English | Telugu

Guppedantha Manasu : ఎండీ పదవి నుండి తప్పుకున్న వసుధార...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1151 లో....మహేంద్ర, వసుధారలు జరిగిన సంఘటనలు గుర్తుచేసుకుంటారు. వసుధార కాలేజీ నుండి వెళ్ళిపోయాక ఏం జరిగిందో మహేంద్ర చెప్తాడు. కాలేజీనీ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటుందని చెప్పాక చాలా బాధేసింది కానీ రిషి మళ్ళీ తిరిగి వచ్చి కాలేజీని కాపాడాడని వసుధారతో మహేంద్ర అంటాడు. మావయ్య ఇక నేను ఎండీగా ఉండలేనని వసుధార అంటుంది. అప్పుడే రిషి వచ్చి అలా ఎందుకు అంటున్నావని అంటాడు.

నేను ఆల్రెడీ రాజీనామా చేసాను.. ఆ సీటులోకి నేను రాలేనని చెప్పి వసుధార వెళ్తుంది. తన వెనకాలే రిషి వెళ్లి.. నీ నిర్ణయం మారదా నీ రిషి సర్ చెప్పినా కూడ వినవా అని రిషి అనగానే.. సారీ సర్ నా భయాలు నాకు ఉంటాయని వసుధార అనగానే.. పొగరుకి భయమా? నీకు ఎంత దైర్యం ఉంటుందని వసుధార గురించి రిషి గొప్పగా మాట్లాడుతుంటాడు. శత్రువులకి భయపడుతున్నావా అని రిషి అడుగుతాడు. శత్రువులకి భయపడే క్యారెక్టర్ కాదు సర్.. మీకోసమే వద్దని అంటున్నాను.. మీరు మళ్ళీ నన్ను ఎండీని చేసి వెళ్ళిపోతారని భయమేస్తుందని వసుధార అంటుంది. అదేం లేదు ఎప్పుడు నీతోనే ఉంటానని రిషి అంటాడు.‌ నాకు ఒక మాట ఇవ్వండి.. దానికి కట్టుబడి ఉండాలని రిషి దగ్గర వసుధార మాట తీసుకుంటుంది. నువ్వు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉంటానని రిషి అంటాడు. ఏంటని రిషి అడుగగా.. టైమ్ వచ్చినప్పుడు చెప్తానని వసుధార అంటుంది.

మరొకవైపు రంగా దగ్గరకి సరోజ రావడానికి ధనరాజ్ కి కాల్ చేస్తుంది. నువ్వు నా గురించి తెలుసుకున్నావ్.. నీ గురించి కూడా తెలుసుకోవాలి కదా.. అందుకే సిటీకీ వస్తానని సరోజఅనగానే ధనరాజ్ సరే అంటాడు. ఆ తర్వాత రిషికి శైలేంద్ర ఫోన్ చేసి.. మీటింగ్ అరెంజ్ చేస్తాను.. అందులో నా పేరు చెప్పమని చెప్తాడు.. అర్హత ఉన్న వాళ్ళ పేరు చెప్తానని రిషి అనగానే.. వసుధార వచ్చింది అని అలా మాట్లాడుతన్నావా.. సరే అంటూ శైలేంద్ర ఫోన్ కట్ చేస్తాడు. మరొకవైపు మహేంద్ర దగ్గరకి అనుపమ వస్తుంది. రిషిని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. రిషి అనుపమ గురించి జగతి గురించి మాట్లాడతాడు. మావయ్యకి ఇద్దరు కొడుకులు అని మావయ్యకి తెలిసే టైమ్ దగ్గరలోనే ఉందని అనుపమకి వసుధార చెవిలో చెప్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.