English | Telugu
Bigg Boss Telugu 8 Promo : ఎంటర్‌టైన్మెంట్, ఫన్, ట్విస్టులకి లిమిటే లేదు!
Updated : Aug 12, 2024
టీవీ ప్రేక్షకులని అలరించడానికి సెప్టెంబరు మొదటి వారంలో రాబోతున్న బిగ్ బాస్ నుండి సెకెండ్ ప్రోమో వచ్చేసింది. కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన బిగ్‌బాస్ టీజర్‌కి కొనసాగింపుగానే లేటెస్ట్ ప్రోమో ఉంది. కమెడియన్ సత్య దొంగ పాత్రలో బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే అద్భుత దీపం నుంచి వచ్చినప్పుడు.. కింగ్ నాగార్జున ఏం కావాలో కోరుకో అంటూ వరాలిస్తాడు. దీంతో నాకు అన్నీ అన్ లిమిటెడ్‌గా కావాలంటూ సత్య అడగ్గానే ఒక్క చిటికె వేస్తారు నాగార్జున.
చిన్న బ్రేక్ చిటికెలో వచ్చేస్తా అన్నట్లుగా కళ్లు మూసి తెరిచేలోపు బిగ్‌బాస్ హౌస్ మొత్తం అప్సరసలతో నిండిపోతుంది. ఇక వారితో నాగార్జున డ్యాన్స్ మొత్తం చాలా గ్రాండ్ గా ఉంది. ఇక దీనికి ఓ సపరేట్ సాంగ్ కూడా ప్లే చేశారు. ఇది గబ్బర్ సింగ్ టైటిల్ సాంగ్‌లా ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి లేనిది ఒకే ఒక్కటి అదే 'లిమిట్ ' అంటూ ఈ సీజన్ కాన్సెప్ట్‌పై మరోసారి క్లారిటీ ఇచ్చాడు నాగార్జున.
ఇక ఈ ప్రోమోలో .. రోజూ ఇంట్లో గలాటలే, టోటల్ షో ధమాకాలే అంటు వచ్చే పాటలోని లిరిక్స్ బాగున్నాయి. ఇక మాకు ప్రైవసీ లేదా, ఏకాంతం కావాలంటూ దొంగగా వచ్చిన సత్య అడగ్గానే.. ఒక్కసారి ఆలోచించుకో ఇక్కడ ఒకసారి కమిట్ అయితే లిమిటే లేదంటూ నాగార్జున గుర్తు చేశాడు. అయినా సరే నాకు ఏకాంతం కావాల్సిందేనంటూ సత్య అడగ్గానే.. మరో చిటికె వేసి దెబ్బకి ఏడారిలో చిరిగిపోయిన బట్టలతో సత్యను కూర్చోబెడతాడు. ఇక ప్రోమో చివరిలో ఈ సారి బిగ్‌బాస్ సీజన్ 8 లో ఎంటర్‌టైన్‌మెంట్, ఫన్, టర్న్స్, ట్విస్ట్‌లకి లిమిటే లేదంటూ నాగార్జున ఎండ్ చేశాడు. ఇక ఈ ప్రోమో చూస్తే సీజన్ 8 లో ఎంటర్‌టైన్మెంట్ అన్ లిమిటెడ్ లా అనిపిస్తుంది. బిబి టీమ్ ఎలాంటి కంటెస్టెంట్స్ ని తీసుకొస్తుందో చూద్దాం మరి.