English | Telugu

Guppedantha Manasu: నీ తండ్రి ఎవరో కాదు, మా బాబాయ్ మహేంద్రే.. షాక్ లో‌ మను!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు(Guppedantha Manasu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-1154లో..  తనని కిడ్నాప్ చేసింది మనునే అని శైలేంద్ర షాక్ అవుతాడు.  ఎందుకు నన్ను కిడ్నాప్ చేశావని శైలేంద్ర అడుగగా.. మను మౌనంగా ఉంటాడు. సరే.. గతంలో నేను నిన్ను ఇబ్బంది పెట్టాను.. నిన్ను బాధపెట్టాను.. దానికి నువ్వు ప్రతీకారం తీర్చుకోవడం కరెక్టే కానీ.. దానికి ఇది సరైన సమయం కాదని శైలేంద్ర అంటాడు. నాకు ఇదే సరైన సమయమని మను అంటాడు. కరెక్ట్ టైమ్ చూసి దెబ్బ కొట్టాడు వెధవ అని శైలేంద్ర మనసులో తిట్టుకుంటూ.. పైకి మాత్రం మన వదిలేయమని మనుని బ్రతిమిలాడతాడు. 

Brahmamudi: బంటీతో కావ్య చెప్పిన ప్లాన్ అదేనా.. అప్పు, కళ్యాణ్ లు ఇంటికి వస్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -488 లో.....కళ్యాణ్ , అప్పులు గుడిలో ప్రసాదం తింటూ ఉంటారు. నన్ను నమ్ముకొని వస్తే నిన్ను ఇక్కడ కూర్చోపెట్టానని కళ్యాణ్ బాధపడతాడు. కోట్ల ఆస్తులు నాకోసం వదులుకొని వచ్చావ్.. నన్ను ప్రేమించినదుకు నీ బతుకు ఇలా అయిందని నేను కూడా బాధపడాలి కదా అని అప్పు అంటుంది. నిన్ను వదులుకోవడం కన్నా, ఆస్తులు వదులుకోవడం కష్టమేమీ కాదని కళ్యాణ్ అంటాడు. నీ కోసం నేనే ఏదో ఒకటి చెయ్యాలని అప్పు అనగానే.. ఇప్పుడు నేను నీ భర్తని.. నేనే ఆ మాట అనాలని కళ్యాణ్ అంటాడు. ఇద్దరు నవ్వుకుంటారు....

Karthika Deepam2 : కథలోకి దాస్.. కీలకంగా మారిన కార్తీక దీపం ఎపిసోడ్!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -123 లో.... కోర్టులో అమ్మతోనే ఉంటానని శౌర్య చెప్పగానే.. దీప హ్యాపీగా ఫీల్ అవుతుంది. శౌర్యని దీప హగ్ చేసుకొని ఎమోషనల్ అవుతుంది. ఈ రోజు ఇచ్చిన తీర్పు మనసుకి నచ్చిందని జడ్జ్ అంటాడు. ఆ తర్వాత అనసూయ వెళ్లిపోతుంటే దీప వెళ్లి.. తన కాళ్ళపై పడి థాంక్స్ అని చెప్తుంది. నాకు తల్లి ఉంటే కూడా ఇలా సాయం చేసేది కాదేమోనని దీప అంటుంది. మీ కొడుకు కోడలు ఇంట్లోకి రానివ్వరు.. నా దగ్గరకి రండి ఊర్లో ఉన్నట్టే ఇక్కడే ఉందామని దీప అనగానే.. లేదు గాని కూతురుని తీసుకొని వెళ్ళమని చెప్పి అనసూయ వెళ్ళిపోతుంది...

Eto Vellipoyindhi Manasu : భర్తని జీవితాంతం గుర్తుండిపోయే గిఫ్ట్ ఇవ్వమన్న భార్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -175 లో.... సీతాకాంత్ కంపెనీ గురించి ఆలోచిస్తూ డల్ గా ఉంటే రామలక్ష్మి కార్ అపమని ఐస్క్రీమ్ తీసుకుంటుంది. మీరు జరగదు అనుకున్నది జరిగింది ఏదైతే ఉందో అది గుర్తుకు చేసుకోండి అని రామలక్ష్మి అనగానే.. రామలక్ష్మితో పెళ్లి జరిగింది గుర్తుకుచేసుకుంటాడు సీతాకాంత్. మీరు నవ్వుతున్నారంటే ఏదో మీరు అనుకున్నది జరిగినట్లు ఉంది అయితే ఇప్పుడు ఐస్క్రీమ్ తినండి అంటు సీతాకాంత్ మూడ్ ని రామలక్ష్మి డైవర్ట్ చేస్తుంది.

తమ్ముళ్లను గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ

శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇక ఈ ఎపిసోడ్ రాఖీ స్పెషల్ ఎపిసోడ్ గా మల్లెమాల తీసుకొచ్చింది. ఈ షోకి బాలాదిత్య ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఆటో రాంప్రసాద్ రాగానే "ఏంటి అందరూ సైలెంట్ గా కూర్చున్నారు" అనేసరికి "ఎం చెప్తావయ్యా రాంప్రసాద్  భయం" అన్నాడు బాలాదిత్య. "మావోయిస్టులు ఏమన్నా దాడి చేస్తున్నారా" అన్నాడు. "అంతకన్నా ప్రమాదం..సిస్టర్స్ అయ్యా" అన్నాడు బాలాదిత్య. దానికి లేడీస్ నుంచి సత్యశ్రీ వచ్చి మనం ఈరోజు అక్కాచెల్లెళ్లలా బిహేవ్ చేయకూడదు స్టువర్ట్ పురం దొంగల్లా బిహేవ్ చేయాలి" అంటూ వాళ్ళ వాళ్ళ అన్నాతమ్ముళ్లను రాఖీ కట్టి ఏమేం అడగాలో గొంతెమ్మ కోరికలన్నీ చెప్పుకొచ్చారు లేడీస్. ఇక ఈ షోకి నివేత థామస్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఇంకో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే లేడీస్ అంతా అచ్చమైన పదహారణాల ఆడపిల్లల్లా చీరలు కట్టి పూలు పెట్టుకుని వచ్చారు.

శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టిన అమ్మాయిలు...

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ నెక్స్ట్ వీక్ ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇది సెమి ఫినాలే వీక్ అని చెప్తూ అందరికీ పవర్ థీమ్ ఇచ్చింది శ్రీముఖి. ఇక ఈ ఎపిసోడ్ కి అనసూయ వచ్చిన గెటప్ చూస్తే ఓ రేంజ్ లో ఉంటుంది. అంటే టూటన్ఖామున్  మాస్క్ లాంటి కాస్ట్యూమ్ తో వచ్చింది.  ఇక ఇందులో అబ్బాయిలకు అమ్మాయిలకు హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పెట్టింది. దాంతో కిరణ్ ఒక అమ్మాయి ఇలా రెజ్లింగ్ చేస్తున్నప్పుడు బ్రహ్మముడి కావ్య వచ్చి కిరణ్ ని కి ముద్దులిచ్చి అతని మైండ్ ని డైవర్ట్ చేసి ఆ గేమ్ ఓడిపోయేలా చేసింది. తర్వాత శేఖర్ మాస్టర్ కి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది "మిమ్మల్ని రెండింతలు ఎక్కువగా డిస్ట్రాక్ట్ చేయొచ్చు" అనేసరికి నన్నెవరూ ఏమీ చేయలేరు అని చెప్పారు శేఖర్ మాష్టర్. సరే రండి అని అనసూయకి శేఖర్ మాష్టర్ కి మధ్య హ్యాండ్ టు హ్యాండ్ రెజ్లింగ్ పోటీ పెట్టారు. ఇక శేఖర్ మాష్టర్ ని చుట్టుముట్టారు అమ్మాయిలంతా..

Karthika Deepam2: కేసు గెలిచిన దీప.. తల్లీకూతుళ్ళ ఎమోషనల్ సీన్!

  స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్-122 లో.....లాయర్ జ్యోతి విచారణ కోసం సుమిత్రని బోనులోకి పిలుస్తుంది. దీప మీకు ఎలా తెలుసని జ్యోతి అడగ్గా.. దీప మా అవుట్ హౌస్ లోనే ఉంటుంది. చాలా మంచిది నాకు పెద్ద కూతురు లాగా ఆత్మాభిమనం కలిగిన అమ్మాయి అని, తన భర్త తనని మోసం చేసి రెండో పెళ్లి చేసుకున్నాడని సుమిత్ర చెప్తుంది. కార్తీక్ చేస్తుంది మీ దృష్టిలో మంచి పని అంటారా అని జ్యోతి అడగ్గానే.. నాకు మంచి పని అనిపిస్తుంది.. సాయం చేస్తున్నాడు.. తల్లి బిడ్డ వేరు కాకుండా చూస్తున్నాడని సుమిత్ర అంటుంది. చూసారా కాబోయే అత్త గారే కార్తీక్ తప్పు లేదని చెప్తున్నారని దీపకి సపోర్ట్ గా జ్యోతి మాట్లాడుతుంది.  

Eto Vellipoyindhi Manasu : సవతి తల్లి నమ్మకద్రోహాన్ని సీతాకాంత్ కనిపెట్టగలడా.. రామలక్ష్మి ఏం చేయనుంది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -174 లో....బోర్డు మెంబర్స్ అందరు సందీప్ ని చైర్మన్ చెయ్యాలంటున్నారు.. అప్పుడే రామలక్ష్మి వచ్చి అవసరం లేదు.. ఏదో ఎవరో కావాలని నిందలు వేస్తే అది నిజమని నమ్మి ఇంత కష్టపడి.. ఈ స్థాయికి తీసుకొని వచ్చింది సీతా సర్ .. ప్రలోభాలకి భయపడి నిర్ణయం తీసుకుంటారా అని రామలక్ష్మి అంటుంది. కంపెనీ గురించి మంచి నిర్ణయం తీసుకున్నామని బోర్డు మెంబర్ అంటాడు. అయితే ఒకసారి ఈ వీడియో చూడండి అంటూ రామలక్ష్మి నమిత మాట్లాడిన వీడియోని చూపిస్తుంది. అందులో సీతా సర్ మంచి వారు డబ్బుకి ఆశపడి నేనే అలా చేసానని ఉంటుంది.

Brahmamudi : కొత్తజంటని ఇంటికి తీసుకురమ్మన్న ధాన్యలక్ష్మి.. షాకిచ్చిన కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -487 లో.....అప్పు ఫ్రెండ్స్ రాగానే.. మేమ్ ఇక వెళ్ళిపోతామని  వాళ్ళతో అప్పు అంటుంది. ఎందుకు మా వల్ల ఏదైనా ఇబ్బంది కలిగిందా అని వాళ్లు అడుగుతారు. అదేం లేదు.. కళ్యాణ్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్స్ ఉందట.. అందుకే వెళ్తున్నామని అప్పు చెప్తుంది. మరొకవైపు కావ్య అందరికి కాఫీ తీసుకొని వచ్చి ఇస్తుంది. ధాన్యలక్ష్మి రాలేదా అని ఇందిరాదేవి అడుగుతుంది. అయినవాళ్లే వెన్నుపోటు పొడిచాక ఎలా వస్తుందని అక్కడే ఉన్న రుద్రాణి అంటుంది. అయినవాళ్లు ఎవరని ఇందిరాదేవి అడుగగా.. ఇంకెవరు రాజ్ , కావ్య అని రుద్రాణి అంటుంది.

ఆగిపోయిన పెళ్ళికి భాజాలెందుకు... కమెడియన్ రాఘవకి కృష్ణ భగవాన్ వార్నింగ్

నెక్స్ట్ వీక్ జబర్దస్త్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. మొదట అంతా ప్రశాంతాం సాగుతోంది కామెడీగా ఉన్నాయి స్కిట్స్ అనుకుంటున్న టైంలో ప్రోమో ఎండింగ్ కి వచ్చేసింది. ఇక నూకరాజు స్కిట్ చేస్తుండగా రాఘవ వచ్చి "ఆగిపోయిన పెళ్ళికి భాజాలెందుకు ఇక్కడి నుంచి దుకాణం  తియ్యండి" అని చెప్పేసరికి "ఏంటబ్బా ఫస్ట్ లోనే వచేస్తావ్" అంటూ నూకరాజు రాఘవను తోసేసాడు. వెంటనే బులెట్ భాస్కర్ కూడా వచ్చి వేలు చూపిస్తూ వయసులో పెద్దవాళ్ళని ఊరుకుంటున్నా" అని వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత జడ్జెస్ కి కూడా వార్నింగ్ ఇచ్చాడు. "రాఘవ టీమ్ కి విన్ ఇస్తే ఒప్పుకోము" అన్నాడు సీరియస్ గా. "ఇది 2020 స్కిట్" అని నూకరాజును చూపిస్తూ ఖుష్భుకు చెప్పాడు భాస్కర్. రష్మీ వచ్చి అసలు స్కోర్స్ ఎంతో ముందు తెలుసుకుందాం అని అనేసరికి భాస్కర్ అడ్డుపడి "వాళ్ళు స్కిట్ చేస్తున్నప్పుడు అసలు మేము అడ్డపడలేదు.