English | Telugu

Eto Vellipoindhi Manasu : వాళ్ళిద్దరు ఆడే పెళ్ళి నాటకానికి మాణిక్యం పెట్టిన మొదటి పరీక్ష అదే!

Eto Vellipoindhi Manasu : వాళ్ళిద్దరు ఆడే పెళ్ళి నాటకానికి మాణిక్యం పెట్టిన మొదటి పరీక్ష అదే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు '. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్- 55 లో.. సీతాకాంత్ పెళ్ళి చేసుకున్నాడని వాళ్ళ అమ్మ శ్రీలత బాధపడుతుంది. తన సొంత కొడుకు సందీప్ తో ఆ పెళ్ళి వల్ల జరిగే నష్టాలని చెప్తుంటుంది. ఈ ఆస్తి , మనం అనుభవిస్తున్న ఐశ్వర్యం అన్నీ సీతాకాంత్ కష్టార్జితమని శ్రీలత అనగానే.. అదేంటి మమ్మీ.. అన్నయ్య మమ్మల్ని సొంత తమ్ముడు, సొంత చెల్లి కంటే ఎక్కువగా చేసుకుంటున్నాడు కదా .. అలా ఆలోచిస్తాడంటావా అని సందీప్ అంటాడు. ఇక మీద నుండి ఆలోచిస్తాడు. ఇప్పటిదాకా నా మాట వినేలా చేసుకున్నాను. కానీ నాకు తెలియకుండా పెళ్ళి చేసుకున్నాడంటే నమ్మలేకపోతున్నానని , అసలు వాళ్ళిద్దరు పెళ్ళి చేసుకున్నారా.. లేక నటిస్తున్నారా తెలుసుకోవాలి కాదు తెలుసుకుంటానని సందీప్ తో శ్రీలత అంటుంది.

అవినాష్,అనిల్, శ్రీకర్ అమ్మాయిల్లా ఎలా ఉంటారో తెలుసా!

అవినాష్,అనిల్, శ్రీకర్ అమ్మాయిల్లా ఎలా ఉంటారో తెలుసా!

ఆదివారం విత్ స్టార్ మా పరివారం షో ఈవారం ప్రోమో రిలీజ్ అయ్యింది. ఇందులో ఈ వారం కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండస్ట్రీ సీనియర్స్ వెర్సెస్ బ్లాక్ బస్టర్ జూనియర్స్ థీమ్ నడిచింది. ఈ షోలో శ్రీముఖి ఒక ఇంటరెస్టింగ్ కాన్సెప్ట్ ని చూపించింది. యాక్టర్స్ గనక అమ్మాయిల్లా పుడితే ఎలా ఉంటారో చూపించింది. అవినాష్ అమ్మాయిలా పుడితే ఎలా ఉంటాడో ఒక పిక్ ని ప్లే చేయించింది. అవినాష్ అమ్మాయి పిక్ ని హాఫ్ మాత్రమే చూపించేసరికి సీనియర్ నటుడు అనిల్ వెంటనే ఫుల్ పిక్చర్ లేదా అని అడిగాడు. ఆయన మనసులో అంతరార్ధం గ్రహించినట్టుగా శ్రీకర్ వెంటనే ఎం చూద్దామని అండి అని కౌంటర్ వేసాడు.

ఐపీఎల్ కామెంటేటర్లు తో స్పై బ్యాచ్...ఎంత ఎదిగిపోయావ్ అంటున్న నెటిజన్స్!

బిగ్ బాస్ సీజన్ 7 అన్ని సీజన్స్ కంటే కూడా కొంచెం డిఫరెంట్. ఎందుకంటే ఈ సీజన్ లో ఒక కామన్ మ్యాన్ టైటిల్ విన్ అయ్యాడు. అతనే పల్లవి ప్రశాంత్. ముందుగా అతన్ని మోటివేట్ చేయడమే పని పెట్టుకున్నాడు నటుడు శివాజీ. అలాగే ప్రశాంత్ తో పాటు యావర్ ని కూడా బాగా ఇన్స్పైర్ చేస్తూ అతనికి తెలుగు కూడా నేర్పించేవాడు. తర్వాత వీళ్లంతా కలిసి స్పై బ్యాచ్ గా మారారు. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చినా కూడా స్పై బ్యాచ్ అంటూ వీళ్ళను ఎవరూ వదలడం లేదు. ఇక శివాజీ కూడా స్పై బ్యాచ్ తో ఒక మూవీ కూడా చేస్తాను అని అన్నాడు. మరో వైపు ప్రశాంత్ కూడా కుదిరితే రాజకీయాల్లోకి వచ్చి సేవ చేస్తాను అని చెప్తున్నాడు.