English | Telugu

హనీమూన్ కి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావ్ ...నాకు ఇదే ఇంపార్టెంట్


నీతోనే డాన్స్ సీజన్ 2 ఫుల్ ప్రోమో రిలీజ్ అయ్యింది. సీజన్ 1 లో నటరాజ్ మాష్టర్ కి అంజలి-పవన్ జోడీకి మధ్య ఎన్ని గొడవలు, కొట్లాటలు జరిగాయో అందరం చూసాం.. ఆ సీజన్ లో మంచి కంటెంట్ ఐతే ఇచ్చారు. ఐతే ఈ సీజన్ లో ఎపిసోడ్స్ కొన్ని అయ్యాక గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ సీజన్ 2 జస్ట్ లాంచింగ్ ఎపిసోడ్ మాత్రమే అయ్యింది. నెక్స్ట్ వీక్ నుంచి అసలైన షో స్టార్ట్ కాబోతోంది. స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి గొడవలు మొదలైపోయాయి. స్టార్టింగ్ ఎపిసోడ్ థీమ్ "లుకింగ్ లైక్ ఏ వావ్" రౌండ్ అన్నమాట. ఒక్కో పెయిర్ ఒక్కో ఇరగదీసే పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.

ఇక ఫైనల్ లో ఏక్నాథ్- హారిక జోడి వచ్చి ఒక శ్యాడ్ పెర్ఫార్మెన్స్ చేశారు. ఐతే అందులో టాకీ పార్టీ ఎక్కువగా ఉంది డాన్స్ చాలా తక్కువగా ఉంది. వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి అటు జడ్జ్ సదా, ఇటు తరుణ్ మాష్టర్ భోరుభోరున ఏడ్చేశారు. ఐతే వీళ్ళ పెర్ఫార్మెన్స్ కి నాగపంచమి సీరియల్ జోడి దర్శిని గౌడ- ప్రిద్వి శెట్టి 7 మార్క్స్ కి జస్ట్ 4 మార్క్స్ ఇచ్చారు. "యాక్టింగ్ చాలా బాగా చేసారు కానీ డాన్స్ చాలా తక్కువగా ఉన్నట్టు అనిపించింది" అని చెప్పాడు ప్రిద్వి శెట్టి. "సో మీకు ఈ పెర్ఫార్మెన్స్ లో టాకీ పార్ట్ ఉందని చెప్పి అన్ని మార్క్స్ తీసేసారా" అని ఏక్నాథ్ అడిగాడు. "అవును అవును..ఎందుకంటే ఇది నీతోనే డాన్స్ షో కానీ నీతోనే యాక్టింగ్ షో కాదుగా" అని గట్టిగా వాదించాడు. ఏక్నాథ్-హారిక జోడికి అన్ని తక్కువ మార్క్స్ ఇచ్చేసరికి రాధా కూడా షాకైపోయింది. ఇక పొతే యావర్ జోడి నయనిపావని లాంచింగ్ ఎపిసోడ్ లో కనిపించింది కానీ స్టార్టింగ్ ఎపిసోడ్ లో కనిపించలేదు. ఈ ఎపిసోడ్ కి యావర్ కి జోడీగా వాసంతి కృష్ణన్ వచ్చి డాన్స్ చేసింది. "హనీమూన్ కి వెళ్లకుండా డాన్స్ సెట్ లో ఎం చేస్తున్నావ్" అని వాసంతిని అడిగింది శ్రీముఖి.."నాకు ఇదే ఇంపార్టెంట్" అని చెప్పింది వాసంతి. ఐతే మరి ఏక్నాథ్ వెర్సెస్ ప్రిద్వి శెట్టి మధ్య గొడవ గురించి తెలియాలంటే ఎపిసోడ్ కోసం కొంచెం వెయిట్ చేయాలి.

Brahmamudi: రాహుల్ మనిషిని పట్టుకున్న రాజ్, కావ్య.. ఇక దేత్తడి!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -905 లో....అప్పు పాప కేసు ఫైల్ చూస్తుంటే ఆఫీసర్ వస్తాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను వద్దని అయినా అలాగే చేస్తున్నావని కోప్పడతాడు. లేదు సర్ పాప చనిపోలేదు.. చనిపోయిన పాప వేరు.. ఆ పాప DNA తో మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపించగానే అవునా కేసులో ఒక కొత్త మలుపు తీసుకొని వచ్చావ్ గుడ్ కేరియాన్ అని ఆఫీసర్ అంటాడు. కాసేపటికి రేపు పాప వాళ్ళ ఫాదర్ ని స్టేషన్ కి రప్పించండి అని కానిస్టేబుల్ తో అప్పు చెప్తుంది. మరొకవైపు రాహుల్ అవార్డు ఫంక్షన్ కి రాజ్, కావ్య వెళ్తారు. అక్కడ రాహుల్ డిజైన్స్ చూసి రాజ్, కావ్య షాక్ అవుతారు.

Karthika Deepam2: జ్యోత్స్న చేసిన ఫ్రాడ్ చూసి కార్తీక్, శ్రీధర్ షాక్.. ఇంటి వారసురాలు కాదేమో!

స్టార్ట్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2'(Karthika Deepam2). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -542 లో..... కార్తీక్, శ్రీధర్ జ్యోత్స్న రెస్టారెంట్ ఫుడ్ ట్రక్స్ బాగా పాపులర్ అయ్యాయని హ్యాపీగా ఉంటారు. ఇద్దరు బయట టీ తాగుతూ కబుర్లు చెప్పుకుంటారు. జ్యోత్స్న చాలా తప్పు డు లెక్కలు చూపించిందని శ్రీధర్ అనగానే ఎంత మొన్న కొన్న ల్యాండ్ గురించా అని  కార్తీక్ అడుగుతాడు. లేదు అది జస్ట్ శాంపిల్ మాత్రమే.... ఎంత అంటే అది చెప్తే శివన్నారాయణ గుండె పట్టుకొని పడిపోయేంత డబ్బులు ఫ్రాడ్ చేసిందని శ్రీధర్ అనగానే కార్తీక్ షాక్ అవుతాడు.