ఏం చెయ్యాలి.. వరుస డిజాస్టర్స్ కి కారణం ఇదేనా!
on Jan 23, 2026

-రామ్ పోతినేనికి ఎందుకు ఇలా జరుగుతుంది.
-నివారణ యొక్క మార్గం ఏంటి!
-ఫ్యాన్స్ ఏమంటున్నారు
-నెక్స్ట్ ప్రకటన ఎప్పుడు
తెలుగు సినిమా సిల్వర్ స్క్రీన్ కి దొరికిన మరో మిస్సైల్ లాంటి హీరో ఎనర్జిటిక్ స్టార్ 'రామ్ పోతినేని'(Ram Pothineni). రెండు దశాబ్దాల క్రితమే తన ఫస్ట్ మూవీ దేవదాసు'తో మెరుపు వేగం లాంటి యాక్టింగ్, డాన్సింగ్ ని ప్రదర్శించాడు. ఆ చిత్రం చాలా కేంద్రాల్లో వంద రోజులు జరుపుకొని సరికొత్త రికార్డులని సృష్టించింది. దీంతో ఇండస్ట్రీకి ఇంకో బడా హీరో దొరికాడని మూవీ లవర్స్ సంబరపడిపోయారు. అందుకు తగ్గట్టే వైవిధ్యమైన క్యారెక్టర్స్ ని పోషిస్తు రెడీ, మస్కా,గణేష్, రామరామ కృష్ణకృష్ణ, కందిరీగ, ఎందుకంటే ప్రేమంట,పండగ చేస్కో, నేను శైలజ , ఇస్మార్ శంకర్ వంటి పలు చిత్రాల ద్వారా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించాడు.
కానీ ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ దగ్గరనుంచి వరుస పరాజయాలని ఎదుర్కొంటున్నాడు. ఈ చిత్రానికి ముందు కూడా పరాజయాల్ని చవి చూసాడు. కానీ వరుస పరాజయాలు మాత్రం లేవు. అలాంటిది డబుల్ ఇస్మార్ట్ నుంచి వరుస పరాజయాలు రామ్ ని వెంటాడుతున్నాయి. పరాజయాల వెనక సదరు చిత్రాల కథ, కథనాలు సరిగా లేవనే అభిప్రాయాన్ని అభిమానులు వ్యక్తం చేస్తున్నారు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ చేసిన చిత్రాలైన రెడ్, స్కంద, ది వారియర్, డబుల్ ఇస్మార్ట్ లని చూసుకుంటే ఈ నాలుగు కూడా ఫుల్ మాస్ అంశాలతో తెరకెక్కాయి. సదరు చిత్రాల్లో తన క్యారక్టర్ పరంగా బాగా చేసినా అభిమానులని, ప్రేక్షకులని రీచ్ కాలేకపోయాయి. ఆ తర్వాత రీసెంట్ గా 'ఆంధ్ర కింగ్ తాలూకా' తో వచ్చాడు. ఈ చిత్రానికి ప్రచార చిత్రాల ద్వారానే మంచి క్రేజ్ ఏర్పడింది. హిట్ అవుతుందని అందరు అనుకున్నారు.
Also read: 37 ఏళ్ళ తర్వాత రిలీజ్ కాబోతున్న రజినీకాంత్ మూవీ.. కాస్టింగ్ చూస్తే మైండ్ బ్లాక్
కానీ అనూహ్యంగా పరాజయాన్ని చవి చూసింది. అభిమానులు కూడా సదరు పరాజయాన్ని జీర్ణించుకోలేకపోయారు. పైగా వరుస పరాజయాలు. దీంతో తమ హీరో హిట్ ని అందుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఈ నేపథ్యంలో తదుపరి ఎలాంటి చిత్రంతో వస్తాడనే ఆసక్తి అందరిలో ఉంది. రామ్ పోతినేని కి హిట్ కూడా చాలా అవసరం. ప్రస్థుతానికి అయితే ఇంకా కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



