళం వేసి ఉంది ఫోన్ కలవట్లేదని రామలక్ష్మి చెప్తుంది. మరొకవైపు రామలక్ష్మి గురించి సీతాకాంత్ ఆలోచిస్తాడు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి పైన నుండి వస్తుంటే.. శ్రీలత టీవీ చూస్తూ నాన్న సీతా అంటూ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.