English | Telugu

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ నిజం తెలిసిపోయిందా!

Guppedantha Manasu : గుప్పెడంత మనసు సీరియల్ లో సూపర్ ట్విస్ట్.. ఆ నిజం తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -1037 లో.. మనుని తన దగ్గర నుండి వెళ్ళమని అనుపమ చెప్తుంది. అప్పుడే వసుధార, మహేంద్రలు వచ్చి.. ఎక్కడికి వెళ్తాడు. ఇక్కడే ఉంటాడు. పదండీ భోజనం చేద్దామని మహేంద్ర అనగా.. నేను రానని అనుపమ అంటుంది. దాంతో నేను ఉంటే మేడమ్ భోజనం చేయరు, నేను వెళ్తానని మను అంటాడు.. మను ఉంటే భోజనం చేయవా అని అనుపమని మహేంద్ర అడుగుతాడు.  అనుపమ సైలెంట్ గా ఉంటుంది. మౌనం అంగీకారం మను ఉంటే మేడమ్ కి ఏం ప్రాబ్లెమ్ లేదు.. మేడమ్ మీరు ఫ్రెష్ అయి రండి అని వసుధార చెప్తుంది..

Brahmamudi : ఓ నైట్ కి వస్తే జాబ్ వస్తుంది.. వాళ్ళ మాటలు సీక్రెట్ గా విన్న కావ్య!

Brahmamudi : ఓ నైట్ కి వస్తే జాబ్ వస్తుంది.. వాళ్ళ మాటలు సీక్రెట్ గా విన్న కావ్య!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -370 లో.. బాబు మీ కాళ్ళపై పడుకోపెట్టి స్నానం చేయించండని రాజ్ కు కావ్య చెప్తుంది. రాజ్ ఇబ్బందిపడుతుంటే నేను చేపిస్తానని కావ్య బాబుకి స్నానం చేపిస్తుంది. మరొకవైపు ప్రకాష్ కు ఆఫీస్ నుండి ఒకతను కాల్ చేసి.. ఈ కాంట్రాక్టు ఆగిపోయింది. దీని వాళ్ళ కోటి రూపాయల లాస్ వచ్చింది.. రాజ్ చూసుకుంటాడని అనుకున్నా కానీ చూడలేదని ప్రకాష్ కి చెప్తాడు. సరే రాజ్ వల్ల కోటి రూపాయలు నష్టం జరిగిందని ఎవరికి చెప్పకండని అతనితో  ప్రకాష్ ఫోన్ లో అంటాడు. వాళ్ళ మాటలన్ని అనామిక, రుద్రాణి వింటారు.

ఆరియానా సూసైడ్ రీల్...తిడుతున్న నెటిజన్స్

ఆరియానా సూసైడ్ రీల్...తిడుతున్న నెటిజన్స్

ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది కాస్తా వైరల్ అయిపోతోంది. అందులో ఇలాంటి సూసైడ్స్ కానీ కష్టాలు, కన్నీళ్లు ఉండే వీడియోస్ ఐతే ఇంకా స్పీడ్ గా వైరల్ ఐపోతున్నాయి.. మరి ఇప్పుడు ఆరియానా సూసైడ్ రీల్ అలాగే వైరల్ గా మారింది. ఆరియానాకు ఎం కష్టాలు ఉన్నాయో కానీ తన ఇంట్లో ఫ్యాన్ కి చున్నీని కట్టి ఉరేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంతలో ఆరియానా దగ్గరకు హర్షితా వస్తుంది. అది కూడా ఆమెను చూసి పలకరించడానికి కాదు. తనకు ఉన్న బాధలను ఆరియానాతో షేర్ చేసుకోవడం కోసం ఆమె వస్తుంది. ఇక అక్కడ ఆరియానా తన బాధలతో సూసైడ్ చేసుకోబోతున్న విషయాన్ని గమనించాక ఆమె తన మనసు మార్చుకుంటుంది. హర్షితాను చూసిన ఆరియానా చెయ్యి ఊపి హాయ్ అన్నట్టుగా పలకరిస్తుంది.

కార్తీకదీపంలో కౌశల్...మాటల్లేని పాత్రలో ఇలా వచ్చి అలా వెళ్ళాడు

కార్తీకదీపంలో కౌశల్...మాటల్లేని పాత్రలో ఇలా వచ్చి అలా వెళ్ళాడు

కార్తీక దీపం సీజన్ 2 రోజురోజుకు మంచి ఇంటరెస్టింగ్ గా సాగుతోంది. ఇక ఇందులో స్పెషల్ గెస్ట్ అప్పీరెన్స్ గా కౌశల్ మందా గురువారం ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. కార్తిక్ మరదలు జ్యోత్స్నా "మిస్ హైదరాబాద్ 2024 " పోటీల్లో పార్టిసిపేట్ చేసింది. ఈ పోటీల్లో జ్యోత్స్నా గెలిచింది. దాంతో కౌశల్ మందాని స్టేజి మీదకు ఇన్వైట్ చేసి అతనితో ఆమె మెడలో టాగ్ ని, అలాగే తల మీద కిరీటాన్ని పెట్టించారు. రీసెంట్ గా కార్తీక దీపం సీరియల్ లాంచింగ్ టైంలో దీప, కార్తీక్ కొన్ని ఇంటర్వ్యూస్ లో పార్టిసిపేట్ చేశారు. ఇక వాళ్ళు కూడా ఈ సీరియల్ లో కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలను దాచాం నెమ్మదిగా బయటికి తీస్తాం అని చెప్పుకొచ్చారు. మరి ఆ ట్విస్ట్ ఐతే ఇప్పుడు అర్ధమయ్యింది.  అలా కార్తీక దీపం సీరియల్ లో కౌశల్ మందాని ఇంట్రడ్యూస్ చేశారు.

హనీమూన్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్ ...నాకు ఇదే ఇంపార్టెంట్

హనీమూన్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్ ...నాకు ఇదే ఇంపార్టెంట్

నీతోనే డాన్స్ సీజన్ 2 ఫుల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సీజన్ 1 లో నటరాజ్ మాష్టర్ కి అంజలి-పవన్ జోడీకి మధ్య ఎన్ని గొడవలు, కొట్లాటలు జరిగాయో అందరం చూసాం.. ఆ సీజన్ లో మంచి కంటెంట్ ఐతే ఇచ్చారు. ఐతే ఈ సీజన్ లో ఎపిసోడ్స్ కొన్ని అయ్యాక గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ సీజన్ 2 జస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ మాత్రమే అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి అసలైన షో స్టార్ట్ కాబోతోంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి గొడవలు మొదలైపోయాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ థీమ్ "లుకింగ్ లైక్ ఏ వావ్" రౌండ్ అన్నమాట. ఒక్కో పెయిర్ ఒక్కో ఇరగదీసే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

హ్యాపీ డేస్ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళా...చీపురు కట్టతో మోటివేట్ చేసేది అమ్మ

హ్యాపీ డేస్ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళా...చీపురు కట్టతో మోటివేట్ చేసేది అమ్మ

యాక్టర్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా మల్టీటాలెంట్‌ పెర్సొనాలిటీతో రాణిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అష్టా-చమ్మాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కటౌట్ చూస్తేనే చాలు కామెడీతో కూడిన నవ్వు ఆడియన్స్ పెదాల మీదకు వచ్చేస్తుంది.  ఊహలు గుసగుసలాడే, జో- అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించారు. అష్టా-చమ్మా, పిల్ల జమీందార్, అంతకు ముందు ఆ తరువాత, నాన్నకు ప్రేమతో, అ ! వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన అవసరాల.. స్క్రీన్ రైటింగ్, థియేటర్ ఆర్ట్స్‌లో ఎంతో అనుభవం ఉంది. అలాంటి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "చిన్నప్పుడు చీపురు కట్టతో పెద్దయ్యాక అన్నయ్యతో పోలుస్తూ నన్ను అమ్మ మోటివేట్ చేస్తూ ఉండేది. మా అన్న ఆటిఫిషియల్  ఇంటెలిజెన్స్ లో పిహెచ్డి చేసి యూఎస్ లో సెటిల్ అయ్యారు.