English | Telugu

Brahmamudi : పంతం వదలని భర్త.. కన్నతల్లి కోసం భార్యని వదిలేసాడా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -514 లో.....మా అమ్మ అలా అవ్వడానికి కారణమైన వాళ్ళని వెనకేసుకొని వచ్చి రక్తసంబంధాన్ని పట్టించుకోవడం లేదని ఆ మనిషికి సపోర్ట్ చేస్తూ.. నన్ను తప్పు పడుతున్నవ్ అన్నదమ్ముల అనుబంధం తెంపుకునేలా మాట్లాడుతున్నావ్.. అవన్నీ వదిలేసి ప్రశాంతంగా వెళ్ళమని‌ కళ్యాణ్ తో రాజ్ అనగానే.. అలా వెళ్ళాలంటే నువ్వు వదినని తీసుకొని రావాలని కళ్యాణ్ అంటాడు. ఆ పని ఎప్పటికి చెయ్యను. తను తప్పు చేసానని ఫీల్ అయింది కాబట్టి వెళ్లిపోయింది. తప్పు చేయకుంటే గట్టిగా నిలబడి అడిగేదని రాజ్ అంటాడు.

Karthika Deepam : కార్తిక్ కి సపోర్ట్ గా దీప.. జ్యోత్స్నతో పెళ్ళి అవుతుందా!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కార్తీక దీపం 2 '(Karthika Deepam 2).ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -148 లో.....తప్పు చేసిన వాళ్ళు ఇంట్లో ఉండొద్దంటే దీప తప్పు చేసిన తననికి ఇంట్లో ఎందుకు ఉంచారని సుమిత్రని‌ జ్యోత్స్న అడుగుతుంది. దీప ఏ తప్పు చేయలేదని సుమిత్ర అంటుంది. బావకి ఆ పరిస్థితి రావడానికి కారణం దీప అని జ్యోత్స్న వాదిస్తుంది. అసలు తనని కాపాడబోయి ఈ సిచువేషన్ తెచ్చుకున్నాడని జ్యోత్స్న అనగానే మరి దీప నన్ను కూడా కాపాడింది కదా దానికేం అంటావని సుమిత్ర అడుగుతుంది. అసలు ఆ నర్సింహా దీపల వల్లే నీ కూతురు ఎంగేజ్ మెంట్ ఆగిపోయిందని పారిజాతం అంటుంటే.. శివన్నారాయణ వచ్చి తనపై కోప్పడతాడు.

కోమాలో నుండి లేచి కోడలు ఎక్కడ అని అడిగిన అత్త!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahamamudi). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -513 లో.. ఈ ఇంట్లో నా ఉనికి లేనప్పుడు బలవంతంగా మీ ప్రేమని సాధించలేనప్పుడు.. ఇక మీ భార్యగా నాకు సెలవంటూ కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. కావ్య వెళ్తుందంటూ ఇందిరాదేవి బాధపడుతూ సీతారామయ్యకి చెప్తుంది. ఇప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నామని సీతారామయ్య అంటాడు. కావ్య గడుపదాటి వెళ్ళిపోతుంది. కావ్య ఇంట్లో నుండి వెళ్లిపోయిన విషయం కళ్యాణ్ తెలుసుకుంటాడు. ఆ తర్వాత కావ్య బాధపడుతూ.. తన పుట్టింటికి వెళ్లి ఇంటి ముందు కూర్చొని బాధపడుతుంది. అప్పుడే కనకం చూసి ఏమైందని అడుగుతుంది. లోపలికి వెళదాం పదా అని కనకం అంటుంది.

ఆమెను చీరకొంగుతో చేతులు కట్టేసి.. ఏం చేశాడంటే!

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -198 లో.... సీతాకాంత్ మేనేజర్ దగ్గరికి నందిని వచ్చి సీతాకాంత్ కార్ కి డ్రైవర్ లేడన్న విషయం.. మీరు ఎందుకు పట్టించుకోలేదని అడుగుతుంది‌. రామలక్ష్మి గారు పెళ్లి చేసుకోకముందు సర్ కి డ్రైవర్ గా ఉన్నారు అంతే కాదు రామలక్ష్మి గారిది పర్ ఫెక్ట్ డ్రైవింగ్ అని మేనేజర్ చెప్తాడు. ఆ తర్వాత నందిని సీసీటీవీ ఫుటేజ్ కోసం సెక్యూరిటీ దగ్గరికి వెళ్తుంది. సీసీ టీవీ ఫుటేజ్ లో ఏం ఉండదు. ఆ తర్వాత రామలక్ష్మి డ్రైవింగ్ చేసిన కార్ రిపేర్ చేస్తున్న మెకానిక్ కి నందిని ఫోన్ చేసి కార్ కండిషన్ ఏంటని అడుగుతుంది. కార్ బాగుంది మేడమ్ కానీ ఎవరో కార్ బ్రేక్ కావాలనే కట్ చేశారని చెప్తాడు.