English | Telugu

Karthika Deepam2 : దీపకి విడాకులు..‌‌.అనసూయ సాక్ష్యం!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -121 లో....నాకు విడాకులు కావాలని దీప కోర్టులో అడుగుతుంది. దాంతో విడాకులు కావాలంటున్నావ్ కారణం ఉందా అని లాయర్ అనగానే.. ఉంది.. నరసింహా రెండో పెళ్లి చేసుకున్నాడు.. అక్కడ అతని పక్కన కూర్చొని ఉందని దీప చెప్తుంది. ఆ తర్వాత జ్యోతి శోభని విచారిస్తానని బోనులోకి పిలుస్తుంది. నువ్వు నరసింహ రెండో భార్యవేనా అని అడుగగా.. ఎవరు చెప్పారు పక్కన కూర్చొని ఉంటే పెళ్ళాం అయిపోతానా.. మా అమ్మకి తను తెలుసు.. నాక్కూడా తెలుసు.. నాకు ఫ్రెండ్ అంతే అని శోభ అనగానే.. అందరు షాక్ అవుతారు. తను అబద్ధం చెప్తుందని దీప అంటుంది. ఆ తర్వాత మా అత్తయ్య గారు చెప్తారని దీప అంటుంది. కోర్ట్ మధ్యహ్నానానికి వాయిదా పడుతుంది.

ఆ తర్వాత VV దగ్గరకి నరసింహా, శోభ వస్తారు. ఏంటి ఈవిడ నీ భార్యనా అని లాయర్ అడుగగా.. లేదు ఫ్రెండ్ అని నర్సింహా చెప్తాడు సరే మిమ్మల్ని నమ్ముతున్నా మీ అమ్మ గారు చెప్పే దానిపై తీర్పు ఆధారపడి ఉంటుంది. వెంటనే వెళ్లి తీసుకొని రండి అని నరసింహాతో లాయర్ అంటాడు.ఆ తర్వాత లాయర్ VV దగ్గరకి జ్యోత్స్న, పారిజాతంలు వస్తారు. మీరు ఎలాగైనా నరసింహాని గెలిపించాలి. నరసింహా, దీపకి విడాకులు రావద్దు శౌర్యని నరసింహా తీసుకొని వెళ్ళాలి. అందుకు మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తానని జ్యోత్స్న అనగానే..మీ బావ ఒకవైపు సపోర్ట్, మీరొకవైపు సపోర్ట్ ఉన్నారు.. ఎందుకు దీపని కార్తీక్ పెళ్లి చేసుకుంటాడని భయపడుతున్నారా.. నాకు అర్ధమైందంటూ లాయర్ నవ్వుతు వెళ్ళిపోతారు. లాయర్ త్వరగా గుర్తించాడని పారిజాతం అంటుంది. ఆ తర్వాత నరసింహా ఇంటికి వచ్చి కోర్టులో జరిగింది మొత్తం అనసూయకి చెప్పి అనసూయని కోర్ట్ కు తీసుకొని వెళ్తాడు.

మరొకవైపు మీ అత్తయ్య నీకు అనుకూలంగా సాక్ష్యం చెప్తుందని అనుకోవడం లేదని కాంచన అంటుంది. ఆ తర్వాత పారిజాతం, జ్యోత్స్న లు వాళ్ళ దగ్గరకి వెళ్లి మళ్ళీ.. దీప బాధపడేలా మాట్లాడుతారు. అనసూయ కోర్ట్ కి రాగానే.. దీప వెళ్లి నిజం చెప్పండంటూ రిక్వెస్ట్ చేస్తుంది. నేను ఎందుకు చెప్తాను నా కొడుకు హ్యాపీగా ఉండే పని చేస్తానని అనసూయ అంటుంది. ఆ తర్వాత అనసూయ గారు వచ్చారు అనుమతి ఇస్తే విచారిస్తానని VV అంటాడు. ఈ కేసులో కార్తీక్ అత్త గారు ప్రధాన సాక్ష్యంగా ఉన్నారు.. ముందు తనని విచారణ చెయ్యాలి.. మీరు అనుమతి ఇస్తే అని జ్యోతి జడ్జ్ ని అడుగుతుంది. అందుకు జడ్జ్ ఒకే చెప్పడంతో.. సుమిత్రని బోనులోకి పిలుస్తుంది జ్యోతి. తరువాయి భాగంలో నువ్వు ఎవరి దగ్గర ఉంటావని శౌర్యని జడ్జ్ అడుగ్గా.. నరసింహా వైపు శౌర్య చూపిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.