English | Telugu

Krishna Mukunda Murari : ఇంటికి వచ్చిన మీరానే ముకుంద అని కృష్ణ కనిపెట్టేసిందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -430 లో.. ఆదర్శ్ దగ్గరికి నందు వెళ్లి మాట్లాడుతుంటే.. నువ్వు పుట్టింటి విషయాల్లో జోక్యం చేసుకోకు, చేసుకుంటే నీకు నీ అత్తింటివారికి ప్రాబ్లమ్ వస్తుంది. లేకపోతే నీ అత్తింటికి వెళ్లిపో.. ఇలా నాకు నీతులు చెప్పకని నందుపై ఆదర్శ్ ఆరుస్తుంటాడు‌. అప్పుడే మురారి వచ్చి ఎక్కడికి వెళ్ళదు.. నీకు నాకు ఈ ఇంట్లో ఉండే హక్కు ఎంత ఉందో తనకి కూడా అంతే ఉందని మురారి అంటాడు.

ఆ తర్వాత ఇలా నీతులు చెప్తుంటేనే వెళ్ళమని చెప్పాను.. నిన్నైతే ఏకంగా ఇంట్లో నుండే వెళ్ళమని చెప్తానని ఆదర్శ్ అనగానే.. ఏం మాట్లాడుత్తున్నావ్ రా అంటు ఆదర్శ్ పై నందు కోప్పడుతుంది. ఆ తర్వాత నందు, మురారి ఇద్దరు హాల్లోకి వస్తారు. ఆదర్శ్ రోజు రోజుకి ఇలా తయారైతున్నాడని రేవతితో నందు చెప్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు ఆదర్శ్ దగ్గరికి వెళ్ళమని చెప్పారని కృష్ణ అంటుంది. అప్పుడే రూపం మార్చుకొని ఉన్న ముకుంద మీరాగా భవానితో పాటు ఇంటికి వస్తుంది. ఒకసారి ఈ ఇంటి కోడలిగా అడుగుపెట్టాను.. అప్పుడు నేను అనుకున్నది జరగలేదు.. ఇప్పుడైనా నేను అనుకున్నది చేస్తానంటు మీరా ఇంట్లో అడుగుపెడుతు అనుకుంటుంది. తనే ముకుంద అని తెలియక భవాని ఇంటికి తీసుకొని వచ్చి అందరిని పరిచయం చేస్తుంది. మా మురారి ని విడిపించినందుకు మీకు థాంక్స్ అని అందరు చెప్తారు. అప్పుడే ఆదర్శ్ వస్తాడు. అదర్శ్ ని మీరాకి పరిచయం చేస్తుంది భవాని. ఇకనుండి ఈ మీరా ఇక్కడే ఉంటుందని భవాని చెప్పగానే.. ఆదర్శ్ కోపంగా వెళ్లిపోతాడు.

ఆ తర్వాత ఆదర్శ్ ఎందుకు కోపంగా ఉన్నాడు.. నేను మురారి విడిపించినందుకు అనుకుంటా ఆదర్శ్ కి నాపై సాఫ్ట్ కార్నర్ వచ్చేలా చెయ్యాలని మీరా అనుకుంటుంది. మరొకవైపు మీరా ఒక స్లమ్ ఏరియాలో చిన్న రూమ్ లో ఉంటుంది. పాపం సింపుల్ గా ఉండడం అంటే ఇష్టం అంట అని భవాని... కృష్ణ, మురారీలకి చెప్తుంది. ఆ తర్వాత మురారి షర్ట్ తీసుకొని మీరా ముద్దుపెడుతుంది. అప్పుడే నందు వస్తుంది. నందు చూసిందేమో అనుకొని మీరా టెన్షన్ పడుతుంది. కానీ నందు వచ్చి మీరాతో మాట్లాడి వెళ్తుంది. తరువాయి భాగం మలో అందరికి మీరా వడ్డీస్తుంది. నువ్వు కూడా కూర్చొని తిను అని కృష్ణ అనాగానే... మీరా తింటుంది. నువ్వు మా ముకుంద కలిపినట్లే కలుపుతున్నావని కృష్ణ అనగానే.. అందరు షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.

Jayam serial : బాక్సింగ్ పోటీలో మిస్సెస్ గంగ రుద్ర ప్రతాప్.. పారు ఏం చేయనుంది!

జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -160 లో..... గంగని ఎలాగైనా అకాడమీ సెలక్షన్ కి వెళ్లకుండా ఆపాలని ఇషిక, వీరు ట్రై చేస్తారు కానీ గంగ, రుద్ర ఇద్దరు కలిసి ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసి అకాడమీకి వెళ్తారు. రుద్ర అకాడమీ బయటే ఉంటాడు. నాకు సంబంధించిన కేసు ఇంకా పెండింగ్ లో ఉంది అలా ఉండగా.. నేను లోపలకు రాకూడదని రుద్ర బయటే ఉండి గంగకి అంతా వివరిస్తాడు. నేను నీ పేరు మైక్ లో రావడం వినాలని రుద్ర అంటాడు. గంగ లోపలకు వెళ్తుంది. అక్కడ పారు ఇంకా తన ఫ్రెండ్స్ కలిసి గంగని చులకనగా మాట్లాడుతారు.

Brahmamudi : రుద్రాణిని రెడ్ హ్యాండెడ్ గా పట్టించిన కనకం!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -922 లో.. ఒకతను వచ్చి రుద్రాణికి మళ్ళీ పసరు మందు ఇస్తాడు. ఆ పసరు మందు పని చేస్తుందా లేదా అని రుద్రాణి అతన్ని అడుగుతుంది. పని చేస్తుందని అతను చెప్తాడు. దాంతో రుద్రాణి పసరు మందు తీసుకొని లోపలికి వెళ్తుంటే అప్పుడే కనకం ఎదురుపడుతుంది. కనకాన్ని చూసి రుద్రాణి టెన్షన్ పడుతుంది. చేతిలో అదేంటీ అని కనకం అనగానే ఇదా.... నాకే పసరు మందు అజీర్తికి వాడమని చెప్పారని చెప్పి రుద్రాణి వెళ్ళిపోతుంది. అలా అయితే ఇంత రాత్రివేళ తీసుకొని వెళ్తుంది ఏంటని కనకంకి డౌట్ వస్తుంది.