English | Telugu
Guppedantha Manasu : శైలేంద్ర ముందు రిషి యాక్టింగ్.. డౌట్ పడిన సరోజ!
Updated : Aug 4, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు' (Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-1144 లో....రిషి వసుధారలు సరదాగా మాట్లాడుకుంటుంటే.. అప్పుడే మహేంద్ర వస్తాడు. అందరు జగతి గురించి మాట్లాడుకుంటారు. అనుపమ వాళ్ళు మన ఇంట్లో నుండి వెళ్లిపోయారని రిషికి మహేంద్ర చెప్తాడు. పాపం మను తన తండ్రి ఎవరో కనుక్కోకుండానే వెళ్ళిపోయాడని మహేంద్ర అనగానే.. మనుకి ఇంకా తన గురించి తెలియలేదా అని వసుధార ఆశ్చర్యపడుతుంది. అదేంటి నేను లెటర్ రాసి పెట్టి వెళ్ళాను కదా మను చూడలేదా.. ఆ శైలంద్ర ఏమైనా ప్లాన్ చేసి ఉంటాడా అని వసుధార అనుకుంటుంది.
ఆ తర్వాత రౌడీ పాండుకి శైలేంద్ర ఫోన్ చేస్తాడు. వసుధారని చంపలేదన్న విషయం తెలిసినట్లుందని అనుకొని రౌడీ ముందుగానే.. ఆ వసుధారని పాతిపెట్టిన చోట చూస్తే లేదు సర్ అని అంటాడు. అలా అనగానే అయ్యో మరి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయావా అని శైలేంద్ర వెటకారంగా మాట్లాడుతుంటాడు. అయ్యో ఈ విషయం మర్చిపోయాను సర్ అని పాండు ఫోన్ కట్ చేసి శైలేంద్ర నుండి తప్పించుకుంటాడు. వీడు తెలివిగా నా నుండి తప్పించుకున్నాడని శైలేంద్ర అంటాడు.
ఆ తర్వాత బుజ్జికి రిషి ఫోన్ చేసి.. రాధమ్మ గురించి కనుక్కుంటాడు. అప్పుడే సరోజ వచ్చి.. ఫోన్ లాక్కొని మాట్లాడుతుంది. నువ్వు రావాలి లేదంటే నువ్వు ఎక్కడున్నావో కనుక్కొని నేనే వస్తానని సరోజ అంటుంది. అప్పుడే రాధమ్మ వచ్చి.. నా మనవడు ఎక్కడికి వెళ్ళాడంటూ బాధపడుతుంది. ఆ తర్వాత శైలేంద్రతో వెళ్ళడంటూ బుజ్జి ఫోటో చూపిస్తాడు. అన్న ఇతనితో వెళ్లాడని బుజ్జి చెప్పగానే అతను సరోజని చూడడానికి వచ్చిన అబ్బాయి వాళ్ళ అన్న కదా అని రాధమ్మ అంటుంది. అతనితో బావ ఎందుకు వెళ్ళడంటూ సరోజ డౌట్ పడుతుంది. ఆ తర్వాత అనుపమకి మహేంద్ర ఫోన్ చేస్తే లిఫ్ట్ చెయ్యదు. మనుకి చేస్తాడు. మను లిఫ్ట్ చెయ్యగానే.. రిషి, వసుధారలు తిరిగి వచ్చారని చెప్పగానే.. మను, అనుపమ ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు.
ఆ తర్వాత రిషి నీతో మాట్లాడాలంటూ శైలేంద్ర వస్తాడు. అవసరం లేదని వసుధార అంటుంది. పది నిమిషాలలో రాకపోతే నేనే వస్తానని వసుధార అంటుంది. ఆ తర్వాత రిషిని పక్కకి తీసుకొని వెళ్లిన శైలేంద్ర.. అసలు నువ్వు రంగావేనా అని అడుగుతాడు. అదేంటి అలా అడుగుతున్నావ్.. నేనే రంగా.. నాకు ఇక్కడ కంఫర్ట్ గా లేదు.. అందరు ఒకే గానీ ఆ వసుధర గారితో కొంచెం ఇబ్బందిగా ఉందంటూ రిషి అనగానే.. అప్పుడే వసుధార వస్తుంది. తనని మేడమ్ గారు అని రిషి అనగానే.. ఏంటి మేడమ్ అంటున్నారని వసుధార ఏం తెలియనట్టు అడుగుతుంది. వెంటనే అలా కాదు మిస్టేక్ గా అన్నాడంటూ శైలేంద్ర కవర్ చేస్తాడు. అప్పుడే దేవయాని వస్తుంది. ఈ టైమ్ అయింది పడుకోండి అంటూ వసుధార, రిషిలని పంపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.