Brahmamudi: అనామిక మాస్టర్ ప్లాన్.. ఆమె ట్రాప్ లో కావ్య పడుతుందా..?
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి' (Brahmamudi). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-521 లో.. అప్పు, కళ్యాణ్ లు కలిసి అనామిక, సామంత్ లకి గట్టి వార్నింగ్ ఇస్తారు. మరోవైపు కృష్ణమూర్తి ఇంటి ముందు మట్టి వేసుకుని విగ్రహాలు చేయడానికి రెడీ అవుతుంటాడు. అప్పుడే కావ్య అక్కడికి వచ్చి.. నాన్నా వినాయక విగ్రహాల ఆర్డర్ వచ్చాయా.. నేను సాయం చేస్తానని సంబరంగా పక్కనే కూర్చుంటుంది.