Read more!

English | Telugu

హ్యాపీ డేస్ మూవీ ఆడిషన్స్ కి వెళ్ళా...చీపురు కట్టతో మోటివేట్ చేసేది అమ్మ

యాక్టర్ గా, రైటర్ గా, డైరెక్టర్ గా మల్టీటాలెంట్‌ పెర్సొనాలిటీతో రాణిస్తున్నాడు అవసరాల శ్రీనివాస్. అష్టా-చమ్మాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. కటౌట్ చూస్తేనే చాలు కామెడీతో కూడిన నవ్వు ఆడియన్స్ పెదాల మీదకు వచ్చేస్తుంది.  ఊహలు గుసగుసలాడే, జో- అచ్యుతానంద చిత్రాలకు దర్శకత్వం వహించారు. అష్టా-చమ్మా, పిల్ల జమీందార్, అంతకు ముందు ఆ తరువాత, నాన్నకు ప్రేమతో, అ ! వంటి చిత్రాల్లో తన విలక్షణ నటనతో ఆకట్టుకున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ చేసిన అవసరాల.. స్క్రీన్ రైటింగ్, థియేటర్ ఆర్ట్స్‌లో ఎంతో అనుభవం ఉంది. అలాంటి శ్రీనివాస్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. "చిన్నప్పుడు చీపురు కట్టతో పెద్దయ్యాక అన్నయ్యతో పోలుస్తూ నన్ను అమ్మ మోటివేట్ చేస్తూ ఉండేది. మా అన్న ఆటిఫిషియల్  ఇంటెలిజెన్స్ లో పిహెచ్డి చేసి యూఎస్ లో సెటిల్ అయ్యారు.

హ్యాపీ డేస్ మూవీకి ఆడిషన్స్ పడితే వెళ్లాను కానీ సెలెక్ట్ కాలేదు...తర్వాత అష్టా చెమ్మ మూవీకి ఆడిషన్ టేప్ పంపించాను సెలెక్ట్ ఐపోయాను. ఊహలు గుసగుసలాడే మూవీలో నా రోల్ కి మొదట నవీన్ పోలిశెట్టిని అనుకున్నారు.. కానీ తాను చేయకపోయేసరికి నేనే చేసాను. రాశీ ఖన్నా డ్రైవింగ్ చేస్తే మాత్రం నేను ఇంకోసారి కూర్చోను ఎందుకంటే స్టంట్ మాష్టర్ కంటే ఘోరంగా డ్రైవింగ్ చేస్తుంది. మా బాబాయ్ తో ఎక్కువగా ఉండేవాడిని. నేను రైటింగ్ లో డిప్లొమా చేసాను. కాకినాడ దగ్గర మా ఊరు. నాన్న  బ్యాంకు జాబ్ చేసేవారు.. దాంతో ఎక్కువగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండేవి. కిషోర్ కుమార్ పాటలు వింటూ నేను హిందీ నేర్చుకున్నా. కొన్ని వందల క్యాసెట్లు కొనుక్కుని పెట్టుకున్నా. ఊహలు గుసగుసలాడే మూవీలో కనిపించే క్యాసెట్స్ సీన్ లోవి నేను సేకరించి పెట్టుకున్నవే. నేను ఒక స్టోరీ రాయాలంటే కొన్నేళ్లు  పడుతుంది. అందుకే లేట్ గా మూవీస్ ని డైరెక్ట్ చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా కొంచెం తొందరలోనే రాబోతోంది." అని చెప్పాడు అవసరాల శ్రీనివాస్.