English | Telugu
Eto Vellipoyindhi Manasu : బొట్టు పెట్టండి.. అంతా మంచే జరుగుతుంది!
Updated : Aug 6, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu ).ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -167 లో....రామలక్ష్మిపై నుండి కిందకి వస్తుంది. టీవీలో సీతాకాంత్ గురించి న్యూస్ తప్పుగా రావడం తో.. అది చూస్తూ శ్రీలత ఓవరాక్షన్ చేస్తుంది. నా కొడుకు గురించి తప్పు గా వస్తుంటే చూడలేకపోతున్నానని అంటుంది. ఆ తర్వాత టీవీలోనే కాదు.. అన్ని న్యూస్ పేపర్స్ లలో అన్నయ్య గురించి అదే న్యూస్ వస్తుందని సందీప్ అంటాడు. అదంతా చూస్తూ రామలక్ష్మి బాధపడుతుంది.
అప్పుడే మాణిక్యం వస్తాడు. తనని చూసి తనపై పడి రామలక్ష్మి ఏడుస్తుంది. అసలు ఏమైంది అమ్మ ఎవరు చేశారు ఇదంతా.. కావాలనే చేస్తున్నారు వాళ్ళని కనిపెడతానని మాణిక్యం అంటాడు. ఇదంతా నువ్వే చేస్తూన్నావ్ కదా అని శ్రీలతని మాణిక్యం అంటాడు. నేనెందుకు చేస్తానని శ్రీలత అంటుంది. అన్నయ్యని మా అమ్మ సొంతకొడుకులాగా చూస్తుంది.. అలాంటిది మా అమ్మని అలా అంటావా అని మాణిక్యంపై సందీప్ విరుచుకుపడతాడు. నా తండ్రిని ఎందుకు అలా అంటున్నావని రామలక్ష్మి అనగానే.. మరి మావయ్య అమ్మ గురించి తప్పుగా మాట్లాడితే తప్పు లేదా అని సిరి అంటుంది. అయిన శ్రీలతనే ఇదంతా చేసిందని మాణిక్యం అంటుంటే.. ఇంకొకసారి అలా అనకని పెద్దాయన చెప్తాడు. అందరు శ్రీలతకి సపోర్ట్ గా మాట్లాడతారు. నాన్న నేను ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేస్తాను. మీరు ఇక్కడ నుండి వెళ్ళండి అని రామలక్ష్మి అనగానే.. మాణిక్యం వెళ్ళిపోతాడు.
మరొకవైపు సీతాకాంత్ కి ఒక కానిస్టేబుల్ భోజనం తీసుకొని వచ్చి ఇస్తాడు. వద్దని సీతాకాంత్ చెప్తాడు. ఎందుకు అలా భోజనం ఇస్తున్నావ్ అని ఇంకొక కానిస్టేబుల్ సీతాకాంత్ గురించి తప్పుగా మాట్లాడుతుంటే.. నా కొడుకు గురించి తప్పుగా మాట్లాడకండి అంటూ శ్రీలత అంటుంది. అప్పుడే రామలక్ష్మి కూడా వస్తుంది. ఇది ఎందుకు వచ్చింది సీతతో మాట్లాడి సందీప్ ని చైర్మన్ ని చేయమని అడుగుదామనుకున్నానని శ్రీలత అనుకుంటుంది. రామలక్ష్మి భోజనం తీసుకొని వచ్చి.. సీతాకాంత్ కి ప్రేమగా తినిపిస్తుంది. మీరు నాకు పూజ అయ్యాక బొట్టు పెట్టకుండానే వచ్చారు.. ఇప్పుడు పెట్టండి అంతా మంచి జరుగుతుందని రామలక్ష్మి అనగానే రామలక్ష్మికి సీతాకాంత్ బొట్టు పెడతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.