English | Telugu

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ రోజే ఫస్ట్ నైట్.. ఇంటికి రావాల్సింది ఒక్కడే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -485 లో.... రాజ్ దగ్గరికి కావ్య వచ్చి.. భోజనం చేయడానికి రండీ అని అడుగగా.. నేను రానని రాజ్ అంటాడు. ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కళ్యాణ్ .. నాపై కోప్పడుతారేంటని కావ్య అంటుంది. అంటే కళ్యాణ్ గురించి ఇంట్లో అందరు బాధపడుతున్నారు. ఆ బాధ పోగొట్టాలని లేదా అని రాజ్ అనగానే.. నా ఇష్టంతో ఏమైనా పెళ్లి చేసుకున్నారా.. నేను తీసుకొని రావడానికి, లేదు కదా అని కావ్య అంటుంది. నా ఇష్టానికి విలువ ఇవ్వనప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎందుకు రావాలి.. నేను రాను వెళ్ళిపోమంటూ కావ్యపై రాజ్ సీరియస్ అవుతాడు.

మరొకవైపు కళ్యాణ్, అప్పులు ఇద్దరు అప్పు ఫ్రెండ్స్ రూమ్ లో భోజనం చేస్తుంటారు. వాళ్ళకి కొత్త గా పెళ్లి అయింది. వాళ్ళకి ప్రైవేసి ఉండాలని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళని వదిలేసి సినిమాకి వెళ్తారు. అనామిక తో గొడవలు లేకుండా ఉంటే ఇలాంటి సిచువేషన్ వచ్చేది కాదు కదా అని అప్పు అనగానే.. అనామిక ఎప్పుడు నన్ను అర్థం చేసుకోలేదు.. ఎప్పుడు తనకి నచ్చినట్టు ఉండాలని ట్రై చేసేది.. తక్కువ చేసి మాట్లాడేది కానీ నువ్వు ఎప్పుడు నన్ను అలా చూడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు. ఇక నుండి గతం గానీ అనామిక గురించి ఆలోచించొద్దు.. ఇప్పటి నుండి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నామని కళ్యాణ్ అంటాడు.

మరొకవైపు రాజ్ కి ఆకలిగా ఉంటుంది. కిచెన్ లోకి వస్తాడు. అక్కడే ఉన్న అపర్ణ ని తినడానికి ఫ్రిడ్జ్ లో ఏం లెవ్వని అడుగుతాడు. భోజనం చెయ్ అనగానే ఆ కావ్య వంట తినను అంటాడు. అప్పుడే కావ్య వచ్చి.. భోజనం చెయ్యండి అనగానే వద్దని వెళ్లిపోతాడు. ఏమైందని అపర్ణ అడుగగా.. కళ్యాణ్ వెళ్లిపోతుంటే ఆపలేదని కోపంగా ఉన్నారని కావ్య అంటుంది. వాడు ఆకలికి ఉండలేడని అపర్ణ అంటుంది. మరొకవైపు అసలు లెక్క ప్రకారం ఈ రోజు ఫస్ట్ నైట్ అని కళ్యాణ్ అంటాడు. అనుకున్నట్టు జరిగితే అవుతుంది కానీ మన పెళ్లి ఎలా జరిగిందని అప్పు అంటుంది. ఈ చీరని ఎలా కట్టుకుంటారో అంటూ ఇబ్బంది పడుతుంది అప్పు. తనని చూసి కళ్యాణ్ నవ్వుకుంటాడు

మరొకవైపు రుద్రాణి ఇంట్లో వాళ్లు అన్న మాటలకి కోపంగా డ్రింక్ చేస్తుంది. ఇన్ని రోజులు వీళ్ళపై జాలి చూపించాను కానీ ఇక అలా కాదు కళ్యాణ్ ని దూరం చేస్తాను. ధాన్యలక్ష్మికి ఇంట్లో వాళ్ళపై కోపం పెంచుకునేలా చేస్తాను. కావ్యని బయటకు పంపించి రాజ్ ని ఒంటరి వాడిని చేస్తాను. ఆస్తికి వారసుడిని చేస్తానని రాహుల్ తో రుద్రాణి అంటుంది. ఆ తర్వాత రాజ్ కిచెన్ లోకి వచ్చి.. పాలు వేడి చేసుకుంటుంటే తన చేయి కాలుతుంది.

తరువాయి భాగంలో కళ్యాణ్ ని ఎలాగైన ఇంటికి తీసుకొనిరా అని ప్రకాష్ అంటాడు. నేను వాళ్ళిద్దరిని తీసుకొని వస్తానని రాజ్ అనగానే.. ఇద్దరు ఎవరు? నాకు ఒక్కడే కొడుకు ఇంటికి రావలిసింది ఒక్కడే అని ధాన్యలక్ష్మి అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిసిందే.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.