English | Telugu
మను తండ్రి ఎవరో శైలేంద్రకి తెలిసిపోయింది!
Updated : Aug 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -1150 లో.. అనుపమ దగ్గరకి వసుధార వస్తుంది. ఎందుకు మేడమ్ అలా సడెన్ గా వచ్చేసారని వసుధార అడుగ్గా.. అన్ని చెప్తాను.. నా బాధ నీకు కాకుండా ఎవరికి చెప్పుకుంటానని అనుపమ అంటుంది. మను తండ్రి మహేంద్ర అని దేవాయని, శైలేంద్రలకి తెలిసిందంటూ జరిగింది మొత్తం అనుపమ చెప్తుంది. మీరు మనుకి నిజం చెప్పండి అని వసుధార అంటుంది. నేను చేసిన పొరపాటు వల్ల మను తండ్రి గురించి దేవయాని, శైలేంద్రలకి తెలిసిందని వసుధార అంటుంది. ఆ మాట మను వింటాడు. మీరు త్వరగా మనుకి చెప్పండి అని వసుధార అంటుంది. ఇప్పుడు చెప్పలేనని అనుపమ అంటుంది. ఆ తర్వాత వసు వెళిపోతుంటే నా తండ్రి గురించి అందరికి తెలుసా అయినా చెప్పట్లేదా.. ఇప్పుడు నాకేం చెయ్యాలో తెలుసని మను అనుకుంటాడు.
మరొకవైపు శైలేంద్ర రిషి దగ్గరకి వచ్చి.. నువ్వేంటి వసధార ముందు ఓవర్ చేస్తున్నావ్ అంటాడు. అదేం లేదు అలా సపోర్ట్ చేయకుంటే వసుధార మేడమ్ కి డౌట్ వస్తుందని రిషి అంటాడు. రేపు బోర్డు మీటింగ్ అరేంజ్ చేస్తాను అందులో ఎండీగా నా పేరు చెప్పు.. ఇది నా డ్రీమ్ అందరు నా మాట వినాలని శైలేంద్ర అంటాడు. మొదట రిషి అడ్డు వచ్చాడూ.. వాడు వెళ్ళాక పిన్ని.. తను వెళ్ళాక వసుధార.. ఇప్పుడే నేను ఎండీ కావడానికి మంచి ఛాన్స్.. అసలు ఎండీ గురించి ఎన్ని చేసానో తెలుసా అని శైలేంద్ర చెప్పబోయి ఆగిపోతాడు. ఏం చేశారని రిషి అంటాడు. అదంతా నీకెందుకని శైలేంద్ర అంటాడు. వాళ్ళ మాటలన్ని వసుధార వింటుంది.
మరొకవైపు మను దగ్గరికి ఏంజిల్ వస్తుంది. బావ నేనంటే నీకు ఇష్టమేనా పెళ్లి చేసుకుందామా అని అడుగుతుంది. నాకు వారం రోజులు టైమ్ కావాలి. అప్పటి వరకు నేను ఎదరుచూస్తున్న నిరీక్షణ ఫలిస్తుందని మను అంటాడు. సరేనని ఏంజిల్ అంటుంది. ఆ తర్వాత శైలేంద్ర, దేవయానిలు మాట్లాడుకుంటారు. ఆ వసుధార లెటర్ మనుకి ఇస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లు అవుతుందని అంది. మనం లెటర్ ఇస్తే మనకి ప్లస్ ఆ మైనస్ ఆ అని శైలేంద్ర అంటాడు. అది మన ఇష్టమని దేవయాని అంటుంది. అపుడే ధరణి వచ్చి.. దేవయాని శైలేంద్రలతో మాట్లాడుతుంది. అప్పుడే శైలేంద్రకి మను కాల్ చేస్తాడు. చెయ్యగానే లిఫ్ట్ చేస్తే వాల్యూ ఏముంటుందని శైలేంద్ర ఫోన్ లిఫ్ట్ చెయ్యడు. మరొకవైపు మహేంద్ర హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు. మళ్ళీ మీరు రావడం చాలా హ్యాపీగా ఉందంటు వసుధారతో అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.