Read more!

English | Telugu

Guppedantha Manasu : మనుని బావ అని  ఏంజిల్ పిలుస్తుందా.. అసలు వారిద్దరి మధ్య ఏం జరిగింది?

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -1036 లో...అనుపమ తన పెద్దమ్మకు ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్న అక్కడ కంఫర్ట్ గా లేకుంటే ఇక్కడికిరా అని వాళ్ల పెద్దమ్మ అనగానే.. ఎక్కడైన కంఫర్ట్ గా ఉంటాను కానీ అక్కడ మాత్రం ఉండలేనని అనుపమ అంటుంది. వచ్చాడా వాడు అని అనుపమ అడుగుతుంది. ఎప్పుడు లేనిది ఈ అడగడం ఏంటని వాళ్ల పెద్దమ్మ అడుగుతుంది. ఏం చేయమంటావ్ వాడు అలా చేస్తున్నాడని అనుపమ చెప్తుంది.

ఆ తర్వాత వాడి వాళ్ళ అందరు అడుగుతున్నారు. అసలేమైంది.. ఎందుకు మాట్లాడుకోవడం లేదంటూ ప్రొద్దున దేవయాని వచ్చి గుచ్చి గుచ్చి అడిగి వెళ్ళింది. ఆవిడ వెళ్ళాక ఏంజిల్, వసుధారలు.. ఆ తర్వాత మహేంద్ర నీలదీస్తున్నాడని అనుపమ చెప్తుంది. వాళ్లకేం సమాధానం చెప్పావని అడుగుతుంది. ఏం చెప్తాను.. నా నుండి ఏం సమాధానం రాదని నీకు తెలుసు కదా అని అనుపమ అంటుంది. అపుడే మహేంద్ర, మను ఇద్దరు హాల్లోకి వస్తారు. మను వచ్చాడని మహేంద్ర పిలుస్తుంటే.. ఫోన్ లో లైన్ లో ఉన్న వాళ్ల పెద్దమ్మ కూడా వింటుంది. తిని వస్తాడో లేదో కనుక్కోమని వాల్ల పెద్దమ్మ అనుపమని అడుగుతుంది. నేను మాట్లాడను అడగనని అనుపమ కోపంగా చెప్తుంది. ఆ తర్వాత మను హాల్లో కూర్చొని ఉంటే.. వసుధార, ఏంజిల్ ఇద్దరు మాట్లాడతారు. నువ్వు మనుని బావ అని పిలువు.. అతనేం అనుకోడని ఏంజిల్ కి మహేంద్ర చెప్తాడు. అతనేం అనుకుంటాడని కాదు మా అత్తయ్య ఏమైనా అంటుందేమోనని ఏంజిల్ అంటుంది. అంటే నువు మీ అత్తయ్యకి భయపడుతున్నావా అని మహేంద్ర అంటాడు.

ఆ తర్వాత అనుపమ కోసం మను టాబ్లెట్ తీసుకొని వస్తాడు. అవి నువ్వే తీసుకొని వెళ్లి.. మీ అమ్మకి ఇవ్వని మహేంద్ర వాళ్ళు మనుని అనుపమ దగ్గరకి పంపిస్తారు. నువ్వెందుకు వచ్చావంటు‌ మనుని అనుపమ చిరాకుపడుతుంది. నువ్వు ఉన్న చోటున ఇబ్బందిగానే ఉంటుంది.. అందరు మీ మధ్య గొడవ ఏంటని అడుగుతున్నారని అనుపమ అంటుంది. నాకు ఇదే సిచువేషన్ అని మను అంటాడు. ఇక్కడ నుండి వెళ్లిపోమని మనుని అనుపమ అనగానే.. అప్పుడే మహేంద్ర, వసుధారలు వస్తారు. ఎక్కడికి వెళ్ళడు.. ఇక్కడే ఉంటాడు.. పదండి భోజనం చేద్దామని మహేంద్ర అంటాడు. నేను రానని అనుపమ అంటాడు. నేను ఉంటే మేడం రారు నేను వెళ్తానని మను అంటాడు. ఏంటి అనుపమ.. మను ఉంటే రావా అని మహేంద్ర అడుగుతాడు. ఆ తర్వాత  ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.