English | Telugu
Krishna Mukunda Murari : ఆస్తులన్నీ నా పేరు మీద రాయి.. ఇంట్లో ఎవరు ఉండాలో డిసైడ్ చేస్తా!
Updated : Mar 30, 2024
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -431 లో.. అందరు భోజనం చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు. ఆదర్శ్ ఎక్కడ అని భవాని అడుగుతుంది. గదిలో ఉన్నాడని మధు అనగానే.. పిలవండి అని భవాని చెప్తుంది. ప్రొద్దున కూడా టిఫిన్ చెయ్యలేదు. కారణం వెత్తుకొని మరి ఏదో ఒకటి అంటున్నాడని నందు అంటుంది. మురారిని ఒకలా ఆదర్శ్ ని ఒకలా చూస్తున్నానంట అని భవానీతో రేవతి అంటుంది.
ఆ తర్వాత వాడిని పిలవండి అని భవాని చెప్తుంది. ఇప్పుడు ఎందుకు గొడవ అని కృష్ణ అంటుంది. గొడవకి కాదు పద్ధతులు నేర్పడానికి.. లేకపోతే ఇంట్లో అందరిని శత్రువులాగా చూస్తాడని భవాని అంటుంది.. ఆ తర్వాత మీరాని తీసుకొని వస్తానంటు కృష్ణ తన గదికి వెళ్తుంది. మరొకవైపు మురారి షర్ట్ పట్టుకొని నీకు ఈ షర్ట్ బాగుంటుందంటు మాట్లాడుకుంటుంది. అప్పుడే మీరా అంటు కృష్ణ పిలుస్తూ రావడంతో.. మీరా కంగారుగా ఆ షర్ట్ దాచేస్తుంది. భోజనం చేద్దామని మీరాని రమ్మని చెప్పి కృష్ణ వస్తుంది. ఆ తర్వాత ఆదర్శ్ ని తీసుకొని మధు వస్తాడు. ప్రొద్దున కూడా టిఫిన్ చెయ్యలేదంట ఎందుకని ఆదర్శ్ ని భవాని అడుగుతుంది. నా మనసు బాలేదు ఇష్టం లేని మనుషులు ఉంటే.. నాకు నచ్చడం లేదని ఆదర్శ్ అంటాడు. ఇంకెవరు కృష్ణ, మురారి అని నందు అంటుంది. అలా అయితే మేమ్ వెళ్లి పోతామని కృష్ణ, మురారి అంటారు. వాళ్ళు కాదు.. మురారికి శిక్ష పడకుండా ఆ మీరా చేసింది.. అందుకే నాకు ఇష్టం లేదని ఆదర్శ్ అంటాడు. ఆ మాటలు మీరా విని.. నా అనుమానం నిజం అయిందని అనుకుంటుంది. ఆ తర్వాత అర్హత లేని వాళ్ళు వెళ్లిపోయారు.. వాళ్ళ గురించి అవసరం లేదని భవాని చెప్తుంది. ఆ తర్వాత మీరా అందరికి భోజనం వడ్డిస్తుంది. ఆదర్శ్ కి సాంబార్ వేస్తుంది. నాకు సాంబార్ ఇష్టమని నీకెలా తెలుసని ఆదర్శ్ అడుగుతాడు. నువ్వు కోపంగా చూస్తుంటే కంగారుగా అనుకోకుండా పోసిందని సుమలత అంటుంది.
ఆ తర్వాత ముకందలాగే అన్నం కలుపుతున్నావని మీరాని కృష్ణ అంటుంది. దాన్ని చూసి కాపీ కొట్టానని మీరా కవర్ చేస్తుంది. ఆ తర్వాత ముకుంద ఫోటోకి దండ వేసి ఉండడం.. అక్కడ ఉండడం నాకు నచ్చలేదని మీరా అంటుంది. నాకు కూడ నచ్చలేదని ఆదర్శ్ అంటాడు. అయితే తీసేయ్ అని భవాని చెప్తుంది. తరువాయి భాగంలో మీరా డ్రింక్ కలిపి ఆదర్శ్ కి ఇస్తుంది. నేను నీ కొడుకు కాదని ఎవరు వ్యాల్యూ ఇవ్వడం లేదు.. ఆస్తులన్ని నా పేరుపై రాయి.. అప్పుడు ఇంట్లో ఎవరు ఉండాలో, ఎవరు ఉండకూడదో డిసైడ్ చేస్తానని ఆదర్శ్ అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.