English | Telugu

నేను సింగర్ గా మారడానికి కారణం మనో గారు

తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రతీ వారం మంచి పెర్ఫార్మెన్సెస్ తో దూసుకుపోతోంది. ఇక ఈ వారం ఎపిసోడ్ లో జడ్జ్, సింగర్ కార్తీక్ ఒక ఇంటరెస్టింగ్ విషయాన్నీ చెప్పుకొచ్చారు. తాను ఇంత గొప్ప సింగర్ కావడానికి కారణం మనో గారు అని అన్నారు.

"మీ మ్యూజికల్ జర్నీలో మీకు ఘనమైన మూమెంట్ ఏమిటి" అని శ్రీరామా చంద్ర అడిగేసరికి సింగర్ కార్తీక్ తన మ్యూజికల్ జర్నీలో అసలు విషయాలు చెప్పుకొచ్చాడు. "1995 లో మా నాన్నకు సంగీతం మీద ఉన్న ఇంటరెస్ట్ కారణంగా నేను ఒక రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేయాల్సి వచ్చింది. ఆ షోలో నేను పాడాను. ఐదు నిమిషాల్లోనే నేను ఓడిపోయాను. అసలు నాకు సాంగ్స్ పాడడం మీద అవగాహన లేదు, బాగా పాడలేదు..ఓడిపోయాను. ఐతే ఆ ఎపిసోడ్ కి మనో గారు చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఆ క్షణం వరకు నా లైఫ్ లో మ్యూజిక్ లేదు. అంతా ఖాళి. ఆ ఎపిసోడ్ షూటింగ్ ఐపోయాక నేను, అమ్మ, నాన్న కలిసి బస్సు స్టాండ్ కి నడుస్తూ వస్తున్నాం. అదే సమయంలో ఒక ఒపెల్ ఆస్ట్రా కారు మా ముందు నుంచి వెళ్తూ కనిపించింది. నేను ఆ కార్ చూసి నాన్న మనో గారు కార్ లో వెళ్తున్నారు అని చెప్పా. అదే టైములో మనో గారి కార్ మా ముందు ఆగింది. ఆయన మమ్మల్ని చూసి మా కోసమే కార్ ఆపారు. వెంటనే మేము మనో గారి దగ్గరకు వెళ్లాం. వెంటనే ఆయన నన్ను మా పేరెంట్స్ కి చూపిస్తూ కుర్రాడికి మంచి భవిష్యత్తు ఉంది. మ్యూజిక్ నేర్పించండి...అదే అతన్ని నిలబెడుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అలా ఆయన మాటలతో నా బుర్రలో ఒక ఆలోచనను వెలిగించారు. అంటే మనో గారు చెప్పారు కాబట్టి నేను మ్యూజిక్ నేర్చుకుంటే గొప్పవాడిని అవుతాను అనుకున్నాను. అలా నేను మ్యూజిక్ నేర్చుకున్నా..నాలుగేళ్ల తర్వాత నేను సింగర్ ని అయ్యాను." అని తన మ్యూజిక్ జర్నీ గురించి చెప్పుకొచ్చారు.

Karthika Deepam2 : దీప అమ్మానాన్నలు గొప్పొళ్ళు.. నోరు జారిన జ్యోత్స్న!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2).ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -537లో.. శివన్నారాయణ ఇంటికి శ్రీధర్ వస్తాడు. పారిజాతం కాఫీ తీసుకొని వస్తుంది. తనని చూసి మీరేంటి అత్తయ్య కాఫీ తీసుకొని వచ్చారని శ్రీధర్ అడుగుతాడు. ఈ ఒక్క రోజు దీప డ్యూటీ తనకి వచ్చిందని కార్తీక్ అంటాడు. అది తర్వాత గానీ ముందు ప్రెజెంటేషన్ ఇవ్వమని శివన్నారాయణ అనగానే శ్రీధర్, కాశీకీ ఫోన్, లాప్ టాప్ తీసుకొని రమ్మని చెప్తాడు. కాశీ వచ్చి సర్ అని శ్రీధర్ ని పిలుస్తుంటే.. ఏంటి వాడిని నీ చుట్టూ తిప్పుకుంటున్నావని పారిజాతం అంటుంది.

Illu illalu pillalu : పార్క్ కి రమ్మని అమూల్యకి లెటర్ రాసిన విశ్వ.. అందరూ చూసేసారుగా!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(Illu illalu pillalu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -338 లో. అమూల్యని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని విశ్వ అనుకుంటాడు. అమూల్యని పిలుస్తాడు. తనకి విశ్వ ఏం చెప్తున్నాడో ఏం అర్థం కాదు.. దాంతో విశ్వ ఒక పేపర్ పై ఈ రోజు సాయంత్రం పార్క్ లో కలుద్దామని రాసి అమూల్యకి విసిరేస్తాడు. అది అమూల్య చూసి ఒకే అంటుంది. ఆ పేపర్ ని పక్కన విసిరేస్తుంది. అది చందు చూసి చుట్టూ పక్కన ఎవరు ఉన్నారని చూడగా.. బట్టలు ఆరెస్తూ శ్రీవల్లి కనిపిస్తుంది. శ్రీవల్లి రాసిందనుకొని తన వైపుకి మళ్ళీ విసురుతాడు.