English | Telugu
మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకుంది.. రామలక్ష్మి ప్లాన్ అదేనా!
Updated : Aug 11, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoindi Manasu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -172 లో..ఇకనైనా నీ ప్రయత్నం ఆపి ఒక మూలన కూర్చోమని శ్రీలతకు రామలక్ష్మి వార్నింగ్ ఇస్తుంది. ఇప్పుడు ఏమైందని అలా అంటున్నావని శ్రీలత అడుగగా.. మీరు ఎంత బాగా నటిస్తారు మహానటి. నమితతో అంతా చేయించి ఏం తెలియనట్లు భళే మాట్లాడుతున్నారని రామలక్ష్మి అంటుంది. నేను ఎందుకలా చేస్తానని శ్రీలత అంటుంది. నాకు అర్థం అయింది నమిత చెప్పకపోయిన మిమ్మల్ని చూసి భయపడడంలోనే నాకు అర్థమైందని రామలక్ష్మి అంటుంది. నీ భర్త నిన్ను బయటకు గెంటేలా ప్లాన్ చేస్తానని శ్రీలత అంటుంది. ఆ లోపే నేను ఒక బిడ్డని కంటాను.. అప్పుడు మీ కపట ప్రేమకి దూరం అయి, ఆ బిడ్డకి దగ్గర అవుతారని శ్రీలతతో రామలక్ష్మి అంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ దగ్గరికి రామలక్ష్మి వెళ్తుంది. నీ లక్ష్యం ఆశయాలు పక్కన పెట్టి ఎప్పుడు నా గురించి ఆలోచిస్తున్నావని రామలక్ష్మితో సీతాకాంత్ అంటాడు. ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటారు. ఆ తర్వాత శ్రీలత దగ్గరికి శ్రీవల్లి వచ్చి.. మీ ప్లాన్ ఫెయిల్ అయింది. మా ఆశలపై నీళ్లు చల్లారని శ్రీవల్లి అంటుంది. అవును నువ్వు నన్ను చైర్మన్ చేస్తానంటూ ఆశలు పెట్టావని సందీప్ అంటాడు. అది జరుగుతుంది కచ్చితంగా.. సీతాకాంత్ పై మచ్చ పడింది.. అది చాలు.. బోర్డు మెంబర్స్ అందరు నా మాట వినేలా చేస్తాను.. చైర్మన్ ని చేస్తానని శ్రీలత అంటుంది.
ఆ తర్వాత సీతాకాంత్ కి రామలక్ష్మి భోజనం వడ్డీస్తుంది. రామలక్ష్మి కూడా సరిగ్గా తినలేదని పెద్దాయన చెప్పిన మాటలు సీతాకాంత్ గుర్తుచేసుకొని.. నువ్వు కూడా తిను అంటూ రామలక్ష్మికి తినిపిస్తాడు. ఆ తర్వాత నమిత తను ఏ కారణం వల్ల అలా చేసిందో తెలియదు కానీ మీరు బయటకు రావడానికి కారణం తనే కాబట్టి మళ్ళీ తనని క్షమించి లైఫ్ ఇవ్వండి అని రామలక్ష్మి అడుగగా.. సరే అంటాడు.
ఆ తర్వాత రామలక్ష్మి నమితని కలుస్తుంది. థాంక్స్ మేడమ్.. నేను తప్పు చేసిన మళ్ళీ నాకు లైఫ్ ఇచ్చారని నమిత అంటుంది. మీ అత్తతో జాగ్రత్త నన్ను వాడుకున్నారని జరిగింది చెప్తుంది.. ఇక ఇప్పుడు మీకు సహాయం చెయ్యలేకపోవచ్చు కానీ ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మాత్రం కచ్చితంగా హెల్ప్ చేస్తానని రామలక్ష్మికి నమిత చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.