అంతా ఖాళీనే.. ఇదే నిజం.. మోడీ ఇజం

ప్రభుత్వానికి  పేర్లు మార్చడంలోని సరదా, దేశమంతా తన వశంలోకి తెచ్చుకోవాలన్న కోరికా తప్ప చదువు, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన సంగతి ఇసుమంతైనా పట్టడం లేదని విపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఉద్యోగ, ఉపాధి కల్పనను  పట్టించుకోకుండా బండి రంగు మారుస్తానంటే ఎట్టా సామీ అంటున్నారు ఏకోపాధ్యాయ పాఠశాల ఉపాధ్యాయులు.  కానీ వారి మాటలు వినే నాధుడేడీ.  ఇప్పటికీ చాలా కాలం నుంచే అధికారులు, ఉపాధ్యాయులు, విద్యావంతులూ విద్యారంగంలో ఎదుర్కొంటున్న సమస్యల్ని ఏకరవు పెడుతూ వచ్చారు. వివేకానందుడిలా చేతులు కట్టుకుని విన్నట్టు నటించిన దేవరది చెవుడు కాదు, నటన కాదు.. కొండంత నిర్లక్ష్యం అంటూ ప్రతిపక్షాలు గుండె బాదుకుంటున్నాయి. అదీ నిజమే!

 ఏమన్నా అంటే ఎగస్పార్టీ వోరికి కుళ్లు అంటూ దబాయించేయడం సర్వసాధారణమైంది. చదువుకుంటేనేగా గ్రామాల్లో వికాసం అంటూ ఉండేది. చదువు చెప్పేవారే  ఉంటే పిల్లలు గేదెలెనకా, మేకలేకనా పరిగెత్తాల్సిన ఖర్మేంటి?  కాస్తంత గ్రామాభివృద్ధి, విద్యారంగంలో రావాల్సిన మార్పుల గురించి ఏకరవుపెడుతున్నవారంతా   గొంతుపోవడం,  అనారోగ్యం పాలవడం తప్ప ఒరుగుతున్నది దాదాపు శూన్యమన్న అభిప్రాయాలే ఎక్కువ వినపడుతున్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి స్వామీ అని అహ్మదాబాద్‌ నుంచి అమలాపురం వరకూ టీచర్లు, ప్రొఫెసర్లు గోడు పెడుతున్నారు. అదే  కాదు అన్ని రంగాల్లోనూ ఉద్యోగాల భర్తీ  వూసే లేదని గోసపడుతున్నారు. అవన్నీపట్టించుకుని పత్రికల ద్వారా, మైకుల్లోనూ అరిచి గింజుకోవడమే అవుతోంది ఈ విషయమై బాధపడుతున్న మేధోవర్గానికి. 

అసలు విషయమేమంటే..జూన్‌ 2025 నాటికి కేంద్రీయ విద్యా సంఘఠన్‌లో  7,765 బోధనా సిబ్బంది పోస్టులు, నవోదయ విద్యాసమితిలో 4,323 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర సాయుధ పోలీసు దళాల(సిఎస్‌ఎఫ్‌)లో 25,487 కానిస్టబుల్‌ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అలాగే రాజస్థాన్‌లో ఎల్డీసీ క్లర్క్‌ కేడర్2 లో దాదాపు11 వేల ఉద్యోగాలు భర్తీ చేయవలసి ఉంది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఏయిమ్స్‌లో ఇంకా 1,731 పోస్టులు  భర్తీ చేయాలి. ఇక బ్యాంకుల విషయానికి వస్తే 12 ప్రభుత్వరంగ బ్యాంకులో 4,20,599 మంది ఆఫీసర్లు, 2,49,817 క్లర్కు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పథకం పేరు మార్చి దాన్ని రాముడికి అర్పించేసి ఉపాధికి గండి కొట్టేస్తున్నారు.

అంతే కాకుండా ఇది  చాలా అద్భుతం అంటూ తమ వారి చేత  భజనచేయించుకుంటున్న పాలకులు  కోట్లాది ప్రజలకు ఉపా ధిని కొంపముంచేస్తున్నారన్న విషయం పెద్దగా, గట్టిగా వినబడకుండా నిరసనల గొంతు నొక్కేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే.. తనకు ఇష్టమైన పదార్థాన్నే దేశ ప్రజలంతా లొట్టలే సుకుంటూ  అందరూ తినాలన్నదే పాలకుల ఇజంగా కనిపిస్తోంది. దానికి మోడీ ఇజం అనోచ్చం టారా?

Online Jyotish
Tone Academy
KidsOne Telugu