English | Telugu
గుప్పెడంత మనసు కి శుభం కార్డు...
Updated : Aug 12, 2024
బుల్లితెర ధారావాహికల్లో స్టార్ మా సీరియల్స్ కి క్రేజ్ ఎక్కువ. అందులోను గుప్పెడంత మనసు సీరియల్ కి ఫుల్ ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఇప్పుడు ఈ సీరియల్ ముగిస్తుందంటు వచ్చిన కొన్ని పోస్ట్ లు చూసి ఈ సీరియల్ అభిమానులు ఫీల్ అవుతున్నారు.
నాలుగేళ్ల పాటు బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించిన ‘గుప్పెడంత మనసు’ సీరియల్ కథ ముగిసిపోయింది. 2020 డిసెంబర్‌లో ప్రారంభమైన ఈ సీరియల్.. ఇప్పటి వరకూ 1150 ఎపిసోడ్‌లను పూర్తి చేసుకుంది. రిషిగా ముఖేష్ గౌడ, వసుధారగా రక్షా గౌడ నటించింది. బుల్లితెర క్రియేటివ్ దర్శకుడు కుమార్ పంతం దర్శకత్వం వహించారు. ఈయనే.. బ్రహ్మముడి సీరియల్‌ని డైరెక్ట్ చేస్తున్నారు. రిషి రీ ఎంట్రీ ఇచ్చింది మొన్నమొన్ననే.. వసుధారలు రిషిలు కలుసుకుని సంతోషంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈ కథ గాడిన పడింది. పూర్వ వైభవాన్ని అందుకుంది. రిషి, వసుధారలను జంటగా చూస్తుంటే కడుపునిండిపోతుంది. సీరియల్ అదిరిపోతుంది, చూసేకొద్దీ చూడాలనిపిస్తుంది. ఇలాంటి టైమ్ లో గుప్పెడంత మనసు( Guppedantha Manasu) ని క్లోజ్ చేయడమేంటి అంటూ ఈ సీరియల్ ఫ్యాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు.
ఈ సీరియల్ ని ఎలా ముగిస్తారంటే.. రంగా ఎవరు అనేది పెద్ద క్వచ్ఛన్ మార్క్ కాబట్టి రిషి ప్రాణాపాయంలో ఉన్నప్పుడు అతన్ని కాపాడింది రంగానే.. రంగా కూడా రిషి పోలికలతోనే ఉండటం.. రిషిని కాపాడే ప్రయత్నంలో రంగా కోమాలోకి వెళ్లిపోవడం.. సరిగ్గా క్లైమాక్స్ నాటికి రంగా కోమాలో నుంచి బయటకు రావడం. రిషి వేరు రంగా వేరు.. ఇద్దరు డ్యుయెల్ రోల్ అని చెప్పి, రంగాకి ఆ సరోజతో ముడిపెట్టేస్తే సరే.. అలాగే శైలేంద్ర, దేవయానిల కుట్రలన్నీ రిషి బయటపెట్టేస్తే ఇక ఫ్యాన్స్ కూడా హ్యాపీ.. మరి దర్శకుడు ఎలా ముగిస్తాడనేది క్లారిటీ లేదు. చివరి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.