జేసీ వర్సెస్ పెద్దారెడ్డి.. తాడిపత్రిలో టెన్షన్స్ పీక్స్ కు

తాడిపత్రిలో  ఉద్రిక్తతలు పీక్స్ చేరాయి. తెలుగుదేశం నాయకుడు  జేసీ ప్రభాకర్ రెడ్డి, వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య రాజకీయ వైరం పతాక స్థాయికి చేరుకుంది. ఇరువురూ సవాళ్లు ప్రతి సవాళ్లతో తాడిపత్రి పట్టణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.   దీంతో   పోలీసులు భారీగా మోహరించి, పట్టణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా భద్రతను పటిష్ఠం చేశారు.  

రాయలసీమ ప్రాజెక్టులపై చర్చకు రావాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డికి కేతిరెడ్డి పెద్దారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. దీనికి  స్పందించిన ప్రభాకర్ రెడ్డి, చర్చకు తాను సిద్ధమని, పెద్దారెడ్డి ఇంటి వద్దకే వస్తానని ప్రతిసవాల్ విసిరారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. 

ముందస్తు చర్యల్లో భాగంగా  పోలీసులు ఇరువురి నేతల నివాసాలకు సమీపంలో ఉన్న కాలేజీ మైదానాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు.  

Online Jyotish
Tone Academy
KidsOne Telugu