English | Telugu

అమ్మానాన్నలం కాబోతున్నాం.. మీ ఆశీర్వాదాలు అందించండి

రాకేష్ - సుజాత అమ్మా నాన్నలు కాబోతున్నారు. ఆ విషయాన్ని ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో రివీల్ చేశారు. ఒక మంచి సందర్భం చూసుకొని చెప్దామనే ఇన్నాళ్లు ఆగాం. "మా వివాహబంధం ఇంకో అడుగు ముందుకేసింది. ఈ విషయం షేర్ చేసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. అలాగే ఎమోషనల్ గానే ఉంది. మా ఇద్దరి ప్రేమకు ప్రతి రూపం ఈ ప్రపంచంలోకి రాబోతోంది. మీ అందరికీ ఈ విషయం చెప్పడానికి 9 నెలలు పట్టింది కానీ మా పెద్దవాళ్లకు చెప్పడానికి 9 నిమిషాలు పట్టింది. ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి మా ఆయన నన్ను ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. జన్మజన్మలకు ఆయనకు నేనే భార్యను కావాలి. మా తోటి కోడలు వీణ నన్నెంత బాగా చూసుకుంటుందో చెప్పలేను. నాకు ప్రెగ్నెన్సీ వచ్చినప్పటినుంచి మా ఆయన నన్ను ఇంటికి పంపలేదు. చేయాల్సిన కార్యక్రమాల విషయంలో కూడా వాళ్ళు చేయాలా వీళ్ళు చేయాలా అనేది కూడా ఎవరినీ అడగలేదు. నన్ను మా ఊరికి కూడా పంపలేదు. ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ సరిగా లేవు. ఊరిలో ఆస్పత్రులు లేవని పంపలేదు. అలాంటి సమయంలో నన్ను చాలా బాగా చూసుకుంది. ఇల్లు గుర్తు రాకుండా ప్రేమను పంచింది తోడికోడలు. ఇలా ఎమోషనల్ అయితాననే ఇన్నిరోజులు వీడియో చేయలేదు' అంటూ సుజాత కంటతడి పెట్టుకుంది. రాకేశ్ తనని తండ్రిని చేయబోతున్నందుకు సుజాతకు థ్యాంక్స్ చెప్పాడు. రాకేశ్ - సుజాత ఫ్యాన్స్ అంతా వాళ్లకు విషెస్ చెప్తున్నారు.