English | Telugu

భార్య కాళ్ళు పట్టుకున్న స్టార్ డైరెక్టర్!

ధర్మేచ అర్దేచ కామేచ మోక్షేచ నాతిచరామి.. ఇలా ప్రతీ పెళ్ళిలో మంత్రాలు మారుమ్రోగుతుంటాయి. వీటి అర్థం ప్రతీ సినిమాలో చెప్పారు. అయితే నిజజీవితంలో ఎంతవరకు అమలు అవుతుందనేది భార్యభర్తలిద్దరు బయటకి చెప్పినప్పుడే తెలుస్తుంది. అదే విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ లో ఉంది.

ఇదంతా ఎందుకంటే ఓ స్టార్ డైరెక్టర్ తన భార్యని కారులో అలా బయటకు తీసుకెళ్తూ కాళ్ళు నొక్కుతూ ఓ రీల్ ని తన ఇన్‌ స్టాగ్రామ్ లో షేర్ చేశాడు. ఇప్పుడది నెట్టింట వైరల్ గా మారింది. అసలెవర్రా బాబు అంటే.. బుల్లితెర ధారావాహికల్లో అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న బ్రహ్మముడి, గుప్పెడంత మనసు సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం. ఎస్ నిజమే.. అతనే ఈ స్టార్ డైరెక్టర్. స్టార్ మా టీవీలో ప్రతీనెల అత్యధిక టీఆర్పీతో దూసుకెళ్తున్న బ్రహ్మముడి డైరెక్టర్ కుమార్ పంతం‌.. తన అధ్బుతమైన కథతో, క్యారెక్టర్లని బుల్లితెర ప్రేక్షకులకి నచ్చేలా తీసుకెళ్తున్నారు. ఓ వైపు రిషి-వసుధారల లవ్ స్టోరీ, మరోవైపు కావ్య-రాజ్ ల పెళ్ళి బంధం.. ఇలా రెండింటిలో ప్రేమ, పెళ్ళిని విలువలతో కూడిన క్యారెక్టర్లని తెలుగింటి ఆడపడుచులకు అందిస్తున్నాడు. మరి ఆ డైరెక్టర్ బయట ఏం చేసిన ట్రెండింగ్ లోకి వెళ్తుంటాయి.

భార్యకి సర్ ప్రైజ్ గిఫ్ట్ లు ఇవ్వడం, తను అడిగితే తాజ్ మహల్ దగ్గరకి తీసుకెళ్ళడం.. తనేమడిగినా కాదనకుండా ఇస్తూ అన్నింటిని తన ఇన్ స్టాగ్రామ్ ప్రొఫైల్ లో పోస్ట్ చేస్తున్నాడు కుమార్ పంతం. తాజాగా కారులో అతని భార్యతో పాటు వెళ్తూ అలా తన భార్య కాళ్ళని నొక్కుతున్నట్టుగా ఓ వీడియోని షేర్ చేశాడు. నా కలలని కన్నది నీవే.. నా రేపటి వెలుగువి నీవే అంటూ సాగే పాటకి ఈ రీల్ ని చేశారు. ఇక ఈ రీల్ కి అద్భుతమైన క్యాప్షన్ కూడా రాసుకొచ్చాడు డైరెక్టర్. ' ఈ కార్లు, హౌస్ ఇలా ఏవీ మనతో రావు. ఫైనల్ గా మనమిద్దరమే.. నీకు నేను ఉన్నాను.. నాకు నువ్వు ఉన్నావు. అండ్ థాంక్స్ బేబీ. ఫర్ వన్ మోర్ గ్రేట్ మెమోరీ టూ క్యాప్చర్ దిజ్ ' అంటూ కుమార్ పంతం క్యాప్షన్ రాసుకొచ్చాడు. ‌ఇక ఇప్పుడు ఈ రీల్ ని ఇటు గుప్పెడంత మనసు సీరియల్ అభిమానులు, అటు బ్రహ్మముడి సీరియల్ అభిమానులు, ‌మరోవైపు నెటిజన్లు తెగ కామెంట్ చేస్తున్నారు. మరి ఈ డైరెక్టర్ కుమార్ పంతం చేసిన రీల్ ని మీలో ఎంతమంది చూశారో కామెంట్ చేయండి.

Illu illalu pillalu : అమూల్య ఎంగేజ్ మెంట్ కు ఏర్పాట్లు.. శ్రీవల్లి ప్లాన్ ఏంటి!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు(Illu illalu pillalu). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్-369 లో.. ప్రేమ అందంగా నగలతో రెడీ అవుతుంది. ఆ నగలు చూసి ధీరజ్ కోప్పడతాడు. ఆ నగల్ని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది తీసెయ్ అని ధీరజ్ అనగానే.. మా అమ్మ ఈ నగల్ని ప్రేమతో ఇచ్చిందని ప్రేమ అంటుంది. మా నాన్న అవమానపడటానికి కారణం ఈ నగలే.. ఇవి నీ ఒంటి మీద కనపడటానికి వీల్లేదు తీసెయ్.. అని ధీరజ్ అనగానే ప్రేమ ఎమోషనల్ అవుతూ తీసేస్తుంది. మరోవైపు శ్రీవల్లి రెడీ అవ్వకుండా డల్ గా కూర్చుంటుంది. అప్పుడే ఆమె దగ్గరికి చందు వస్తాడు.

Brahmamudi : కావ్య దగ్గరికి వెళ్ళిన రాజ్.. పాప పుట్టిందిగా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -929 లో.....కళ్యాణ్ కి రాజ్ ఫోన్ చేసి స్టేషన్ నుండి తప్పించుకోవడానికి ఒక ప్లాన్ చెప్తాడు. దాంతో కళ్యాణ్ తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి స్టేషన్ కి వెళ్లి కానిస్టేబుల్ కి లంచ్ బాక్స్ ఇచ్చేసి రమ్మని చెప్తాడు. దాంతో కళ్యాణ్ ఫ్రెండ్ స్టేషన్ కి వెళ్లి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ స్టేషన్ కి ఫోన్ చేసి.. మీ స్టేషన్ లో బాంబ్ పెట్టారు.. ఇందాక బాక్స్ తెచ్చారు కదా అందులో ఉందనగానే ఇన్‌స్పెక్టర్ తో పాటు అందరు బయటకు వెళ్తారు. అప్పుడే కళ్యాణ్ వచ్చి రాజ్ ని బైక్ పై తీసుకొని వెళ్తాడు.