English | Telugu

Brahmamudi : కోడలు చేసిన పనికి అత్త షాక్...రూమ్ నుండి వెళ్తారా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -486 లో... కావ్యపై రాజ్ కోపంతో.‌. నువ్వు చేసిన వంట తిననని అంటాడు. దాంతో రాత్రి ఆకలి వెయ్యడంతో రాజ్ కిచెన్ లోకి వచ్చి.. ఏదైనా ఉందేమో అని చూస్తాడు. పాలు ఉండటంతో రాజ్ వేడి చేసుకుంటుండగా అతనికి చేయి కాలుతుంది. అప్పుడే కావ్య వస్తుంది. మీరు నేను చేసిన వంట తినను అన్నారని, వంట శాంతని చెయ్యమని చెప్పానని కావ్య అనగానే.. అవునా అంటూ వెళ్లి భోజనం పెట్టుకుని తింటుంటాడు.

అప్పుడే అపర్ణ వస్తుంది. రాజ్ భోజనం చెయ్యడం చూసి కావ్య చేతి వంట తిననని వెళ్లిపోయావ్ కదా అని అపర్ణ అనగానే.. ఇది కావ్య చెయ్యలేదు, పనిమనిషి శాంత చేసిందని చెప్తాడు. ఆ తర్వాత రాజ్ భోజనం చేసి వెళ్ళిపోయాక.. థాంక్స్ రాజ్ తినకుండా ఎలా పడుకుంటాడని అనుకున్న అబద్ధం చెప్పి అయిన తినేల చేసావని కావ్యతో అపర్ణ అంటుంది. మీరు ఒకసారి భోజనం చెయ్యను అన్నప్పుడు.. నేను అలాగే పనిమనిషి శాంత చేసిందని చెప్పి మావయ్య గారితో పంపించానని కావ్య అనగానే.. గడుసు కోడలు అంటూ కావ్యతో అపర్ణ అంటుంది. ఆ తర్వాత రాజ్ పడుకొని కూడా కళ్యాణ్ ని కావ్య ఇంటికి రమ్మని పిలువలేదని కోపంగా ఉంటాడు. కాసేపు ఇద్దరికి గొడవ జరుగుతుంది. నువ్వు రమ్మని చెప్పకుంటే ఏంటి.. నేను రమ్మని చెప్తానంటూ కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేస్తాడు. ఎక్కడున్నారని రాజ్ అడిగితే.. కళ్యాణ్ చెప్పడు. ఆ తర్వాత ఇంటికి రమ్మని అడుగుతాడు. లేదు అన్నయ్య రాలేమని కళ్యాణ్ కచ్చితంగా చెప్పడంతో రాజ్ డిస్సపాయింట్ అవుతాడు.

ఆ తర్వాత కళ్యాణ్ రూమ్ బయట చూడగానే.. అప్పు ఫ్రెండ్స్ అందరు బయట పడుకొని ఉంటారు. చూసావా అప్పు వాళ్లు మనకి ప్రైవసీ ఇవ్వడానికి ఎలా బయట పడుకున్నారో.. ఇక మనం వాళ్ళని ఎక్కువ రోజులు ఇబ్బంది పెట్టవద్దని కళ్యాణ్ అంటాడు. మరి ఎక్కడికి వెళదామని అప్పు అడుగుతుంది. ఎక్కడికైనా వెళదామని కళ్యాణ్ అంటాడు. సరే నేను ఎక్కడైనా ఉంటాను కానీ నీ గురించి ఆలోచిస్తున్నానని అప్పు అంటుంది. ఉదయం తన ఫ్రెండ్స్ తో అప్పు ఇక మేమ్ వెళ్ళిపోతామని చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.