రొమాన్స్ అనేది బేసిక్ నీడ్..అది అందరికీ అవసరం
రోటి, కపడా, రొమాన్స్ అనే మూవీ త్వరలో ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఐతే దీనికి సంబంధించి మూవీలో మెయిన్ లీడ్స్ గా ఉన్న సుప్రాజ్ రంగా, మేఘలేఖతో ఆరియానా ఇంటర్వ్యూ చేసింది. అసలు ఈ టైటిల్ ఏమిటి అనేసరికి "మొదటి రెండు అందరికీ తెలుసు..ఐతే రొమాన్స్ అనేది ఈ మధ్య కాలంలో" అని సుప్రాజ్ అనబోతుంటే "తగ్గిందా తగ్గిందా" అంటూ గారంగా అడిగింది ఆరియానా. అందరికీ రోటి, కపడా, మకాన్ అనే తెలుసు కానీ రొమాన్స్ అనేది ఇంపార్టెంట్ అనే విషయం ఎవరికీ తెలీదు కదా" అని సుప్రాజ్ అనేసరికి..రొమాన్స్ అనేది బేసిక్ నీడ్" అంటూ మేఘలేఖ కొత్త పాయింట్ చెప్పింది.