40ఏళ్ల లోపే మనుషుల్ని క్యాన్సర్ రోగులుగా మార్చే అలవాట్లు ఇవి.. మీకు ఉన్నాయేమో చెక్ చేస్కోండి..!
posted on Jan 22, 2026 11:29AM
.webp)
క్యాన్సర్ ప్రపంచాన్ని కబళిస్తున్న జబ్బు. పూర్తీగా చెయ్యి దాటిన దశలో బయటపడటం అనే కారణం వల్ల క్యాన్సర్ అంటే ఇక మరణమే అనే అభిప్రాయం ఏర్పడింది. క్యాన్సర్ కు వైద్యం ఉన్నా అది చాలా ఖర్చుతో కూడుకున్నది కావడంతో చాలా నరకం అనుభవించాల్సి వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే.. క్యాన్సర్ ఒక మనిషి శరీరాన్ని లోపలే విచ్చిన్నం చేయడమే కాకుండా.. ఒక కుటుంబాన్ని ఆర్థికంగా కూడా చితికిపోయేలా చేస్తుంది. నేటికాలంలో క్యాన్సర్ నిపుణులు కొన్ని ఆందోళనకరమైన మార్పులు గమనిస్తున్నారు. క్యాన్సర్ అంటే పెద్దవారిలో బయటపడేది అనుకునేవారు. కానీ నేటికాలంలో యువతలో కూడా క్యాన్సర్ బయటపడటం ఆందోళనగా మారుతోంది. కొంతమంది 20 లేదా 30 ఏళ్ల లోపు క్యాన్సర్ రోగులుగా మారుతున్నారు. రొమ్ము క్యాన్సర్ నుండి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వరకు అన్ని రకాల క్యాన్సర్‌లలో ఈ మార్పు కనిపిస్తోంది. శరీరాన్ని చాలా సైలెంట్ గా క్యాన్సర్ బారిన పడేలా చేసే 7 అలవాట్లు ఉన్నాయి. ఈ 7లో కూడా 3 పనులు చేసిన తర్వాత ప్రజలు చాలా గ్రేట్ గా ఫీలవుతూ ఉంటారు. అవేంటో అవి శరీరాన్ని క్యాన్సర్ బారిన పడేలా ఎందుకు చేస్తాయో.. తెలుసుకుంటే..
ప్రజలు మూడు పనుల విషయంలో చాలా గ్రేట్ ఫీలవుతారు. పైగా వాటిని మార్చుకోవాలని కూడా అనుకోరు. కానీ క్రమంగా అవి కణాలను, హార్మోన్ల పనితీరును దెబ్బతీస్తాయి.
ఉదాహరణకు..
గంటల తరబడి కూర్చోవడం వల్ల తాము చాలా పని చేస్తున్నామని, చాలా భాద్యతగా ఉంటున్నామని అనుకుంటారు. ఇది విజయానికి మంచిదే కానీ ఇది ఆరోగ్యపరంగా చాలా నష్టాలు కలిగిస్తుందని అంటున్నారు.
అదేవిధంగా.. నిద్రించడానికి తగినంత సమయం లేకపోవడం వల్ల తగినంత నిద్రపోని వారు అనేకమంది ఉన్నారు. కొంతమంది ఎక్కువగా మద్యం సేవించిన తర్వాత తమ సామర్థ్యం బాగా పెరిగిందని తమను తాము గొప్పగా చెప్పుకుంటారు.
ఆహారం..
నేటికాలంలో ఆహారపు అలవాట్లు చాలా అనారోగ్యకరంగా తయారయ్యాయి. ప్యాక్ చేసిన స్నాక్స్, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లు, తక్కువ ఫైబర్ భోజనం ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది ప్రేగులలోని బ్యాక్టీరియా సంఖ్యను ప్రభావితం చేస్తుంది. ఇది పెద్దప్రేగు, గ్యాస్ట్రిక్ క్యాన్సర్‌కు దారితీస్తుంది. యాంటీబయాటిక్ ఎక్కువ వాడటం కూడా ఈ ప్రమాదాన్ని పెంచుతుంది.
పొల్యూషన్..
పర్యావరణ, కాలుష్య కారకాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణం. చుట్టూ ఉన్న కలుషితమైన గాలి, ఇంటి లోపల, వెలుపల గాలిని ప్రమాదకరంగా మారుస్తోంది. PM2.5, వాయు కాలుష్యం నుండి వచ్చే టాక్సిన్స్ శరీరంలోకి ప్రవేశించి వాపుకు కారణమవుతాయి. రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. DNA ను దెబ్బతీస్తాయి. ఇది ధూమపానం చేయని వారిలో కూడా ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు కారణమవుతుంది.
జన్యువులు..
చిన్న వయసులోనే క్యాన్సర్ వచ్చే వ్యక్తులు జన్యు కారణాల వల్ల ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్ ఉండటం వలన BRCA వంటి సమస్యలు సంభవించవచ్చు. అనారోగ్యకరమైన వాతావరణంలో జీవించడం దీని ప్రమాదం పెరుగుతుంది.
పరీక్షలు..
యువతలో చాలామంది తమకు ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను లైట్ తీసుకుంటారు. మాది చిన్న వయసు మాకేం జబ్బులు వస్తాయి అని అనుకుంటారు. ఈ వయసులో క్యాన్సర్ ఎలా వస్తుందనే ఆలోచన యువతలో ఉంటుంది. దీనివల్ల ఈ ప్రాణాంతక వ్యాధిని గుర్తించడం ఆలస్యం అవుతుంది. చికిత్స కష్టమవుతుంది. దీర్ఘకాలిక నొప్పి, ఆకస్మికంగా బరువు తగ్గడం, మలద్వారం నుండి రక్తస్రావం, ఎప్పుడూ దగ్గు రావడం, రొమ్ములో ముద్దగా ఉండటం, మూత్ర విసర్జన అలవాట్లలో మార్పు లేదా నోటిలో పూతలు ఎక్కువ కాలం ఉంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి.
*రూపశ్రీ.