సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ త్వరలో
జీ తెలుగు ఇప్పుడొక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చేసింది. సరేగమప ది నెక్స్ట్ సింగింగ్ యూత్ ఐకాన్ పేరుతో సరికొత్త షో త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. హోస్ట్ గా శ్రీముఖి వచ్చింది. ఇక దుమ్ము బాబోయ్ దుమ్ము అంటున్నారు నెటిజన్స్. అలాగే జడ్జెస్ గా అందరికీ ఇష్టమైన కోటి, ఎస్పి. శైలజ, కాసర్ల శ్యామ్ వచ్చారు. ఈ సీజన్ జీ సరేగమప సరదాగా ఉండబోతోంది అని శైలజ అంటే ఈ సారి సీజన్ తీన్ మారే అంటూ శ్యామ్ అన్నారు. ఇక మెంటార్స్ గా సింగర్స్ రేవంత్, రమ్య బెహరా కనిపించారు. అలాగే సింగర్ చిన్మయి, విజయ్ ఏసుదాస్ వంటి వాళ్ళు కూడా ఎంట్రీ ఇచ్చారు.