వాస్తవ వేదిక.. వెనుకబాటుకు నేతల అవినీతి, పాలకుల చిత్తశుద్ధిలేమి కారణం

వర్తమాన రాజకీయ, సామాజిక అంశాలపై తెలుగువన్ ‘వాస్తవ వేదిక’పై తెలుగువన్ ఎండీ రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్   విశ్లేషణాత్మక చర్చ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్వహణను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) మోడల్‌లోకి మార్చడంపై జరుగుతున్న చర్చ   రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో ‘వాస్తవ వేదిక’ ఈ సంచికలో ఆ అంశంపై విశ్లేషణాత్మక చర్చ జరిపారు.   ఆంధ్ర ప్రదేశ్ లో మెడికల్ కాలేజీల నిర్వహణపై   అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.  గత ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన 17 మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్వహించాలనే ప్రస్తుత ప్రభుత్వ నిర్ణయాన్ని   వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.  అయితే  ప్రభుత్వం నేరుగా మెడికల్ కాలేజీలను నడపడం ఒక రకమైన  మూర్ఖత్వమని డోలేంద్ర ప్రసాద్ అన్నారు. ఏడు దశాబ్దాల తరువాత కూడా  ప్రభుత్వ ఆసుపత్రులు కిలోమీటర్ దూరం నుంచే గుర్తుపట్టగలిగేంత దుర్వాసనతో, అపరిశుభ్రంగా ఉంటున్నాయన్న ఆయన. విపరీతమైన   రద్దీ,  వైద్యుల కొరత, పారిశుద్ధ్య లోపం కారణంగా ప్రభుత్వ వైద్యం ప్రజలకు పూర్తి స్థాయిలో అందడం లేదని చెప్పారు.  ఇక  గత ప్రభుత్వం పార్వతీపురం, పిడుగురాళ్ల వంటి మారుమూల ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలను ప్రతిపాదించింది. అయితే ఈ ప్రతిపాదన పూర్తిగా హేతు రహితం. ఎందుకంటే..మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం మెడికల్ సీట్లు రావాలంటే  అర్హత కలిగిన ఫ్యాక్ ల్టీ అంటే ప్రొఫెసర్లు ఉండాలి.  పెద్ద డాక్టర్లు లేదా ప్రొఫెసర్లు మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు.  నారాయణ వంటి ప్రైవేట్ సంస్థలే నెలకు 15 లక్షల రూపాయల జీతం ఇచ్చినా మంచి ప్రొఫెసర్లను తెచ్చుకోలేకపోతున్నాయి. అటువంటప్పుడు ప్రభుత్వ పే-స్కేల్స్‌తో వారు ఎలా వస్తారన్నది పెద్ద ప్రశ్న. ఇక మారుమూల ప్రాంతాలకు రావడానికి అర్హత కలిగిన వారు రావడానికి ఇష్టపడకపోవడానికి వారి పిల్లల చదువులు, కుటుంబ వసతులు వంటివి అవరోధాలుగా మారుతున్నాయని డోలేంద్ర ప్రసాద్ చెప్పారు.    ఇక పీపీపీ మోడల్ అన్నది ఈ సమస్యలకు పరిష్కారమా? వ్యాపారమా అన్న విషయానికి వస్తే.. ఈ పీపీపీ మోడల్ అన్నది దేశంలో కొత్తదేమీ కాదు,   హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్, కృష్ణపట్నం, గంగవరం పోర్టులు, జాతీయ రహదారులు ఇదే మోడల్‌లో విజయవంతంగా నడుస్తున్నాయి. అటువంటప్పుడు అదే పీపీపీ మోడల్ లో మెడికల్ కాలేజీల నిర్వహణకు అభ్యంతరమెందుకని ఆయన ప్రశ్నించారు. వాస్తవానికి పీపీపీ అంటే పేరుకు మాత్రమే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం ఆచరణలో మాత్రం   ప్రైవేట్ నిర్వహణే అన్నారు.  ప్రైవేట్ రంగంలో మెడికల్ కాలేజీల సీట్ల ధరలు భారీగా ఉన్నాయి.   సీటు 50 లక్షల నుండి కోటి  రూపాయల వరకూ,  అదే పీజీ అయితే   3 నుండి 5 కోట్ల  రూపాయల వరకూ ఉన్నాయి. కానీ ప్రైవేట్ యాజమాన్యం లాభాపేక్షతోనైనా సరే ఆసుపత్రులను శుభ్రంగా, మెరుగైన సౌకర్యాలతో నడిపే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని డోలేంద్ర ప్రసాద్ వ్యక్తం చేశారు.   అయితే వైసీపీ ఈ వ్యవహారాన్ని రాజకీయ కారణాలతో  పెద్ద భూతంగా చూపిస్తూ , ప్రజల దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందన్నారు.  రాష్ట్రంలో  కూటమి ' ప్రభుత్వం కాకుండా, ప్రతిపక్షం మరియు అధికార పక్షం కలిపి నడిపే 'కుమ్మక్కు' ప్రభుత్వం నడుస్తోందన్నారు. ప్రజలకు సంబంధం లేని విషయాలను కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని డోలేంద్ర ప్రసాద్ విశ్లేషించారు. భారతదేశంలో అవినీతి అన్ని రంగాలకు విస్తరించిందనీ, చైనాతో పోలిస్తే మనం అభివృద్ధిలో వెనుకబడి ఉండటానికి కారణం ఇక్కడి రాజకీయ నాయకుల అవినీతి,  పాలకుల చిత్తశుద్ధి లేమే కారణమన్నది ‘వాస్తవ వేదిక’ చర్చ సారాంశం.  మెడికల్ కాలేజీల విషయంలో పీపీపీ మోడల్ అనేది కేవలం రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా, సామాన్యుడికి మెరుగైన వైద్యం అందే దిశగా అడుగులు వేయాల్సి ఉందని రవిశంకర్, డోలేంద్ర ప్రసాద్ అన్నారు.  పూర్తి వివరాలకు తెలుగువన్ న్యూస్ లో వాస్తవ వేదిక తొమ్మిదో ఎడిషన్ వీక్షించండి   
Publish Date: Jan 23, 2026 3:10PM

ఏపీ లిక్కర్ స్కామ్‌.. ఈడీ విచారణకు మిథున్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.  ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ సమన్ల మేరకు వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి శుక్రవారం (జనవరి 23) ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.  మద్యం కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆర్థిక లావాదేవీలు జరిగాయని ఈడీ నిర్థారణకు వచ్చింది. ఈ కేసులో  కోట్లాది రూపాయల కిక్‌బ్యాగ్స్   ఉండొచ్చన్న అనుమానాలతో దర్యాప్తు ను మరింత వేగవంతం చేసింది.   జగన్ హయాంలో మద్యం విధానం రూపకల్పన, అమలు సమయంలో భారీ అవకతవకలు జరిగాయనీ,  మధ్యవర్తుల ద్వారా భారీ మొత్తాలు లావాదేవీలు జరిగాయని ఈడీ అనుమానిస్తోంది. ముఖ్యంగా హవాలా మార్గంలో నగదు తరలింపులు, మనీ లాండ రింగ్ చట్టాల ఉల్లంఘన జరిగిందని ఈడీ ప్రాథమికంగా నిర్థారణకు వచ్చింది. ఈ నేపథ్యంలోనే  ఈడీ అధికారులు మిథున్ రెడ్డికి సంబంధించిన బ్యాంక్ ఖాతాలు, కంపెనీలతో జరిగిన లావాదేవీలు, అను బంధ వ్యక్తులు, సంస్థల వివరాలు సేకరిస్తున్నారు. లిక్కర్ వ్యాపారంలో పాల్గొన్న పలువురు వ్యాపా రులు, మధ్యవర్తులను విచారించడం ద్వారా వచ్చిన సమాచారంతో ఈడీ మిథున్ రెడ్డిని విచారిస్తున్నట్లు సమాచారం.   ఈ కుంభకోణంలో  రాజకీయ నేతల పాత్రపై ఇప్పటికే తీవ్ర చర్చ సాగుతున్న నేపథ్యంలో, ఎంపీ విజయసాయిని ఈడీ విచారణకు పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. మిధున్ రెడ్డి విచారణలో మద్యం కుంభకోణం వ్యవహారంలో కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ కేసు రాజ కీయ ప్రేరేపితమని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండగా, చట్టప్రకారమే విచారణ జరుగుతోందని ఈడీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. 
Publish Date: Jan 23, 2026 2:38PM

తప్పులెన్నువారు తమతప్పులెరుగరన్నట్లుగా జగన్ తీరు!

తప్పులెన్నువారు తమ తప్పులెరుగరయా అన్నట్లుగా ఉంది జగన్ తీరు. తన హయాంలో సర్వే రాళ్ల వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. స్థలాల సరిహద్దులను నిర్ణయిస్తూ ఏర్పాటు చేసే సర్వే రాళ్ల కోసం ఏడంగా ఏడువందల రూపాయలు వ్యయం చేయడం, ఖరీదైన గ్రానైట్ రాళ్లను వినియోగించడం అప్పట్లో పెను దుమారం రేపిన సంగతి తెలిసిందే. అంతే కాదు ఆ రాళ్లపై జగన్ జగన్ ఫొటోలను ముద్రించడం కూడా పెను వివాదంగా మారింది. హైకోర్టు కూడా సర్వేరాళ్లపై జగన్ బొమ్మల పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలాగే  భూముల రీ సర్వేకు సంబంధించి రైతులకు ఇచ్చిన పాస్ పుస్తకాలపై కూడా జగన్ బొమ్మ ఉండటంపై కూడా అప్పట్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.   కాగా 2024 ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే భూముల రీసర్వేను పారదర్శకంగా చేపడతామనీ, అలాగే పట్టాదారు పాసుపుస్తకాలపై ఉన్న జగన్ బొమ్మలను తొలగిస్తామని అప్పటి విపక్ష నేత చంద్రబాబు హామీ ఇచ్చారు.  అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీ మేరకు ఖరీదైన సర్వే రాళ్లను తొలగించి సాధారణ రాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫొటోను తొలగించి ప్రభుత్వ రాజముద్రను ముద్రించారు పంపిణీ చేశారు. దీనిపై రైతులలో హర్షం వ్యక్తం అవుతోంది.  కానీ జగన్ మాత్రం తన తప్పులను తెలుగుదేశం ప్రభుత్వం సరిదిద్దడాన్ని సహించలేకపోతున్నారు.  సరిహద్దురాళ్లు సరిగా లేవు, పాసుపుస్తకాలు కూడా తప్పుల తడకలా ఉన్నాయంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.  గురువారం (జనవరి 22) తాడేపల్లి ప్యాలెస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడిన జగన్ తన ప్రసంగం మొత్తం తెలుగుదేశం కూటమి  చేపట్టిన భూముల రీసర్వేపైనే మాట్లాడారు. అసలీ కార్యక్రమాన్ని చేపట్టినది తానేనంటూ క్రెడిట్ చోరీకి శతధా ప్రయత్నించారు. వాస్తవానికి భూముల రీసర్వే కేంద్ర ప్రభుత్వ కార్యక్రమం  అదే సమయంలో అప్పట్లో తన నిర్వాకం అదే ఫొటోల వ్యవహారం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుందన్నవ విషయాన్ని కనీసం ప్రస్తావించలేదు.  భూ యజమానులకు జారీ చేసిన పట్టాదారు పాసు పుస్తకాలపై  తన సొంత ఫోటోను ముద్రించడం పట్ల జగన్  ఈ సమావేశంలో ఎలాంటి వివరణా ఇవ్వలేదు. అసలా ప్రస్తావన చేయడానికి కూడా సాహసించలేదు. అంతే కాదు తన హయాంలో సరిహద్దు రాళ్లపై తన పేరు, ఫోటో విషయాన్ని కూడా దాటవేశారు.   దీంతో జగన్ మీడియా సమావేశంలో ప్రసంగం విన్నవారంతా తప్పులెన్నువారు అన్న వేమన శతకంలోని పద్యాన్ని గుర్తు చేసుకుంటున్నారు. 
Publish Date: Jan 23, 2026 2:14PM

జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో టెన్షన్స్ పీక్స్ కు

తాడిపత్రిలో  ఉద్రిక్తతలు పీక్స్ చేరాయి. తెలుగుదేశం నాయకుడు  జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ వైరం పతాక స్థాయికి చేరుకుంది. ఇరువురూ సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   దీంతో   పోలీసులు భారీగా మోహరించి, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను పటిష్ఠం చేశారు.   రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దీనికి  స్పందించిన ప్రభాకర్ రెడ్డి, చర్చకు తాను సిద్ధమని, పెద్దారెడ్డి ఇంటి వద్దకే వస్తానని ప్రతిసవాల్ విసిరారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది.  ముందస్తు చర్యల్లో భాగంగా  పోలీసులు ఇరువురి నేతల నివాసాలకు సమీపంలో ఉన్న కాలేజీ మైదానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  
Publish Date: Jan 23, 2026 1:41PM

పడి లేచిన కెరటం.. నారా లోకేష్

వక్రబుద్ది నేతలు చెక్కిన శిల్పం  నారా లోకేష్.  పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి   నారా లోకేష్.  టీడీపీ ప్రధాన కార్యదర్శిగా  పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే బాధ్యతను స్వచ్ఛందంగా భుజానికి ఎత్తుకుని సాధించిన చూపిన  నిబద్దత గల కార్యదక్షకుడు లోకేష్. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయకత్వ పటిమ విషయంలో కానీ, సమస్యలను దీటుగా ఎదుర్కొని పరిష్కరించగలిగిన పరిణితి విషయంలో కానీ, పార్టీకి అన్నీ తానై దిశా నిర్దేశం చేయగలిగిన సమర్థత విషయంలో కానీ ఇప్పుడు ఎవరికీ ఎటువంటి  సందేహాలూ, అనుమానాలూ లేవు.  సొంత పార్టీయే కాదు, ప్రత్యర్థి పార్టీలు సైతం ఇప్పుడు నారా లోకేష్ పరిణితి చెందిన నాయకుడనీ, ప్రజాభిమానం చూరగొన్న ప్రజా నాయకుడని అంగీకరిస్తున్నాయి. అయితే నారా లోకేష్ నాయకత్వానికి ఈ ఆమోదం, ఈ అంగీకారం అంత తేలిగ్గా రాలేదు. అసలు నారా లోకేష్ రాజకీయాలలో తొలి అడుగులు పడకముందే ఆయన నడకను ఆపేయాలని చూశారు. రాజకీయాలలో ఓనమాలు దిద్దడానికి ముందే ఆయన ఎదుగుదలను అణచివేయాలన్న ప్రయత్నాలు జరిగాయి. పొలిటికల్ గా నారా లోకేష్ తొలి పలుకులు కూడా బయటకు రాకూడదన్న ప్రయత్నాలు జరిగాయి. పప్పు అన్నారు. బాడీ షేమింగ్ చేశారు.   హేళన చేశారు. టార్గెట్ చేసి మరీ క్యారెక్టర్ అసాసినేషన్ కు ప్రయత్నించారు. ఇదంతా ఎందుకు చేశారు?  పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. అలా నారా లోకేష్ తండ్రి చాటు బిడ్డగా ఉన్నప్పుడే పార్టీ ప్రగతి కోసం తన ఆలోచనలకు పదును పెట్టారు. అలా పదును పెట్టడం ద్వారా వచ్చినవే పార్టీ కార్యకర్తలకు ఇన్సూరెన్స్, సంక్షేమ పథకాల లబ్ధిదారులకు నగదు బదిలీ. దీంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలలోకి వస్తే తమ ఉనికి ప్రమాదంలో పడుతుందన్న భయంతో ప్రత్యర్థి పార్టీలు.. ఆయనపై సైకలాజికల్ ఎటాక్ ప్రారంభించారు. మానసికంగా ఆయన స్థైర్యాన్ని దెబ్బతీసి రాజకీయాలకు దూరం చేయాలని ప్రయత్నించారు.  ప్రణాళికాబద్ధంగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నించారు. ఆయన చదువు, భాష, ఆహారం, ఆహార్యం ఇలా అన్నిటిపైనా అటాక్ చేశారు.   అయితే లోకేష్ వెనకడుగు వేయలేదు. ప్రత్యర్థుల విమర్శలను, మాటల దాడులను, హేళనలను ఎదుర్కొంటూ ముందడుగు వేశారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎదిగారు. మంత్రిగా అభివృద్ధికి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చేశారు. ప్రత్యక్ష ఎన్నికలలో తొలి ప్రయత్నంలో పరాజయం పాలైనా కృంగిపోలేదు. పడిలేచిన కెరటంలా ఎదిగారు.     ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొని,  సంక్షోభాల్ని అవకాశంగా మల్చుకోవాలన్న తండ్రి మాటల స్ఫూర్తితో  ముందుకు సాగారు. ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్నంగా నిలిచారు.  2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ  పరాజయం, మంత్రిగా ఉండి కూడా స్వయంగా తాను పరాజయం పాలు కావడం నిజంగానే సంక్షోభం. మరీ ముఖ్యంగా ప్రత్యర్థులు టార్గెట్ చేసి మరీ ట్రోల్ చేస్తున్న లోకేష్ ఆ సంక్షోభాన్నే అవకాశంగా మార్చుకున్నారు.  తెలుగుదేశం పార్టీకి పెద్దగా అవకాశాలు లేని మంగళగిరి స్థానంలో పరాజయం పాలైనా   అదే నియోజకవర్గంలో నిలబడి ప్రజాభిమానాన్ని సంపాదించుకున్నారు.  విపక్షంలో ఉండి గ  ఒక దీక్ష, ఒక తపస్సు, ఒక యజ్ణంగా తనను తాను మేకోవర్ చేసుకున్నారు. ప్రజా నేతగా ఎదిగారు.  అలాగే యువగళం పాదయాత్ర ద్వారా పార్టీకి భవిష్యత్ నాయకుడన్న నమ్మకాన్ని పార్టీలోనే కాదు ప్రజలలోనూ కలిగించారు.  తండ్రికి తగ్గ తనయుడన్న ప్రశంసలు అందుకున్నారు. అంతే కాదు తండ్రిని మించిన నాయకుడన్న నమ్మకాన్ని పార్టీ శ్రేణుల్లోనూ, ప్రజా బాహుల్యంలోనూ కలిగించారు.  అయితే నారా లోకేష్ కు నాయకత్వం వారసత్వంగా వచ్చినది కాదు. ఆయన కష్టపడి సాధించుకున్నది. తనను తాను ప్రూవ్ చేసుకుని ప్రజలకు దగ్గరవ్వడం ద్వారా సంపాదించుకున్నది. ఇక లోకేశ్ యువగళం పాదయాత్ర తెలుగు రాజకీయాలలో మరో చరిత్ర అనే చెప్పాలి. లోకేష్ పాదయాత్ర ద్వారా  ప్రజలతో మమేకమై, వారి కష్టాలను తెలుసుకుని, కన్నీళ్లు తుడుస్తూ వారిలో భరోసా కల్పించారు. లోకేష్ పాదయాత్ర మొదలైనప్పటి నుంచి అడ్డుకునేందుకు, విచ్ఛిన్నం చేసేందుకు అప్పటి అధికార వైసీపీ పన్నని కుట్రలు, చేయని కుతంత్రాలు లేవు. వాటన్నిటినీ  ప్రజాదరణతో ఎదుర్కొని లోకేష్ ముందడుగు వేసిన తీరు నిజంగా నభూతో నభవిష్యతి. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి, నారా చంద్రబాబునాయుడు, ఆ తరువాత జగన్ కూడా పాదయాత్రలు చేశారు. కానీ అప్పట్లో వారికి అధికార పార్టీ నుంచి అడ్డంకులు ఎదురు కాలేదు. కానీ లోకేష్ పాదయాత్ర విషయంలో అలాకాదు. జగన్ సర్కార్ ఆయన తొలి అడుగు వేయక ముందే  అడ్డంకులు సృష్టించింది. జీవో లు జారీ చేసి మరీ పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించింది. భౌతిక దాడులకు సైతం తెగబడింది. మాట్లాడుతుంటే మైకు లాగేసింది. నిలుచున్న కూర్చీ తీసేసింది.  ప్రచార వాహనాలను సీజ్ చేసింది. అయినా లోకేష్ వెరవలేదు. మండుటెండ, జోరువాన, వణికించే చలిలోనూ నడక ఆపలేదు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా రోడ్లపైనే ఉండటం, దుమ్ము ధూళిలో నడవడం, రోజూ వేల మంది పార్టీ నాయకుల్ని, కార్యర్తల్ని ప్రత్యక్షంగా కలవడం, వారు చెప్పిందంతా ఓపిగ్గా వినడం వంటివి లోకేశ్ ని  తమ నాయకుడిగా ప్రజలు ఓన్ చేసుకునేందుకు దోహదపడ్డాయి.  లోకేషా.. పాదయాతా అని ఎగతాళి చేసిన వారే శభాష్ అని   ప్రశంసలు కురిపించారంటే దటీజ్ లోకేష్.  ఇప్పుడు ప్రభుత్వంలో మంత్రిగా అత్యంత కీలకంగా వ్యవహరిస్తూ, రాష్ట్రానికి పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులను తీసుకురావడంలో తండ్రికి చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. ఇదే దీక్ష , ఇదే సంకల్పంతో ఆయన మున్ముందు మరిన్ని ఎత్తులకు ఎదగాలని ఆకాంక్షిస్తూ నారా లోకేష్ కు తెలుగువన్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తోంది. 
Publish Date: Jan 23, 2026 8:22AM

ఏపీలో ఏం జరుగుతోంది?.. వైద్యం ప్రైవేటు పరం అవుతుందా?

వ్యవస్థలోని లోపాలను   వాస్తవ వేదిక ద్వారా ఎండగడుతున్న  తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ ఈ సారి ఆంధ్రప్రదేశ్ లో  బర్నింగ్ టాపిక్ అయిన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో మెడికల్ కాలేజీలు అన్న అంశంపై చర్చించారు. వాస్తవ వేదిక 9వ ఎడిషన్ లో వైద్యం ప్రైవేటు పరం అవుతుందా? ప్రభుత్వ ఆస్పత్రులలో నెలకు 15 లక్షల జీతం ఇస్తామన్నా ఎందుకు చేరడం లేదు? అన్న విషయాలను ప్రస్తావించారు.  ఇది కేవలం ఆస్పత్రులకు సంబంధించిన వ్యవహారం మాత్రమే కాదు.. మొత్తంగా రాష్ట్రంలో ఆరోగ్య భద్రతకు సంబంధించిన అంశంగా విశ్లేషించారు.  వీరిరువురి పూర్తి విశ్లేషణకు తెలుగువన్ లో ఈ రోజు ప్రసారం అయిన  ‘వాస్తవ వేదిక’లో వీక్షించండి
Publish Date: Jan 22, 2026 8:02PM

విజయ్ టీవీకే పార్టీకి విజిల్ గుర్తు కేటాయింపు

తమిళ స్టార్ హీరో విజయ్‌కు చెందిన తమిళ  వెట్రి కళగం పార్టీ.. టీవీకేకి కేంద్ర ఎన్నికల సంఘం   గుర్తును కేటాయించింది. టీవీకే పార్టీకి విజిల్ గుర్తును కేటాయిస్తూ ఈసీ గురువారం (జనవరి 22) నిర్ణయం తీసుకుంది.   తమిళనాడు అసెంబ్లీ కి ఈ ఏడాది ఏప్రిల్- మే లో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీవీకే పార్టీ విజిల్  గుర్తు మీద పోటీ చేయనుంది. ఈసీ తమ పార్టీకి ఈల గుర్తు కేటాయించడం పట్ల విజయ్ అభిమానులు, టీవీకే కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు విజయ్ నటించిన సక్సెస్ ఫుల్ మూవీ విజల్ ను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, టీవీకేకు విజిల్ గుర్తు సక్సెస్ కు సంకేతంగా అభివర్ణిస్తున్నారు.   ఎన్నికల ప్రణాళికల్లో భాగంగా.. ఏఐడీఎమ్‌కే ఇప్పటికే ప్రచారాన్ని మొదలు పెట్టేసింది. ప్రజలపై హామీల జల్లులు కురిపిస్తోంది. టీవీకే పార్టీ ఎలాంటి  పొత్తూ లేకుండానే ఎన్నికలకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులోని అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. రానున్న ఎన్నికలలో టీవీకే ప్రభావం పై సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది.  
Publish Date: Jan 22, 2026 5:15PM

ఏపీ లిక్కర్ స్కామ్‌.. విజయసాయి వాంగ్మూలం రికార్డ్ చేసిన ఈడీ

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసుకు సంబంధించి ఈడీ వైసీపీ మాజీ నాయకుడు, మాజీ ఎంపీ విజయసాయిని గురువారం (జనవరి 22) విచారించి, ఆయన వాంగ్మూలాన్ని రికార్డ్ చేసింది. జగన్ హయాంలో మద్యం విధాన రూపకల్పన, అమలు ప్రక్రియలో జరిగిన అవకతవకలు, అవినీతి, అక్రమాలపై ఈడీ విజయసాయిపై ప్రశ్నల వర్షం కురిపించింది. అలాగే భారీగా అవినీతి చోటు చేసుకుందన్న ఆరోపణలపైనా ఈడీ విజయసాయిని సుదీర్ఘంగా విచారించింది.  అదే విధంగా మద్యం కుంభకోణం ద్వారా  అక్రమంగా వచ్చిన నగదును విదేశాలకు తరలించిన అంశం, హవాలా మార్గాల వినియోగం, షెల్ కంపెనీల ఏర్పాటు ద్వారా మనీ లాండరింగ్ జరిగిందా అనే కోణంలో ఈడీ  దర్యాప్తు చేస్తోంది. డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నప్పటికీ  ఏపీలో మద్యం విక్రయాలు క్యాష్ అండ్ క్యారీ రూపంలోనే నగదు రూపంలోనే ఎందుకు జరపాల్సి వచ్చిందన్న అంశంపై  ఈడీ అధికారులు విజయసాయిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనపై తన సమక్షంలోనే మూడు సార్లు సిట్టింగులు జరిగినట్లు విజయ్ సాయి రెడ్డి ఈడీకి వాంగ్మూలం ఇచ్చినట్లూ, అయితే  ఆ పాలసీ రూపకల్పనతో తనకు ప్రత్యక్ష సంబంధం లేదని చేసినట్లు తెలిసింది.   ఇక ఇదే కేసుకు సంబంధించి ఈడీ శుక్రవారం వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డిని విచారించనుంది.  ఈ కేసులో ఇప్పటికే ఇప్పటికే పలువురు కీలక వ్యక్తుల పాత్రపై  ఫోకస్ పెట్టిన ఈడీ.. రానున్న రోజులలో మరింత మందిని విచారించే అవకాశం ఉందని అంటున్నారు.  ఈ కేసు రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకోవడంతో విజయసాయి, మిథున్ రెడ్డిల విచారణ అనంతరం ఈడీ టార్గెట్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 
Publish Date: Jan 22, 2026 12:28PM

జగన్ మళ్లీ పాదయాత్ర.. అధికారమే టార్గెట్.. వర్కౌట్ అవుతుందా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సమాయత్తమౌతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగానే జగన్ పాదయాత్ర ప్రకటన రాజకీయంగా చర్చకు తెరతీసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది.  అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ సర్కార్ విధానాలు, జగన్ కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, అరకొర సంక్షేమంతో  సాగించిన పాలనా, అలాగే జగన్ అనుసరించిన ఆర్థిక అరాచకత్వ విధానాల కారణంగా 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 స్థానాలకే పరిమితమైంది.  గత ఎన్నికలలో పరాజయం తరువాత జగన్  రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కే పరిమితమౌతూ రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు నెరపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది.  ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే పాదయాత్ర శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది.  తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు.  తన ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుందని ఆయన భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.   అయితే జగన్ పాదయాత్ర @ 2.0 వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అప్పట్లో ఆయన అడుగుకో హామీ అన్నట్లుగా వాగ్దానాలు గుప్పించారు. వాటిని నమ్మి జనం ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టి ఆ ఎన్నికలలో ఘన విజయం చేకూర్చి పెట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో  పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజీని పూర్తిగా పోగొట్టుకోవడమే కాకుండా,   తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా జగన్ మూటగట్టుకున్నారు. హామీల అమలు విషయాన్ని పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేశారు. అంతే కాకుండా  అధికారంలో ఉన్నప్పుడు జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, బయటకు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకు తిరిగిన జగన్.. పార్టీ పరాజయం తరువాత కూడా పెద్దగా జనంలోకి రాలేదు. మరి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరో సారి జనం ముందుకు వచ్చే ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.  
Publish Date: Jan 22, 2026 9:43AM

అమరావతికి కేంద్రం చట్టబద్దత!

ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా అమరావతిని చట్టబద్ధంగా ప్రకటించేందుకు రంగం సిద్ధమైంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అధికారికంగా వినతిపత్రం సమర్పించింది. 2024 జూన్‌ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగియడంతో,  ఏపీకి రాజధానిని తప్పక ప్రకటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో, రాజధానిగా అమరావతి ఎంపిక ప్రక్రియ, నిర్మాణ కార్యక్రమాలపై వివరాలను కూడా కేంద్రానికి నోట్‌ ద్వారా రాష్ట్ర ప్రభఉత్వం అందజేసింది. ఈ విషయమై, కేంద్రం ఇప్పటికే అన్ని మంత్రిత్వ శాఖల నుంచి అభిప్రాయాలు సేకరించడమే కాకుండా, నీతి ఆయోగ్‌ అభిప్రాయాన్ని కూడా కోరినట్లు సమాచారం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టి అమరావతిని రాజధానిగా చట్టబద్ధంగా ప్రకటించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం సూచించిన ప్రకారం.. 2024 జూన్‌ 2 నుంచి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించేందుకు దాదాపు కేంద్రం నిర్ణయానికివచ్చేసినట్లు సమాచారం.
Publish Date: Jan 21, 2026 4:57PM

మీ ఫోనూ ట్యాప్ అయ్యింది.. విచారణకు వచ్చిన హరీష్ కు షాకిచ్చిన సిట్

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్గెస్ట్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.  బీఆర్ఎస్ కీలక నేత, పార్టీలో ట్రబుల్ షూటర్ గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న వాస్తవం వెలుగు చూసింది. ఈ విషయాన్ని   ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులే స్వయంగా తమ ఎదుట విచారణకు హాజరైన  హరీష్ రావుకు వెల్లడించారు. ది ఇప్పుడు  రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా హరీష్ రావు కి విచారణ నిమిత్తం హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు నిన్న హరీష్ రావు మంగళవారం (జనవరి 20) అధికారుల ఎదుట హాజరయ్యారు.  హరీష్ రావును విచారించిన అధికారులు, 2018 అసెంబ్లీ ఎన్నికల అనంతరం కొన్ని నెలల పాటు ఆయన ఫోన్ నిఘాలో ఉన్నట్టు తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులు చెప్పగానే హరీష్ రావ్   షాక్‌కు గురైనట్లు సమాచారం. విచారణ సందర్భంగా పోలీసులు అడిగిన ప్రతి ప్రశ్నను హరీష్ రావ్ స్వయంగా కాగితంపై రాసుకున్నారు. తన ఫోన్ ట్యాప్ అయ్యిందన్న విషయాన్ని తొలిసారి విన్న హరీష్ రావ్, వెంటనే , ఇది మీరు సృష్టించారా?  అని సిట్  అధికారులను ప్రశ్నించారు. అనంతరం స్పందించిన అధికారులు, ఫోన్ ట్యాపింగ్ జరిగిన తేదీలు, కాల వ్యవధి వివరాలను హరీష్ రావుకు తెలియజేశారు. అంతేకాదు, హరీష్ రావ్ అనుచరుల ఫోన్లు కూడా అదే సమయంలో కొన్ని ట్యాప్ అయ్యినట్టు సిట్ అధికారులు వెల్లడించడంతో విచారణ మరింత కీలకంగా మారింది. దీనిపై హరీష్ రావ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ కేసులో ఇప్పటివరకు పలువురు కీలక అధికారుల పేర్లు బయటకు రావడంతో పాటు, రాజకీయ నాయ కుల ఫోన్ల ట్యాపింగ్ అంశం ప్రజాస్వామ్యంపై తీవ్ర ప్రభావం చూపే అంశంగా మారింది. తాజాగా హరీష్ రావ్ ఫోన్ కూడా ట్యాప్ అయ్యిందన్న విషయం వెలుగులోకి రావడం కేసును మరో దశకు తీసుకెళ్లింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆదేశాలెవరివి? ఎవరిని లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టారు?రాజకీయ లబ్ధి కోసమే ఈ ట్యాపింగ్ జరిగిందా? అన్న అనేక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. SIT దర్యాప్తు ముమ్మరం కావడంతో రానున్న రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. 
Publish Date: Jan 21, 2026 1:19PM

అంతా ఖాళీనే.. ఇదే నిజం.. మోడీ ఇజం

ప్రభుత్వానికి  పేర్లు మార్చడంలోని సరదా, దేశమంతా తన వశంలోకి తెచ్చుకోవాలన్న కోరికా తప్ప చదువు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సంగతి ఇసుమంతైనా పట్టడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనను  పట్టించుకోకుండా బండి రంగు మారుస్తానంటే ఎట్టా సామీ అంటున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు.  కానీ వారి మాటలు వినే నాధుడేడీ.  ఇప్పటికీ చాలా కాలం నుంచే అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులూ విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరవు పెడుతూ వచ్చారు. వివేకానందుడిలా చేతులు కట్టుకుని విన్నట్టు నటించిన దేవరది చెవుడు కాదు, నటన కాదు.. కొండంత నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు గుండె బాదుకుంటున్నాయి. అదీ నిజమే!  ఏమన్నా అంటే ఎగస్పార్టీ వోరికి కుళ్లు అంటూ దబాయించేయడం సర్వసాధారణమైంది. చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే  ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి?  కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా   గొంతుపోవడం,  అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి స్వామీ అని అహ్మదాబాద్‌ నుంచి అమలాపురం వరకూ టీచర్లు, ప్రొఫెసర్లు గోడు పెడుతున్నారు. అదే  కాదు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ  వూసే లేదని గోసపడుతున్నారు. అవన్నీపట్టించుకుని పత్రికల ద్వారా, మైకుల్లోనూ అరిచి గింజుకోవడమే అవుతోంది ఈ విషయమై బాధపడుతున్న మేధోవర్గానికి.  అసలు విషయమేమంటే..జూన్‌ 2025 నాటికి కేంద్రీయ విద్యా సంఘఠన్‌లో  7,765 బోధనా సిబ్బంది పోస్టులు, నవోదయ విద్యాసమితిలో 4,323 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎస్‌ఎఫ్‌)లో 25,487 కానిస్టబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో ఎల్డీసీ క్లర్క్‌ కేడర్2 లో దాదాపు11 వేల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఏయిమ్స్‌లో ఇంకా 1,731 పోస్టులు  భర్తీ చేయాలి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే 12 ప్రభుత్వరంగ బ్యాంకులో 4,20,599 మంది ఆఫీసర్లు, 2,49,817 క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకం పేరు మార్చి దాన్ని రాముడికి అర్పించేసి ఉపాధికి గండి కొట్టేస్తున్నారు. అంతే కాకుండా ఇది  చాలా అద్భుతం అంటూ తమ వారి చేత  భజనచేయించుకుంటున్న పాలకులు  కోట్లాది ప్రజలకు ఉపా ధిని కొంపముంచేస్తున్నారన్న విషయం పెద్దగా, గట్టిగా వినబడకుండా నిరసనల గొంతు నొక్కేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. తనకు ఇష్టమైన పదార్థాన్నే దేశ ప్రజలంతా లొట్టలే సుకుంటూ  అందరూ తినాలన్నదే పాలకుల ఇజంగా కనిపిస్తోంది. దానికి మోడీ ఇజం అనోచ్చం టారా?
Publish Date: Jan 21, 2026 11:59AM

ఫొన్ ట్యాపింగ్ కేసు.. హరీష్ రావుకు మళ్లీ నోటీసులు?

మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు హరీష్ రావు  ఫోన్ ట్యాపింగ్ కేసులో మంగళవారం (జనవరి 20) దాదాపు ఏడున్నర గంటల పాటు విచారించిన సిట్.. ఆయనకు మరో మారు నోటీసులు జారీ చేయనుంది. మంగళవారం (జనవరి 20) విచారణ సందర్భంగా హరీష్ రావు తన కుమారుడు విదేశాలకు వెళ్తున్నందున సెండాఫ్ ఇవ్వడానికి ఎయిర్ పోర్టుకు వెళ్లాలని   రిక్వెస్ట్ చేయడంతో  ఏడున్నర గంటల తరవాత విచారణ ముగించామనీ, ఆయనను ఇంకా విచారించాల్సిన అవసరం ఉందనీ సిట్ వర్గాలు చెబుతున్నాయి. సిట్ చీఫ్ సజ్జనార్ హరీష్ రావు విచారణ ముగిసిన తరువాత చేసిన ప్రకటన కూడా అదే సూచిస్తోంది.  ఇలా ఉండగా మంగళవారం (జనవరి 20) విచారణ ముగిసిన తరువాత బయటకు వచ్చిన మాజీ మంత్రి హరీష్ రావు సిట్ సూచనలను పట్టించుకోకుండా  మీడియా ముందు పొలిటికల్ కామెంట్స్ చేశారు. అది పక్కన పెడితే.. విచారణలో భాగంగా హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్ ఫోన్లు ట్యాప్ అయినట్లుగా ఆధారాలను సిట్ బృందం హరీష్ ముందు ఉంచి ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  అయితే అవన్నీ ఫేక్ అని హరీష్ రావు వాదించినట్లు తెలుస్తోంది.   కాగా మంగళవారం (జనవరి 20) విచారణ అర్ధంతరంగా ముగియడంతో రెండు మూడు రోజులలో హరీష్ రావును సిట్ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే.. సుప్రీంకోర్టు కొట్టి వేసిన కేసులో హరీష్ రావును విచారణకు పిలిచారంటూ కేటీఆర్ సహా  బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని సిట్ చీఫ్  సజ్జనార్ ఖండించారు. తాము హరీష్ రావును విచారణకు పిలిచింది ఆ కేసులో కాదని క్లారిటీ ఇచ్చారు.  ప్రజా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసిన కేసులో హరీష్ రావును విచారించామనీ, ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదని సజ్జనార్ అన్నారు.  
Publish Date: Jan 21, 2026 9:17AM

క‌విత‌క్క కొత్త పార్టీకి.. పీకే ఐడియాలజీ?

సొంత రాష్ట్రంలో సొంతంగా పార్టీ పెట్టి దానిని ఎన్నికలలో గెలుపు బాటలో నడిపించలేక చతికిలపడి, ఇప్పుడా పార్టీని ఎలా నడపాలో తెలియక అయోమయంలో ఉన్న ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేయడానికి సిద్ధపడుతున్న కల్వకుంట్ల కవితకు ఐడియాలజిస్టుగా ఉంటారట. సొంతంగా పార్టీని నడపడంలో విఫలమైన  ప్ర‌శాంత కిషోర్  ఐడియాలు, వ్యూహాలు కవిత పార్టీకి ఏ మేరకు పని చేస్తాయి? ఏ మేరకు పనికొస్తాయి అన్న చర్చ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. సరే అసలు తాను కవిత పార్టీకి వ్యూహకర్తగా పని చేయనున్నానంటూ వస్తున్న వార్తలు శుద్ధ అబద్ధాలని ప్రశాంత్ కిశోర్ కొట్టి పారేశారనుకోండి అది వేరు సంగతి.   ఇటీవ‌ల క‌విత‌- ప్ర‌శాంత్ కిషోర్ మధ్య రెండు సమావేశాలు జరిగాయనీ, కవిత  త‌న పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్టుగా ఆయ‌న్ను నియ‌మించుకునే అవ‌కాశం క‌నిపిస్తోంద‌న్న వార్తలు మాత్రం జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రశాంత్ కిశోర్ ఖండించినప్పటికీ చర్చ మాత్రం ఆగడం లేదు.   ప్ర‌శాంత్ కిషోర్  జ‌న్ సూర‌జ్  పార్టీ ఇటీవ‌ల జ‌రిగిన  బీహార్ ఎన్నిక‌ల్లో సోదిలో కూడా క‌నిపించ‌లేదు. ఇక ఆయన స్వయంగా పార్టీ అభ్యర్థిగా ఎక్కడా పోటీ చేయలేదు.  స్వ‌త‌హాగా బీహారీ అయిన ప్ర‌శాంత్ కిషోర్ .. సాటి  బీహారీ అయిన  క‌విత‌కు.. (ఈ కామెంట్ ఎందుకు చేయాల్సి వ‌చ్చిందంటే కేసీఆర్ కుటుంబం కూడా బీహార్ నుంచే ఏపీలోని బొబ్బిలికి వ‌ల‌స వ‌చ్చిన‌ట్టు చెబుతారు. ఆ త‌ర్వాతే  వారు తెలంగాణ‌కొచ్చి సెటిలైన‌ట్టు అంటారు. అందుకే కేసీఆర్ గ‌తంలో బీహార్ లో కొంద‌రికి  ఆర్ధిక సాయం చేశారు కూడా) రాజ‌కీయ స‌ల‌హాదారుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్న చర్చ జరుగుతోంది. సొంతంగా పార్టీ పెట్టడానికి ముందు వరకూ ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు బాగానే క్లిక్ అయ్యాయి. ఏపీలో జగన్, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ, అంతకంటే ముందు 2014లో కేంద్రంలో మోడీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యాహాలే కారణమనే వారూ లేకపోలేదు. కానీ ఇంటి వైద్యం ఒంటపట్టదన్నట్లు ఆయన వ్యూహాలు ఆయన సొంత పార్టీకి ఏ మాత్రం ఉపయోగపడలేదు.  సరే అది పక్కన పెట్టి పార్టీలను అధికారంలోకి తీసుకురావడానికి ప్రశాంత్ కిశోర్ వ్యూహాలలో సెంటిమెంట్ ప్రధానం అన్నది తెలిసిందే.  మొన్నా మ‌ధ్య క‌విత ఎమ్మెల్సీ ప‌ద‌వికి  రాజీనామా చేస్తూ.. తాను ఆస్తి కోసం పోరాడ్డం లేద‌ని ఆత్మ‌గౌర‌వం కోసం కొట్లాడుతున్నాన‌ని ప్ర‌క‌టించ‌డ‌మే  కాకుండా.. క‌న్నీటి  ప‌ర్యంత‌రం అయ్యారు.  ఒక మ‌హిళ ఇంత పెద్ద ఎత్తున ఒక నిండు స‌భ‌లో క‌న్నీటి ప‌ర్యంతం కావ‌డం ఏమంత చిన్న విష‌యం కాదు. ఈ విజువ‌ల్  ప‌బ్లిక్ లోకి బలంగా వెడుతుంది.  సెంటిమెంట్ రగులుస్తుంది.   ఆ సెంటిమెంట్ నే కవిత  తెలంగాణ  రాజ‌కీయాల్లో రాణించేందుకు మరింత రగిల్చేలా పీకే వ్యూహాలకు పదును పెట్టే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక  మ‌హిళా రిజ‌ర్వేష‌న్లు. బీసీల కోసం కొట్లాట ఇవ‌న్నీ  కూడా ప్ర‌శాంత్ కిషోర్ అంబుల పొదిలోని ఆస్త్రాలుగానే చెబుతున్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రశాంత్ కిశోర్   కేసీఆర్ తో జ‌త క‌ట్టి ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ‌ర‌చ‌న చేస్తార‌నే ప్ర‌చారం జ‌రిగింది. ఎందుకంటే కేసీఆర్ అప్ప‌ట్లో జాతీయ  రాజ‌కీయాల వైపున‌కు వెళ్లే ఆలోచ‌న చేశారు. కానీ ఇదే క‌విత అన్న‌ట్టు ఇక్క‌డేం పీకినం అని దేశ రాజ‌కీయాల్లోకి బోవాలె అన్న‌ట్టు.. గులాబీ బాస్ ఎందుకో వెన‌క‌డుగు వేశారు. ఆపై అక్క‌డ మాట దేవుడెరుగు- ఇక్క‌డ కూడా కేసీఆర్ కార్ పార్టీ చ‌తికిల‌ప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు క‌విత వ్యూహాల వద్దకు వ‌స్తే.. ప్ర‌శాంత్ కిషోర్ స‌ల‌హా సూచ‌న‌లు ఎంత మేర వ‌ర్క‌వుట్ అవుతాయ‌న్న‌ది ప్రశ్నార్థకమే. నీటిలో ఉన్న బ‌ర్రెకు రేటు క‌ట్ట‌డం క‌ష్ట‌మేమోగానీ..  అది బ‌య‌ట‌కొచ్చాక దాని పొదుగు చూసి ఆ ధ‌ర ఇట్టే చెప్పొచ్చు అన్న‌ట్టు.. ప్ర‌శాంత్ కిషోర్ ఒక  రాజ‌కీయ అనామ‌కుడు. అప్ప‌ట్లో మోడీకి, ఆ మ‌ధ్య  జ‌గ‌న్ కి అత‌డిచ్చిన ఒక‌టీ అరా స‌ల‌హా సూచ‌ల‌ను అడ్డి మార్- గుడ్డి దెబ్బ లెక్క‌  వ‌ర్క‌వుట్ అయి ఉండొచ్చు. అంత మాత్రం చేత ఇప్పుడు కూడా ఆయ‌న స‌ల‌హా సూచ‌న‌లు, భారీ మందీ మార్బ‌లం, ఆపై అణువ‌ణువూ లెక్క‌లు తీసి వాటి ద్వారా ఏదో చేయాల‌న్న వ్యూహాలు.. ఇవ‌న్నీ కూడా బెడిసి కొట్టి చాలా కాల‌మే అయ్యింది. ఇప్పుడీ రాజ‌కీయ వ్యూహాల‌కు బుట్ట‌లో ప‌డే ఓట‌రు మ‌హాశ‌యులెవ‌రూ లేరు.కాబ‌ట్టి క‌విత ఆయన వ్యూహాల కోసం అర్రులు చాచడం అనవసర మంటున్నారు పరిశీలకులు. కాదని ఒక వేళ కవిత ప్రశాంత్ కిశోర్ ను వ్యూహకర్తగా నియమించుకున్నా, ఆయనకు ఇచ్చే భారీ ఫీజు బూడిదలో పోసిన పన్నీరు చందంగా మారుతుందంటున్నారు.  ఫైన‌ల్ గా సీఎం దావోస్ ప‌ర్య‌ట‌న శుద్ధ దండ‌గ అంటున్న క‌విత‌.. తాను ప్ర‌శాంత్ కిషోర్ కి వెచ్చించే సొమ్ము కూడా బీహారార్ప‌ణం అవుతుందని గ్రహించాల్సి ఉంటుందంటున్నారు. 
Publish Date: Jan 20, 2026 2:07PM

ఫోన్ ట్యాపింగ్.. న్యూస్ ట్యాపింగ్ చెల్లుకు చెల్లు!

ఫోన్ ట్యాపింగ్  కేసులో మాజీ మంత్రి బీఆర్ఎస్ అగ్ర‌నేత‌ల్లో ఒక‌రైన హ‌రీష్ కి సిట్ నోటీసులు జారీ చేసింది. ట్యాపింగ్ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఆదేశించింది. ఆయ‌న‌కిలా సిట్ నోటీసులు జారీ చేయ‌డం  ఇదే తొలిసారి. అయితే ఈ నోటీసులు జారీ కావడానికి ముందు సిద్దిపేట ప‌ర్య‌ట‌న‌లో ఉన్న‌ హ‌రీష్ రావు  మంత్రుల్లో వాటాల కొట్లాట జరుగుతోందనీ,   మంత్రి సురేఖ పీఏ  వ్య‌వ‌హారం నుంచి మొద‌లు పెడితే  తాజాగా  కోమ‌టిరెడ్డి వెంక‌ట రెడ్డి సినిమా  టికెట్ ధ‌ర‌ల పెంపు ద‌లలో వాటాల అంశం వ‌ర‌కూ  వాటాల కోసం గొడ‌వ ప‌డుతున్నార‌ంటూ ఓ జాబితా  ఏక‌ర‌వు పెట్టారు హ‌రీష్‌. అంతే కాదు.. మీరు ప్ర‌తిదానిపైనా సిట్ వేస్తుంటారు క‌దా... సింగ‌రేణి బొగ్గు కాంట్రాక్టు ప‌నుల్లో జ‌రిగే అవినీతిపై  కూడా సిట్ వేయాల‌ని  సవాల్ చేస్తూ..సిట్ కాదు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.  ఇదిలా ఉంటే ఇటీవ‌ల బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్  ఫోన్ ట్యాపింగ్ ఎంక్వ‌యిరీ కాదు.. ఈ రాష్ట్రానికి అత్య‌వ‌స‌రంగా  కావ‌ల్సింది న్యూస్ ట్యాపింగ్ మీద ఎంక్వ‌యిరీ అంటూ  ట్వీట్ చేశారు. ఆ తరువాత    హ‌రీష్ కి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో సిట్   నోటీసులు జారీ అయ్యాయి. ఇప్పుడు బీఆర్ఎస్ వ‌ర్సెస్ కాంగ్రెస్ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూలో ఒక వార్ న‌డుస్తోంది. త‌మ‌కున్న మీడియా ప‌లుకుబ‌డి  ద్వారా... న్యూస్ ట్యాపింగ్ జ‌రుగుతోందంటూ ఓ ప్రచారాన్ని మొదలెట్టింది కారు పార్టీ. ఈ విష‌యంలో బీఆర్ఎస్ ఎక్కువ‌గా ఇరుక్కోకుండా  ఈ ప‌థ‌క ర‌చ‌న చేసిన‌ట్టు క‌నిపిస్తోంది. ఇదే అంశంలో ఇక్క‌డి  నుంచి జ‌గ‌న్ మద్దతు కూడా కారు పార్టీకి ఉన్నట్లు సమాచారం.  దీంతో కారు- ఫ్యాను పార్టీలు రెండూ క‌ల‌సి తెలంగాణ‌లో ఒక అల‌జ‌డి సృష్టించేందుకే.. వెంక‌ట‌రెడ్డి- మ‌హిళా ఐఏఎస్ వ్య‌వ‌హారం తెర‌పైకి తెచ్చిన‌ట్టు క‌నిపిస్తోంది. దెబ్బ‌కు దెబ్బ తీసేలా ఈ తేనెతుట్టె క‌దిపిన‌ట్టు స‌మాచారం. ఇందుకు స‌ర్కార్ కూడా అటు వైపు నుంచి న‌రుక్కొస్తోంది. త‌మ‌కున్న మీడియా బ‌లం ద్వారా.. దీన్ని తిప్పి కొట్టే య‌త్నం చేస్తోంది. దీంతో ఇద్ద‌రు మీడియా అధినేత‌లు చెరో వైపూ చీలి.. కొట్లాడుతున్న దృశ్యం తెలంగాణ‌లో తొలిసారి క‌నిపిస్తోంది.
Publish Date: Jan 20, 2026 1:55PM