Read more!

English | Telugu

ఆరియానా సూసైడ్ రీల్...తిడుతున్న నెటిజన్స్


ఈ మధ్య సోషల్ మీడియాలో ఏది పోస్ట్ చేసినా అది కాస్తా వైరల్ అయిపోతోంది. అందులో ఇలాంటి సూసైడ్స్ కానీ కష్టాలు, కన్నీళ్లు ఉండే వీడియోస్ ఐతే ఇంకా స్పీడ్ గా వైరల్ ఐపోతున్నాయి.. మరి ఇప్పుడు ఆరియానా సూసైడ్ రీల్ అలాగే వైరల్ గా మారింది. ఆరియానాకు ఎం కష్టాలు ఉన్నాయో కానీ తన ఇంట్లో ఫ్యాన్ కి చున్నీని కట్టి ఉరేసుకోవడానికి రెడీగా ఉంది. ఇంతలో ఆరియానా దగ్గరకు హర్షితా వస్తుంది. అది కూడా ఆమెను చూసి పలకరించడానికి కాదు. తనకు ఉన్న బాధలను ఆరియానాతో షేర్ చేసుకోవడం కోసం ఆమె వస్తుంది. ఇక అక్కడ ఆరియానా తన బాధలతో సూసైడ్ చేసుకోబోతున్న విషయాన్ని గమనించాక ఆమె తన మనసు మార్చుకుంటుంది. హర్షితాను చూసిన ఆరియానా చెయ్యి ఊపి హాయ్ అన్నట్టుగా పలకరిస్తుంది.

ఇంతలో ఈ ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయి అన్నట్టుగా ఆరియానా మైండ్ మార్చడానికి హర్షిత తన బాగ్ లోంచి నెయిల్ పోలిష్ చూపిస్తుంది. ఆరియానా ఆలస్యం చేయకుండా వెంటనే కిందకి దిగి వచ్చేస్తుంది. హర్షిత ఆరియానా ఫింగర్స్ కి నెయిల్ పాలిష్ వేస్తుంది. ఇక ఈ రీల్ చూసాక నెటిజన్స్ కొందరు కసురుతున్నారు, కొందరు నవ్వుతున్నారు.. ఇంకొందరైతే వెరైటీ కామెంట్స్ చేస్తున్నారు. "ఉరి వేసుకునే చున్నీ మాచింగ్ కాలేదు కదా. అది కూడా ప్రాబ్లమ్ కదా...అమ్మాయిలు నెయిల్ పాలిష్ వేసుకుంటున్నారు..అదే అబ్బాయిలైతే బాటిల్ ని ఓపెన్ చేసి బాధల్ని పంచుకుంటారు. నాన్సెన్స్ . సూసైడ్ అన్నిటికీ పరిష్కారం కాదు. మంచి మెసేజ్ ఇచ్చే వీడియోస్ చేయండి ఇలాంటివి కాదు..ఆరియానా నువ్వు ప్లాస్టిక్ స్టూల్ మీద నిలబడి ఇలాంటి వీడియో చేసావ్..పొరపాటున అది విరిగితే ఇబ్బంది పడేది నువ్వే కదా.. ఇలాంటివి ట్రై చేయకు." అని కామెంట్స్ చేస్తున్నారు.