English | Telugu
అందుకే జబర్దస్త్ నుండి బయటకు వచ్చేశాను.. అలా చేయడం కరెక్ట్ కాదు!
Updated : Aug 11, 2024
జబర్దస్త్ షో రూపు రేఖలు పూర్తిగా మారిపోయాయి. సరదా శుక్రవారం సరిపోదా శనివారం పేరుతో ఈ షో వస్తోంది. ఇప్పుడు ఈ రెండు ఎపిసోడ్స్ కి యాంకర్ గా రష్మీనే పని చేస్తోంది. ఇంతకుముందు అనసూయ యాంకర్ గా చేసేది. ఐతే ఆమె వరుస సినిమాలతో బిజీగా మారిపోయింది. దీంతో ఈ షో నుండి బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఈమె ప్లేసులో కన్నడ సీరియల్ నటి, బుల్లితెర యాక్టర్ సౌమ్యరావ్ వచ్చింది. వచ్చి రానీ తెలుగుతో కొద్దీ రోజులు ఆకట్టుకుంది. అప్పుడప్పుడే ఆడియన్స్ తెలుస్తోంది అనుకుంటున్న టైములో ఆమె కనిపించకుండా పోయింది. తర్వాత ఆమె స్థానంలోకి వచ్చింది సిరి హనుమంతు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఈ షో మొత్తం స్టైల్ మార్చేశాక రష్మీ గౌతమ్ మాత్రమే యాంకర్ గా ఉంటోంది. అయితే చాలా మందికి సౌమ్య రావ్ ఎందుకు వెళ్లిపోయిందో అన్న విషయం తెలీదు. ఐతే ఆ విషయాల గురించి సౌమ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. జబర్దస్త్ నుండి సడెన్‌గా వెళ్లిపోవడానికి కారణం అగ్రిమెంట్ ఐపోవడమే అని చెప్పింది. అందుకే ఈ షో నుండి బయటకు వచ్చేసినట్లు చెప్పింది.
"వన్ ఇయర్ అగ్రిమెంట్ అని చెప్పారు. నెక్ట్స్ ఇయర్ కొత్త ఫేస్ ట్రైం చేస్తాం అన్నారు. ఇట్స్ ఓకే అని చెప్పా. అక్కడ ఉన్నప్పుడు మంచిగానే చూసుకున్నారు. బెంగళూరు నుండి ఇక్కడకు తీసుకొచ్చి, క్యాబ్ లాంటి ఫెసిలిటీస్ కూడా ఇచ్చారు. పేమెంట్స్ ఇష్యూస్ కానీ, కంటెస్టెంట్ల నుండి కానీ ఎలాంటి ఇష్యూస్ లేవు. టీమ్ లీడర్స్, జడ్జెస్ , ప్రొడక్షన్ టీం, మేనేజ్ మెంట్ అందరూ నన్ను బాగా చూసుకున్నారు" అని సౌమ్య చెప్పింది.
ఆడియన్స్ తో ఎక్కువగా కనెక్ట్ కాకపోవడానికి కారణం కూడా చెప్పింది. "ఇలా వచ్చానో లేదో అలా సమయం అయిపోయింది. సీరియల్స్ లో నటించే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ యాంకరింగ్ చేస్తున్నప్పుడు సీరియల్స్ చేయకూడదు. మళ్లీ మంచి ఆఫర్స్ వస్తే వెళతాను. ఐతే ఈ జర్నీ మొత్తంలో ఒకే కంపెనీపై కానీ, ఒకరిపై కానీ ఆధారపడకూడదు. ఒక ఆర్టిస్టుగా మన మార్గాలను మనమే వెతుక్కోవాలి. ఎక్కడ అవకాశాలు దొరికినా వెళ్ళాలి. ఎప్పుడూ ఒకే రూట్ లో వెళితే ఆ దారిని ఎప్పుడు, ఎవరు, ఎలా క్లోజ్ చేస్తారో మనకు తెలియదు" అంటూ చెప్పుకొచ్చింది.