English | Telugu
బిగ్ బాస్ సీక్రెట్స్ రివీల్ చేసిన యాంకర్ రవి!
Updated : Aug 11, 2024
బిగ్ బాస్ షో అంటే ఓ ఇరవై మందిని సెలెక్ట్ చేసి వారిని హౌస్ లోకి పంపించి, కొన్ని గేమ్స్ ఆడించి, వీకెండ్ లో ఓ ఎలిమినేషన్ చేపించడమే అని అనుకుంటారంతా కానీ అసలు లోపల వాళ్ళు ఇరవై నాలుగు గంటలు ఏం చేస్తారు? ఎలా ఉంటారనేది అందులో ఉండి వచ్చిన వాళ్ళకే తెలుస్తుంది. యాంకర్ రవి తను ఎదుర్కున్న కొన్ని విషయాలని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. (Bigg Boss Telugu)
యాంకర్ రవి బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్స్‌గా వెళ్తున్నాడంటే అతనే విన్నర్ అవుతాడని అనుకున్నారంతా కానీ అతనికి ఉన్న మంచి పేరుని బిగ్ బాస్ వాళ్లు తీసిపారేశారు. ముఖ్యంగా యాంకర్ లహరి ఇష్యూలో యాంకర్ రవిని పెద్ద విలన్‌గానే చూపించారు. పెళ్లైనా కూడా లహరి ఫేమ్ కోసం తన వెంటపడుతుందని వద్దని చెప్పినా వినడం లేదని రవి, నటి ప్రియతో అనడం.. ప్రియ ఆ విషయాన్ని లహరితో చెప్పడం. ఆ ఎపిసోడ్‌లో రవి ఇంత క్యారెక్టర్ లెస్ ఫెలోనా అన్నట్టుగా చూపించారు. కానీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బిగ్ బాస్ ఎడిటింగ్ కి తను ఎలా బలయ్యాడో అనేక సందర్భాల్లో రవి చెప్పుకొచ్చాడు.
బిగ్ బాస్ లో ప్రతీ శనివారం రోజు వరస్ట్ పెర్ఫామెన్స్ ఎవరని అడుగుతారు.. ఆదివారం రోజు నాగార్జున వచ్చి మా మధ్య ఏదొక ఫిటింగ్ పెడతారు. దాంతో వారం మొత్తం లాక్కుంటూ పీక్కుంటూ ఉంటాం. ఇదే బిగ్ బాస్ గేమ్ నేచర్. సోమవారం నాడు నామినేషన్స్.. వారంలో మూడు రోజులు ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడమే. మిగిలిన మూడు రోజులు కూడా.. ఎవడి గురించి ఏ కారణం చెప్పాలని వెతుక్కుంటూ ఉంటాం. తిండి కూడా సరిగ్గా ఉండదు. 19 మందికి ఒక పచ్చడి డబ్బా ఇస్తారు. నీకు ఎక్కువ వచ్చింది.. నాకు తక్కువ వచ్చిందని తిట్టుకోవడమే. తీవ్రమైన ఒత్తిడిలో ఉండి ఆట ఆడాలి.. కానీ ఒక్క గంట చూసి జడ్జ్ చేసేస్తారు. బిగ్ బాస్ ఆటని ఎడిటింగ్ చేసి ఒక గంట చూపిస్తారు.. మిగిలింది అన్ సీన్ అని చూపిస్తున్నారు. 24 గంటల్లో జరిగిన ఆటలో వాళ్లకి కావాల్సిన దాన్ని మాత్రమే సెలెక్ట్ చేసి చూపిస్తారు. బిగ్ బాస్‌కి వెళ్లడమే చాలా ఒత్తిడితో వెళ్లారు. బిగ్ బాస్ కి వెళ్ళే ముందు నేను 85 రోజులు ఉంటే పది కేజీలు తగ్గాను. శ్రీరామ్ చంద్ర 12 కేజీలు, షణ్ముఖ్ జస్వంత్ 15 కేజీలు తగ్గిపోయాడు. నాకు డే 01 నుంచి డే 50 వరకు కూడా నా కూతురు కానీ నా ఫ్యామిలీ గురించి గానీ అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. నా వాళ్లు ఏమైపోయారో అని వాళ్ల గురించే ఆలోచిస్తూ ఒత్తిడిలో ఉంటాం.. అలాంటి టైమ్ లోనే ట్రిప్ అవుతూ ఉంటాం. అలాగని అక్కడ నుంచి వెళ్లిపోలేం.
ఎందుకంటే అగ్రిమెంట్ ఉంటుంది. దాన్ని బ్రేక్ చేయలేం. అమ్మ నాన్న పెద్ద వాళ్లు.. వాళ్లు ఎలా ఉన్నారో అని కెమెరాలకు దండం పెట్టి అడిగిన వాళ్ల నుంచి స్పందన రాదు. ప్రతి ఒక్కరూ కెమెరాల దగ్గరకు వెళ్లి ఇలాగే మాట్లాడతారు. నేను ఓ రోజు అలా మాట్లాడినందుకు నన్ను మాత్రమే చూపించారు. కొన్నే సెలెక్ట్ చేసి చూపించారు. నేను శ్రీరామ్, సన్నీ లతో చాలా బాగా ఉండేవాన్ని ఆ బాండింగ్ మాత్రం చూపించలేదు. నేను పాజిటివ్‌గా ఎంత చేసిన కూడా నెగిటివ్‌గానే చూపించేవారంటూ యాంకర్ రవి చెప్పుకొచ్చాడు.