అవునా, నిజమా అతను గడ్డం నవీనా..
గడ్డం నవీన్ ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా పాపులరైన నటుల్లో ఒకరు. నెత్తి మీద ఉండాల్సిన జుట్టు మొత్తం గడ్డంగా మారిపోయింది. అలా గుబురు గెడ్డంతో మంచి ఎక్స్ప్రెషన్స్తో బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తున్నాడు నవీన్. జబర్దస్త్ నవీన్, గడ్డం నవీన్, నవీన్ ఇటిక, జూనియర్ రాఘవేంద్రరావు ఇలా ఎన్నో పేర్లతో ఆయన్ని పిలుస్తారు. గడ్డం నవీన్ మూవీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికే 26 ఏళ్లు పూర్తిచేసుకున్నారు. ఐతే గడ్డం నవీన్ చాలా మూవీస్ లో చేశారు. ఐతే అప్పట్లో బాగా జుట్టు ఉండేది. ఇప్పుడు అసలు జుట్టే లేదు.