English | Telugu

Karthika Deepam 2 : కార్తిక్, జ్యోత్స్నల పెళ్ళి.. ఏం నటిస్తున్నావే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2' (karthika Deepam 2). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -143 లో... దీప దగ్గరికి నరసింహా రావడంతో.. ఎందుకు వచ్చావ్ అంటూ దీప, అనసూయలు కోప్పడతారు. నాకు ఇల్లు ఇవ్వు అంటూ అడుగుతాడు. నువ్వు మర్యాదగా వెళ్తావా వెళ్ళవా అంటూ అనసూయ లోపలికి వెళ్ళి కత్తిపీట తీసుకొని వస్తుంది. అప్పుడే  నర్సింహాను చూసి శౌర్య భయపడుతుంది. నర్సింహా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అదంతా పై నుండి జ్యోత్స్న చూస్తుంది. నరసింహా వెళిపోతుంటే జ్యోష్న తనతో వెళ్లి మాట్లాడుతుంది. దీపపై నరసింహాకి కోపం వచ్చేలా రెచ్చగొడుతుంది.