వామ్మో.. ఈ మూడు అలవాట్లు మానకపోతే చిత్తవైకల్యం తప్పదట..!
posted on Jan 23, 2026 1:14PM

ఒకప్పుడు వయసు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి కోల్పోవడం, శరీర వణుకు వంటి సమస్యలు వచ్చేవి. పెద్ద వయసులో ఇవి సాధారణం అని భావించేవారు. కానీ నేటి వేగవంతమైన జీవితాల్లో చిత్తవైకల్యం, పార్కిన్సన్స్ వంటి వ్యాధులు ఊహించకుండా వచ్చేస్తున్నాయి. అందులోనూ వయసుతో సంబందం లేకుండా చాలామంది ఈ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ఈ రెండు వ్యాధులు మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయి. జన్యుశాస్త్రంతో పాటు, జీవనశైలి కూడా ఈ వ్యాధులకు దోహదం చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుందని వైద్యులు చెబుతున్నారు. మెదడు ఆరోగ్యంగా ఉండాలన్నా. చిత్త వైకల్యం, పార్కిన్సన్స్ వంటి జబ్బులు రాకుండా ఉండాలన్నా మూడు అలవాట్లు పొరపాటున కంటిన్యూ చేయకూడదని వైద్యులు చెబుతున్నారు. ఆ అలవాట్లు ఏంటో తెలుసుకుంటే..
నిద్ర..
శారీరక అలసటకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా నిద్ర చాలా అవసరం. మనం నిద్రపోతున్నప్పుడు మెదడు గ్లింఫాటిక్ వ్యవస్థ ద్వారా టాక్సిన్స్ తొలగిస్తుంది. వీటిలో అమిలాయిడ్-బీటా ప్రోటీన్ ఉంటుంది. ఇది అల్జీమర్స్, చిత్తవైకల్యంతో నేరుగా కనెక్షన్ కలిగి ఉంటుంది.
అందువల్ల క్రమం తప్పకుండా రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వ్యక్తుల మెదడులో హానికరమైన ప్రోటీన్లు పేరుకుపోతాయి. ఇవి మెదడు కణాలను నాశనం చేస్తాయి. రాత్రి నిద్ర ఆరోగ్యకరంగా ఉండాలంటే ప్రతి రాత్రి ఒకే సమయంలో పడుకోవడం అలవాటు చేసుకోవాలి. పడుకునే 1-2 గంటల ముందు మొబైల్ ఫోన్ వాడటం మానేయాలి.
అల్పాహారం..
అల్పాహారం మన మెదడుకు ఇంధనంగా పనిచేస్తుంది. రాత్రంతా ఆహారం లేకుండా శరీరం విశ్రాంతి స్థితిలో ఉంటుంది. దీని తర్వాత మెదడు సరిగ్గా పనిచేయడానికి గ్లూకోజ్ అవసరం. అందువల్ల, అల్పాహారం దాటవేసే వ్యక్తులకు పోషకాలు లోపిస్తాయి. ఇది మెదడు క్షీణత లేదా మెదడు కుంచించుకుపోయే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది చిత్తవైకల్యం ప్రారంభానికి మూలం అయ్యే అవకాశం కలిగి ఉంటుంది.
అందువల్ల అల్పాహారంలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, గింజలు, తాజా పండ్లను చేర్చడం ముఖ్యం. ఇవి మెదడు కణాలను మరమ్మతు చేయడంలో సహాయపడతాయి.
వ్యాయామం..
శరీరంలోని బద్ధకం మనస్సులో బద్ధకాన్ని కలిగిస్తుంది. వ్యాయామం శరీరంలో రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది మెదడుకు తగినంత ఆక్సిజన్, పోషకాలను అందిస్తుంది. అయితే వ్యాయామం లేకపోవడం వల్ల ఊబకాయం, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఇవి పార్కిన్సన్స్, చిత్తవైకల్యానికి రెండు ప్రధాన ప్రమాద కారకాలు. శారీరకంగా చురుకుగా లేకపోవడం వల్ల మెదడులో డోపమైన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది పార్కిన్సన్స్‌కు ప్రధాన కారణం. అందువల్ల ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు చురుకైన నడక, యోగా లేదా ఏదైనా ఇతర వ్యాయామం చేయాలి.
*రూపశ్రీ.