English | Telugu
అనుభవాలని చెప్తూ... నదిలో కొట్టుకుపోయేవాళ్ళం!
Updated : Aug 12, 2024
అంజలి అత్తోట.. ఈ పేరు ఎవరికి అంతగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ అంజలి పవన్ అందరికి సుపరిచితమే. కారణం యాక్టర్ పవన్ ని పెళ్ళి చేసుకొని ఫేమస్ అయింది. టెలివిజన్ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఒకవైపు యాక్టర్ గా మరొకవైపు యాంకర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసింది అంజలి పవన్.
మొగలిరేకులు సీరియలో నటించిన అంజలి.. విమర్శకుల ప్రశంసలు పొందింది. ఆ తర్వాత తనకి బోలెడు సినిమాల్లో, టెలివిజన్ రంగంలో ఆఫర్లు వచ్చాయి. అలా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే అంజలి హైదరాబాద్ లో జన్మించింది. తన వ్యక్తిగతంగా, వృత్తిపరంగాను ఎంతో ఉన్నంతంగా ఉంటుందని తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ లని చూస్తుంటేనే తెలుస్తుంది. అయితే జనవరి 24, 2015 న సినిమా రంగంలో పనిచేస్తున్న సంతోష్ పవన్ ని పెళ్ళిచేసుకుంది అంజలి. అప్పటినుండి తన పేరును అంజలి పవన్ గా మార్చుకుంది. తన ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ప్రేక్షకులకు దగ్గరగా ఉంటుంది అంజలి పవన్. అంజలి తన భర్త పవన్ తో కలిసి 'నీతోనే డ్యాన్స్ షో' లో పర్ఫామెన్స్ చేసింది. వాళ్ళిద్దరి పర్ఫామెన్స్ కి జడ్జ్ లు రాధ, తరుణ్ మాస్టర్, సదా అంతా ఫిధా అయ్యారు. ఈ వయసులో ఇంత చక్కగా డ్యాన్స్ చేయడం చాలా కష్టమంటూ రాధ కూడా తనని పొగిడారు.
అంజలి పవన్ వాళ్ళ పాప పేరు 'ఆద్య'.. ముద్దుపేరు చందమామ. అంజలి పవన్ ఫ్యామిలీతో కలిసి తాజాగా ఓ ట్రిప్ కి వెళ్ళారు. అక్కడ అమ్మవారి దర్శనం పూర్తయ్యాక ఓ నదిని దాటి వెళ్లాల్సి వచ్చింది. అయితే అది ప్రమాదకరం . అదే సమయంలో వర్షం స్టార్ట్ అయింది. ఇక నదిలోని నీరు ఎక్కువ అయింది. ఇక అదే ట్రిప్ కి వచ్చిన కొంతమంది సాయంతో చాలా కష్టపడి బయటకు వచ్చారు. లేదంటే ఆ నదిలో అంజలి, తన కూతురు చందమామ కొట్టుకుపోయేవారు. ఇక ఈ ట్రిప్ అనుభవాలని చెప్తూ అంజలి పవన్ తన యూట్యూబ్ ఛానెల్ లో ఓ వ్లాగ్ ని అప్లోడ్ చేయగా అది ఇప్పుడు వైరల్ గా మారింది. యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోని మీరు ఓ సారి చూసేయ్యండి.