English | Telugu

Eto Vellipoyindhi Manasu : బెడ్ మీద భర్త, నేల మీద భార్య.. నిజం తెలిసిపోయిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -58 లో.. సీతాకాంత్ రామలక్ష్మి ఇద్దరు పెళ్లి చేసుకులేదని నాకు డౌట్ గా ఉంది. చిన్నప్పటి నుండి పెళ్లి అనే ఆలోచన లేకుండా నేను చెప్పిందే వినేలా మర్చివేశానని సందీప్ కి శ్రీలత చెప్తుంది. వాళ్ళు పెళ్లి చేసుకోలేదన్న విషయం బయటపెట్టాలని ఇద్దరు అనుకుంటారు. ఆ తర్వాత సిరి తన వదిన రామలక్ష్మికి ఇల్లంతా చూపిస్తుంది.

రామలక్ష్మిని సీతాకాంత్ రూమ్ లోకి తీసుకొని వెళ్తుంది సిరి. ఇకనుండి నువ్వు ఇందులోనే ఉండాలని సిరి అనగానే.. ఇంత పెద్ద రూమ్ లో ఎందుకు.. నాకు అలవాటు లేదు. వేరే రూమ్ లో ఉంటానని రామలక్ష్మి అనగానే.. అప్పుడే సీతాకాంత్ వచ్చి ముందు ముందు అలవాటవుతుంది లే అని అంటాడు.. ఆ తర్వాత సిరి వెళ్ళిపోయాక... మనం ఈ గదిలో ఎప్పటిలాగా ఫ్రెండ్స్ లాగా ఉందాం.. అందరి ముందు అన్యోన్యంగా ఉందాం లేదంటే డౌట్ వస్తుందని రామలక్ష్మికి సీతాకాంత్ చెప్తాడు. ఇక మీకు వాల్యూ లేదు.. మీరు కూడా నాలాగే అని శ్రీవల్లితో పనిమనిషి అంటుంది. అప్పుడే శ్రీవల్లి దగ్గరికి సందీప్ వచ్చి‌.. తనని కొట్టినందుకు సారీ చెప్తాడు. అసలు అన్నయ్య, రామలక్ష్మిలు పెళ్లిచేసుకోలేదన్న డౌట్ ఉంది.. నువ్వు వాళ్లపై ఓ కన్నేసి ఉంచు అని శ్రీవల్లికి సందీప్ చెప్తాడు.

ఆ తర్వాత శ్రీలత అన్న మాటలు రామలక్ష్మి గుర్తుకుచేసుకుంటుంది. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. ఈ గదిలో ఫ్రీగా ఉండమని చెప్పాను కదా అని అంటాడు. థాంక్స్ వాళ్ళ పెళ్లి కోసం ఎవరు చెయ్యని పని చేస్తున్నావని సీతాకాంత్ అంటాడు. నాకు నా ఫ్యామిలీ సంతోషం ముఖ్యమని రామలక్ష్మి అంటుంది. ఆ తర్వాత రామలక్ష్మి చాపపై, సీతాకాంత్ బెడ్ పై పడుకుంటాడు. నీలాంటి అమ్మాయిని మిస్ అయ్యానని సీతాకాంత్ తనలో తానే ఫీల్ అవుతాడు. మరుసటి రోజు ఉదయం రామలక్ష్మి దగ్గరికి సిరి వచ్చి.. చాప వేసి ఉండడం చూస్తుంది‌. అసలు మీరు ఇద్దరు ఇష్టంగానే చేసుకున్నారా.. నువ్వు ఎందుకు చాపపై పడుకున్నావని అడుగుతుంది. నాకు మా ఇంట్లో ఇలా నేలపై పడుకోవడం అలవాటని రామలక్ష్మి చెప్తుంది. ఆ తర్వాత టిఫిన్ చెయ్యడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి అందరు వెళ్తారు. వదిన, అన్నయ్య పక్కన కూర్చో అని సిరి అనగానే.. రామలక్ష్మి ఇబ్బందిపడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.