English | Telugu

జాను లైఫ్ స్టోరీ చూసి ...శేఖర్ మాస్టర్  ఎమోషనల్ 

బుల్లితెరపై సినిమాలు, సీరియల్స్‌తో పాటు కొన్ని షోలు కూడా అలరిస్తున్నాయి. వాటిల్లో క్యాష్, బిగ్ బాస్, లతో పాటు ఢీ డ్యాన్స్ షో ఒకటి. ఈ ప్రోగ్రామ్ ద్వారా ఎంతో మంది డ్యాన్సర్లు కొరియోగ్రాఫర్లుగా సత్తా చాటుతున్నారు. అలాగే కంటెస్టెంట్లుగా వచ్చి పేరు తెచ్చుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ షో టీవీ ప్రేక్షకులను పలకరిస్తోంది. సీజన్ మారినప్పుడల్లా కొత్త వారిని పరిచయం చేస్తూ కొత్తగా ప్రోగ్రామ్ డిజైన్ చేసి తీసుకొస్తున్నారు. తాజాగా ఢీ సెలబ్రిటీ స్పెషల్-2 నడుస్తోంది. దీనికి నందు హోస్టుగా వ్యవహరిస్తున్నాడు. ఇక కంటెస్టెంట్లులకు టీమ్ లీడర్లుగా ఆది, శ్రీసత్య వ్యవహరిస్తున్నారు. జడ్జులుగా నటి హన్సిక, శేఖర్ మాస్టర్, గణేష్ మాస్టర్ వ్యవహరిస్తున్నారు. అయితే ఓ కంటెస్టెంట్ చేసిన డ్యాన్స్ షోకు ఫిదా అయిపోయాడు శేఖర్ మాస్టర్. ఆమె జాను లైరి. తను ఆడితే అలానే చూడాలనిపచిందని శేఖర్ మాస్టర్ చెప్పగా తోటి డ్యాన్సర్స్ సైతం జాను లైరి డ్యాన్స్ కి ఫిధా అయ్యారు.

ఢీ సెలబ్రిటీ స్పెషల్-2లో ‘సెనిగ చేలా నిలబడి చేతులియ్యావే’ అంటూ సాగిపోయే ఫోక్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్స్ వేసింది జాను. స్వతహాగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కమ్ ఫోక్ డ్యాన్సర్ అయిన జాను.. ఈ పాటకు ఇచ్చి పడేసింది. గతంలో కూడా యూట్యూబ్ వేదికగా ఈ పాటకు కాలు కదిపిన ఈ నెమలి.. ఇప్పుడు ఢీ షోలో కూడా తన పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసింది.

ఇక తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో తను డ్యాన్స్ చేస్తూ ఎమోషనల్ అయింది. తను నడుచుకుంటు వెళ్తుంటే కామెంట్లు చేసేవారని, అవకాశాల కోసం ఎన్నో దాటుకొని వచ్చినట్టు చెప్పింది. కొన్నిసార్లు అవమానాలు తట్టుకోలేక చనిపోవాలనుకుంటే తన కొడుకు గుర్తొచ్చాడంటు ఏడ్చేసింది. ఇక తనని చూసి జడ్జ్ హన్సిక కూడా ఏడ్చేసింది.‌ ఢీ షోలని వాళ్ళంతా ఎమోషనల్ అయ్యారు. దీంతో ఈ ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. మీరు ఓ లుక్కేయండి.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.