Krishna Mukunda Murari : ఆదర్శ్ మనసుని మార్చేసిన మీరా.. అన్నదమ్ములిద్దరు కలిసారు కదా!
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్- 440 లో.. మురారి, కృష్ణల దగ్గరికెళ్ళి ఆదర్శ్ బ్యాగ్ తీసుకొని లోపలికి వచ్చేస్తాడు. దాంతో మురారి, కృష్ణ వారి గదిలోకి వెళ్తారు. కాసేపటికి కృష్ణ గదికి మీరా వెళ్తుంది. దీని ముఖం చూడటానికి నాకు అసహ్యంగా ఉంది. కానీ తప్పదని మనసులో అనుకుంటూ కృష్ణ ముందుకు వస్తుంది మీరా. రా ముకుందా.. రా అంటూ కృష్ణ పైకి లేచి నిలబడుతుంది. బాధపడకు కృష్ణ.. అదర్శ్ మారతాడు, కాస్త ఓపిక పట్టు అని మీరా చెప్పగానే సరేనని కృష్ణ అంటుంది. మరోవైపు రేవతి, భవాని మాట్లాడుకుంటారు. అసలు ఆదర్శ్ ఇలా ఉండేవాడు కాదు కదా? అవసరం అయితే తను తప్పుకోవాలి అనుకునేవాడు కానీ.. ఎవరినీ బాధపెట్టేవాడు కాదు. అలాంటిది మురారీ బయటికి పో అనేంత వరకూ వచ్చేశాడంటే తనకు ఎవరో నూరిపోస్తున్నారు.. తన మనసుని ఎవరో మార్చేస్తున్నారంటూ ముకుంద కుట్రను బయటికి లాగేలా భవాని మాట్లాడుతుంది. అయితే ఆ మాటలు మీరా విని.. అమ్మో నా మీద డౌట్ వచ్చేలా ఉంది. వెంటనే మాట మార్చాలని అనుకుంటుంది. అటుగా వెళ్తున్న మధుని ఆపి.. రేపు హోలీ చేసుకుందామా అని మీరా అడుగుతుంది.