English | Telugu

ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్న తేజస్విని  గౌడ... 

బిగ్ బాస్ న్యూ సీజన్ నెక్స్ట్ మంత్ నుంచి టెలికాస్ట్ కాబోతోంది అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే కంటెస్టెంట్స్ ని కూడా బిగ్ బాస్ టీమ్ కలుస్తోంది అని కూడా అంటున్నారు. ఐతే ఇప్పుడు బిగ్ బాస్ లోకి తేజస్విని గౌడ వెళ్తుంది అనే టాక్ కొద్ది రోజుల నుంచి వినిపిస్తోంది. ఐతే బిగ్ బాస్ హౌస్ లోకి తేజు పేరు ఇంకా కంఫర్మ్ కాలేదు అనే విషయం బిగ్ బాస్ లేటెస్ట్ అప్ డేట్స్ ఇన్స్టా పేజీలో రీసెంట్ గా పోస్ట్ ఐతే పెట్టారు. ఎందుకంటే తేజస్విని గౌడ బిగ్ బాస్ వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే ఇంకా కొంచెం ఎక్కువగా అడిగిందని సో ప్రస్తుతానికి అమౌంట్ విషయంలో చర్చలు జరుగుతున్నాయి..

Guppedantha Manasu : నిజం ఒప్పుకున్న అనుపమ.. అంత తప్పు ఏం చేసింది!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -1158 లో.....రిషి, వసుధారలు అనుపమ దగ్గరికి బయలుదేరుతుంటే.. అప్పుడే మహేంద్ర వచ్చి నేను వస్తానని అంటాడు. ముందు రిషి సరే అంటాడు. ఆ తర్వాత వసుధార మావయ్య వద్దని అనగానే సరే డాడ్ మీరు వద్దని చెప్తాడు. వసుధార నా దగ్గర ఏదో విషయం దాస్తుంది.. అది కనిపెట్టాలని మహేంద్ర అనుకుంటాడు. మరొకవైపు మనుకి శైలేంద్ర ఫోన్ చేసి.. తమ్ముడు అంటూ మాట్లాడేసరికి మనుకి కోపం వస్తుంది. నిన్ను కలవాలి రాలేదంటే మీ అమ్మకి ఫోన్ చేసి నన్ను కిడ్నాప్ చేసి విషయం తెలుసుకున్నావని చెప్తానని శైలేంద్ర అనగానే కోపంగా మను బయలుదేర్తాడు. 

ఎవరి మొగుడు వాళ్లకు మహేష్ బాబు...

ప్రపంచంలో ఉన్న ప్రతీ భార్య ఏమనుకుంటుంది అంటే తన భర్తను తాను తప్ప మిగతా అమ్మాయిలంతా అన్నయ్య అనో తమ్ముడు అనో అనుకోవాలని అనుకుంటుంది. అందుకే మన ఇళ్లల్లో చూస్తే సాధారణంగా మీ అన్నయ్య, మీ తమ్ముడు అంటూ వరసలు కలిపించేసి మిగతా లేడీస్ తో అలాగే మాట్లాడించేస్తారు. ఇప్పుడు ఆట సందీప్ భార్య జ్యోతి కూడా అదే కాన్సెప్ట్ తో ఇప్పుడు ఒక వీడియోని పోస్ట్ చేసింది. "హలో అందమైన అమ్మాయిలూ...రాఖీ పండగ సందర్భంగా ప్రపంచంలో ఉన్న అందమైన అమ్మాయిలంతా మా ఇంటికి వచ్చి సందీప్ గారికి  రాఖీ కట్టొచ్చు. కింద మా ఇంటి అడ్రెస్స్ ఇచ్చాను..కాబట్టి వచ్చి రాఖీ కట్టేయండి  " అని చెప్పేసరికి సందీప్ కాసేపు జ్యోతితో పరాచికాలు ఆడి దణ్ణం పెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.

ఈటీవీ అంటే సుమ...సుమ అంటే ఈటీవీ 

ఈటీవీ బలగం ప్రోమో పార్ట్ 2  భలే ఫన్నీగా ఉంది. ఇక ఈ షోలో బుల్లితెర నటులు ఈటీవీలో పని చేసిన వారంతా వచ్చారు. అలాగే జ్యోతిష్యం చెప్పే పంతుళ్లు కూడా వచ్చి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసారు. సుడిగాలి సుధీర్, సోనియా సింగ్ ఈ షోకి యాంకర్స్ గా ఉన్నారు. ఈ ఎపిసోడ్ కి ఇంద్రజ ఎంట్రీ ఇచ్చేసరికి సుధీర్ వెళ్లి ఆప్యాయంగా అమ్మా అని పిలిచాడు. దానికి ఆది కౌంటర్ వేసాడు. "ప్రతీ సోమవారం నుంచి ప్రతీ శుక్రవారం వరకు రాత్రి 7  గంటలకు అమ్మ ప్రేమ కొడుకు కోమా" కొత్త సీరియల్ స్టార్ట్ కాబోతోంది అని చెప్పాడు. ఇక ఆ డైలాగ్ కి ఇంద్రజ, భావన పడీపడీ నవ్వేశారు. ఈ షోకి స్పెషల్ గెస్ట్ గా నేచురల్ స్టార్ట్ నాని వచ్చాడు.

Karthika Deepam2 : పారిజాతంకి బుద్ధి చెప్పిన జ్యోత్స్న...

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం2'(karthika Deepam2). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -127 లో.. దీపకి కార్తీక్ ఫోన్ చేసి శౌర్య ఆరోగ్యం గురించి అడుగుతాడు. ఆ తర్వాత కోర్టులో జరిగిన దాని గురించి మీ నాన్న ఏమైనా అన్నారా అని దీప అడుగగా.. అదేం లేదు.. కానీ జ్యోత్స్న ఏదైనా గొడవ చేసిందా అని కార్తీక్ అంటాడు‌. అలా అడగ్గానే దీప పలకకుండా ఉండిపోతుంది. తర్వాత ఇద్దరు ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తుంటారు. మరోవైపు దాసు గురించి పారిజాతం ఆలోచిస్తుంది. జ్యోత్స్నకు ఎలాగైనా బుద్ధి చెప్పి, ఎలాగైనా దాస్ కి సారి చెప్పించాలని అనుకుంటుంది. అప్పుడే ఎదురుగా జ్యోత్స్న ఉంటుంది.

Guppedantha Manasu : నిజం చెప్పేసిన వసుధార.. అంతా వినేసిన మహేంద్ర!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'(Guppedantha Manasu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -1157 లో.....రిషి దగ్గరికి వసుధార స్వీట్ తీసుకొని వస్తుంది. ఏం ఆలోచిస్తున్నారని వసుధార అడుగుతుంది. అన్నయ్య ముందే వస్తానని చెప్పి లాస్ట్ మినిట్ వరకు రాలేదని రిషి అంటాడు. నువ్వు ఏదైనా ప్లాన్ చేసావా అని రిషి అడుగుతాడు. అదేం లేదు సర్ అసలు ప్రొద్దున నుండి ఇప్పటివరకు మీతోనే ఉన్నాను నేనెలా చేస్తాను అని వసుధార అంటుంది. రసగుల్లా తినండి అని వసుధార అనగానే.. ఇప్పుడు స్వీట్ ఏంటని రిషి అడుగుతాడు. మీరు ఎండీ అయ్యారు కదా అందుకే మావయ్య స్వీట్ చెయ్యమని చెప్పారని వసుధార అంటుంది.

Brahmamudi : అప్పు మొదటి వంట.. కళ్యాణ్ ఏం చెప్పనున్నాడు!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -492 లో.. కళ్యాణ్ తను గతంలో రాసిన పుస్తకం దొరకడంతో దాన్ని తీసుకుని ఆ పుస్తకం పబ్లిష్ చేసిన పబ్లీషర్ దగ్గరకు వెళ్లడంతో అతడు గతంలో నీకు ఇవ్వాల్సిన డబ్బులు అంటు ఆరు వేలు చేతిలో పెటతాడు. కవితలు ఆపి, కథలు రాయమని చెప్తాడు. మరోవైపు అప్పూ చక్కగా జీన్స్ మీద కాస్త పొడవాటి టాప్ వేసుకునివేసుకునిమెడలోమెడలో పసుపు తాడు పైకి వేసుకుని చేతిలో గరిటె పట్టుకుని వంట చేస్తుంది. వంట అంటే మంట పెట్టుడే అనుకున్నా.. ఇందులో ఇన్ని వేయాల్నా.. ఇందులో సగం ఐటమ్స్ లేనే లేవు.. కూర ఎట్లుంటదో ఏంటో.. కవిగాడు ఎట్లా తింటాడో ఏమోనని అప్పు తనలో తానే మాట్లాడుకుంటూ.. వీడేంది ఇంకా రాలేదనినుకుంటుంది అప్పు ఇంతలో కళ్యాణ్ వచ్చి. అప్పూ. అని పిలుస్తాడు.